Andhra Pradesh News Live January 27, 2025: CM Chandrababu : సంక్షేమ పథకాల అమలులో వెనకడుగు వేయం, అప్పు చేసైనా ఆ స్కీమ్స్ అమలు చేస్తాం-సీఎం చంద్రబాబు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 27 Jan 202502:19 PM IST
CM Chandrababu : అప్పు చేసైనా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదన్నారు. డబ్బులు ఉంటే పథకాల అమలుకు క్షణం కూడా ఆలోచించమని చెప్పారు. స్టేట్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ లో ఏపీ బీహార్ కంటే వెనుకబడిందన్నారు.
Mon, 27 Jan 202512:10 PM IST
Visakha Woman Attacked : విశాఖలో అద్దె విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో దంపతులిద్దరూ ఓ మహిళపై దాడి చేశారు. మహిళను జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Mon, 27 Jan 202511:26 AM IST
AP Registration Charges : ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నట్లు మంత్రి అనగాని తెలిపారు. ఛార్జీల పెంపు సాధారణంగా 15-20 శాతం మధ్య ఉంటుందని పేర్కొన్నారు.
Mon, 27 Jan 202511:05 AM IST
- Republic Day : దేశంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాజధాని హస్తినా నుంచి గ్రామస్థాయి వరకు గణతంత్ర దినోత్సవాన్ని భారతీయులు జరుపుకున్నారు. దేశమంతా 76వ రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటే.. ఓ ప్రాంతం మాత్రం 71వ రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Mon, 27 Jan 202510:28 AM IST
AP Andariki Illu Scheme : ఏపీ ప్రభుత్వం 'అందరికీ ఇళ్లు' పథకంపై జీవో జారీ చేసింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం మహిళల పేరిట అందించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పదేళ్ల తర్వాత యాజమాన్య హక్కులు లభించనున్నాయి.
Mon, 27 Jan 202509:40 AM IST
PMAY : పేదలు సొంతింటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎంఏవై 2.0 కింద ఆర్థికసాయం అందిస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హత పత్రాలు సమర్పించాలని అధికారులు సూచించారు. దరఖాస్తుదారుల అర్హత ప్రమాణాలను ప్రకటించారు.
Mon, 27 Jan 202508:29 AM IST
Aadhaar Bank Account Link : ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు ఆధార్-బ్యాంక్ ఖాతా లింకింగ్ కీలకంగా మారింది. మీ ఆధార్ నెంబర్ కు ఏ బ్యాంకు అకౌంట్ లింక్ అయ్యి ఉందో? ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో సులభంగా తెలుసుకోవచ్చు.
Mon, 27 Jan 202508:18 AM IST
- Dharmavaram : అనంతపురం జిల్లా ధర్మవరం మళ్లీ రణరంగంగా మారింది. ఓ నాయకుడి కోసం టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. వైసీపీ నేత బీజేపీలో చేరడానికి రెడీ అయ్యారు. దీన్ని టీడీపీ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో రెండు కార్లు, మూడు బైక్‌లు ధ్వంసం అయ్యాయి.
Mon, 27 Jan 202507:17 AM IST
- Nara Lokesh Yuvagalam: వైసీపీ పాలనపై సమరశంఖం పూరించి, రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పడంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమై రెండేళ్లు పూర్తైంది. రాష్ట్రంలో 5కోట్లమంది ఆశలు, ఆశయాలను ప్రతిబింబిస్తూ కుప్పం వరదరాజస్వామి పాదాల చెంత నుంచి 2023 జనవరి 27వతేదీన పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్లారు.
Mon, 27 Jan 202506:40 AM IST
- US New Rules: అమెరికాలో తాజా ఆంక్షల భయంతో భారతీయ విద్యార్థులు పార్ట్‌టైమ్ ఉద్యోగాలను వదులుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా స్టూడెంట్ వీసాలతో వెళ్లి అక్కడ పనులు చేస్తున్న వారు వాటిని వదిలేస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.
Mon, 27 Jan 202506:27 AM IST
- Anantapur Crime : రాప్తాడు రాజకీయం మళ్లీ హీటెక్కింది. అందుకు కారణం ఓ యువకుడు మృతిచెందడం. అతని మరణంపై అనుమానాలు ఉన్నాయని టీడీపీ చెబుతోంది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడిపై టీడీపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలకు తోపుదుర్తి అనుచరులు కౌంటర్ ఇస్తున్నారు.
Mon, 27 Jan 202506:19 AM IST
- YS Jagan: వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. బెయిల్ నిబంధనల ఉల్లంఘన జరగకపోవడంతో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేస్తామని న్యాయమూర్తి హెచ్చరించడంతో పిటిషనర్ వాటిని ఉపసంహరించుకున్నారు.
Mon, 27 Jan 202504:51 AM IST
- Tirupati Crime: తిరుపతి జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. అయితే మద్యంతాగొచ్చి చనిపోయాడనే ఆమె అందరికి ప్రచారం చేసి నమ్మించినా ఫలితం లేకుండా పోయింది.
Mon, 27 Jan 202504:04 AM IST
- AP Tourism : ఏపీ ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. అమరావతిలో రూ.500 కోట్లతో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయనుంది. అటు విశాఖలో సోమవారం ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సమావేశాన్ని నిర్వహించనున్నారు.
Mon, 27 Jan 202501:00 AM IST
- National Games: నవ్వి పోదురుగాక అన్నట్టు వ్యవహరిస్తోంది ఏపీ శాప్.. మంగళవారం నుంచి ఉత్తరాఖండ్‌లో మొదలవుతున్న జాతీయ క్రీడల్లో ఏపీ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపింది.దీంతో జాతీయ క్రీడల్లో శాప్, ఏపీ ప్రభుత్వ లోగోలు లేకుండానే పోటీల్లో పాల్గొనాలని ఏపీ ఒలంపిక్ సంఘం నిర్ణయించింది.
Mon, 27 Jan 202512:30 AM IST
- Vijaya Saireddy Reasons: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వారించినా వినకుండా, విదేశీపర్యటనలో ఉండగానే విజయసాయిరెడ్డి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించడం, మర్నాడే దానిని రాజ్యసభ అమోదించడం వెనుక ఏం జరిగిందనే చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది.
Mon, 27 Jan 202511:30 PM IST
- US Citizenship: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జన్మతా: పౌరసత్వం తీసుకున్న నిర్ణయం ప్రవాస భారతీయుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. అమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలనుకుంటున్న వారి కలలపై నీళ్లు చల్లింది. అమెరికా అధ్యక్షుడి నిర్ణయం కష్టమే అయినా దాంతో కొన్ని లాభాలు కూడా ఉన్నాయనే వాదన కూడా ఉంది.