Andhra Pradesh News Live January 28, 2025: TG Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఇసుక విధానంపై అధ్యయన కమిటీ, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 28 Jan 202505:03 PM IST
TG Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా విధానంపై ఉన్నతస్థాయి అధ్యయమని కమిటీని నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. వారం రోజుల్లో కమిటీ సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వినియోగాదారులకు తక్కువ ధరకే ఇసుక దక్కేలా చూడాలన్నారు.
Tue, 28 Jan 202504:34 PM IST
Minister Lokesh : ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించి, కో కరిక్యులమ్ యాక్టివిటీస్ రూపొందించాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఏ విద్యార్థి డ్రాప్ అవుట్ అవ్వకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధ్యాయ బదిలీ చట్టంపైనా సమావేశంలో చర్చించారు.
Tue, 28 Jan 202512:23 PM IST
- Guntur : దాదాపు నాలుగు నెలలుగా జైల్లోనే ఉన్న నందిగం సురేష్‌కు ఊరట లభించింది. గుంటూరు కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రధానంగా రెండు కేసుల్లో నందిగం సురేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Tue, 28 Jan 202512:10 PM IST
AP Tourism Investments : ఏపీ టూరిజంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. రూ.1217 కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులతో ఏపీ టూరిజం ఒప్పందాలు చేసుకుంది. దీంతో టూరిజం రంగంలో 2,567 ఉద్యోగాలు కల్పించనున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు.
Tue, 28 Jan 202511:25 AM IST
Nandyal Accident : నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Tue, 28 Jan 202510:03 AM IST
- AP Nominated Posts : టీడీపీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ ఇంఛార్జ్‌లతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, నేతల పనితీరు అంశాలపై చర్చించారు. నామినేటెడ్ పదవుల భర్తీపైనా కీలక ప్రకటన చేశారు.
Tue, 28 Jan 202509:41 AM IST
AB Venkateswara Rao : విశ్రాంతి ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు మరో ఊరట లభించింది. ఆయన సస్పెషన్ కాలాన్ని క్రమబద్దీకరిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు విడతల సస్పెన్షన్ కాలానికి మొత్తం వేతనాన్ని, అలవెన్సులను చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది.
Tue, 28 Jan 202508:56 AM IST
PM Surya Ghar Scheme : గృహ వినియోగదారులపై విద్యుత్ భారం తగ్గించేందుకు కేంద్రం పీఎం సూర్య ఘర్ పథకం అమలుచేస్తుంది. ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. తొలి విడతలో లక్ష మంది డ్వాక్రా మహిళలకు సోలార్ ప్యానళ్ల అందించేందుకు చర్యలు చేపట్టింది.
Tue, 28 Jan 202507:54 AM IST
- YS Sharmila: - కూటమి ప్రభుత్వం ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లేనని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రజెంటేషన్ నిదర్శనమని నీతి ఆయోగ్ రిపోర్ట్ ముందుపెట్టి, డబ్బులుంటేనే పథకాలని నీతి సూక్తులు చెప్పారని మండిపడ్డారు.
Tue, 28 Jan 202507:34 AM IST
- BJP Comments on Gaddar : ప్రజా యుద్ధ నౌక గద్దర్‌కు పద్మ అవార్డ్ ఇవ్వకపోవడంపై.. తెలంగాణ ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బీజేపీపై విమర్శలు గుప్పించారు. దీంతో బీజేపీ లీడర్లు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tue, 28 Jan 202506:00 AM IST
- Nellore Crime : నెల్లూరు జిల్లాలో ఘోరం జరిగింది. ప్రేమ పేరుతో నమ్మించి బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గర్భం దాల్చిన తరువాత దాన్ని తొలగించాడు. బాలికపై దాడి చేసి, మళ్లీ బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. యువకుడి మోసాన్ని గ్రహించిన బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Tue, 28 Jan 202504:07 AM IST
- APSRTC Kumbh Mela: మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ భక్తుల సౌకర్యార్థం ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు స్పెషల్ సర్వీసులును వేసింది. విజయవాడ నుంచి మహా కుంభమేళాకి స్పెషల్ సర్వీస్ నడుపుతోంది.
Tue, 28 Jan 202512:30 AM IST
- Whatsapp Governace: ఏపీలో త్వరలో వాట్సాప్ ద్వారా పౌరసేవల్ని ప్రారంభించాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజల్లో నెలకొన్న అపోహలను నివృత్తి చేయాలని అధికారులకు సూచించారు. బర్త్, డెత్ సర్టిఫికెట్లను వాట్సాప్‌లోనే పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Tue, 28 Jan 202511:30 PM IST
- AP Agri Drones: ఏపీలో వ్యవసాయ పెట్టుబడులను తగ్గించడానికి సకాలంలొ పురుగు మందులు మరియు సూక్ష్మ ఎరువులను పంటలకు అందించడానికి వ్యవసాయ డ్రోన్ పరికరాలను వినియోగించేలా సబ్సిడీపై వాటిని ప్రభుత్వం సరఫరా చేయనుంది.