LIVE UPDATES
Saireddy Resignation: విజయసాయిరెడ్డి రాజీనామా.. తెరవెనుక ఏమి జరిగింది… వ్యూహాత్మకమా.. వదిలించుకున్నారా?
Andhra Pradesh News Live January 24, 2025: Saireddy Resignation: విజయసాయిరెడ్డి రాజీనామా.. తెరవెనుక ఏమి జరిగింది… వ్యూహాత్మకమా.. వదిలించుకున్నారా?
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 24 Jan 202502:21 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Saireddy Resignation: విజయసాయిరెడ్డి రాజీనామా.. తెరవెనుక ఏమి జరిగింది… వ్యూహాత్మకమా.. వదిలించుకున్నారా?
- Saireddy Resignation: వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. విజయసాయిరెడ్డి రాజీనామా భవితవ్యం గురించి వైసీపీలో కొద్ది రోజులుగా ఊహాగానాలు వస్తున్నా అనూహ్యంగా నిర్ణయాన్ని ప్రకటించారు.
Fri, 24 Jan 202501:10 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: YCP MP Vijayasai Reddy : "రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను" - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం
- వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి జనవరి 25వ తేదీన రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
Fri, 24 Jan 202512:26 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Vande Bharat Express : విశాఖపట్నం- దుర్గ్ వందేభారత్‌కు కోచ్‌లు తగ్గింపు.. ఆదరణ లేకపోవడంతో ఈ నిర్ణయం!
- Vande Bharat Express : విశాఖ- దుర్గ్ వందేభారత్ రైలుకు కోచ్‌లను తగ్గించారు. ఆదరణ తక్కువగా ఉండటంతో కోచ్‌లు తగ్గించినట్లు అధికారులు ప్రకటించారు. సగానికి కోచ్‌లను తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు విశాఖపట్నం- దుర్గ్ వందేభారత్ రైలుకు 16 కోచ్‌లు ఉండగా.. ఇప్పుడు 8 కోచ్‌లే ఉండనున్నాయి.
Fri, 24 Jan 202511:15 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Chittoor Crime : మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం - ఆపై సెల్‌ఫోన్‌లో చిత్రీకరణ..!
- చిత్తూరు జిల్లాలో ఘోరం వెలుగు చూసింది. మూడేళ్ల చిన్నారిపై యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆపై సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు సీఐ మహేశ్వర్ తెలిపారు.
Fri, 24 Jan 202510:30 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala : ఫిబ్రవరి 4న తిరుమలలో రథసప్తమి - ఒకేరోజు ఏడు వాహన సేవలు, భక్తులకు టీటీడీ కీలక సూచనలు
- Ratha Saptami in Tirumala 2025: ఫిబ్రవరి 4వ తేదీన తిరుమలలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఏర్పాట్లపై ఈవో శ్యామలరావు సమీక్షించారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వివరాలను వెల్లడించింది.
Fri, 24 Jan 202510:04 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Nara Lokesh : భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలి.. నారా లోకేష్ సీరియస్!
- Nara Lokesh : మంత్రి లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కొందరు ఉపాధ్యాయులు అత్యుత్సాహం ప్రదర్శించారు. విద్యార్థులను నేలపై కూర్చోబెట్టి శుభాకాంక్షలు చెప్పించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై లోకేష్ సీరియస్ అయ్యారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కావొద్దని వార్నింగ్ ఇచ్చారు.
Fri, 24 Jan 202508:41 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Amaravati Works: ఫిబ్రవరి రెండో వారం నుంచి అమరావతి నిర్మాణ పనుల్లో వేగం, తుదిదశలో టెండర్లు
- Amaravati Works: ఫిబ్రవరి నుంచి అమరావతి నిర్మాణ పనులు వేగం పుంజుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వ భరోసా ఏడీబీ, వరల్డ‌్ బ్యాంక్, హడ్కో రుణాలు మంజూరు కావడంతో టెండర్ల ఖరారు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఫిబ్రవరి నుంచి పనులు ప్రారంభం కానున్నాయని మంత్రి నారాయణ వెల్లడించారు.
Fri, 24 Jan 202508:19 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Lands Resurvey : భూముల రీసర్వేపై సందేహాలున్నాయా...? అయితే వెంటనే ఇలా చేయండి
- రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో నిర్వహించిన సర్వేకు భిన్నంగా ప్రస్తుత సర్వే జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తాజాగా రైతులకు మరో అప్డేట్ ఇచ్చారు. రీసర్వే ప్రక్రియపై ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయడానికి హెల్ప్‌లైన్ సర్వీస్ నెంబర్ ను తీసుకువచ్చారు.
Fri, 24 Jan 202508:06 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: YSR Kadapa DTC: కడపలో దారుణం.. మహిళా అధికారిణిపై డీటీసీ లైంగిక వేధింపులు, ఆఫీసుకెళ్లి చితకబాదిన భర్త.. డీటీసీపై వేటు
- YSR Kadapa DTC: కడప జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుమార్తె వయసున్న మహిళా అధికారిణిపై కన్నేసిన డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఏకంగా ఆమె ఇంటికే వెళ్లి వేధింపులకు పాల్పడ్డాడు. సీసీ కెమెరాల్లో గమనించిన బాధితురాలి భర్త అతడికి దేహశుద్ధి చేశాడు.
Fri, 24 Jan 202507:50 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Vijayawada : పొగమంచు ఎఫెక్ట్.. విమానాల రాకపోకలు ఆలస్యం.. ఉదయం పూట ప్రయాణం జాగ్రత్త!
- Vijayawada : ఏపీలో పొగమంచు దట్టంగా కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 10 దాటినా పొగమంచు క్లియర్ కాలేదు. దీంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ముఖ్యంగా మంచు కారణంగా గన్నవరం నుంచి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని సర్వీసులు ఆలస్యంగా నడిచాయి.
Fri, 24 Jan 202505:57 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Srivari Suprabhata Seva : శ్రీవారి సుప్రభాత సేవ అంటే ఏంటీ.. ఎలా చేస్తారు? 8 ఆసక్తికరమైన అంశాలు
- Srivari Suprabhata Seva : కలియుగ వైకుంఠపతి వేంకటేశ్వరుని సుప్రభాత సేవకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. చాలా శైవ, వైష్ణవ ఆలయాల్లో సుప్రభాతం చదివే సంప్రదాయం ఉన్నా.. సుప్రభాతం అనగానే వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు. అయితే అసలు సుప్రభాతం అంటే ఏంటీ.. ఎలా చేస్తారో ఓసారి చూద్దాం.
Fri, 24 Jan 202504:51 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: APSRTC : భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. కడప జిల్లా నుంచి అరుణాచలానికి స్పెషల్ సర్వీసులు
- APSRTC : ఆర్టీసీ నిత్యం కొత్త సర్వీసులను అందుబాటులో తెస్తోంది. డిమాండ్‌ను బట్టి, ప్రయాణీకులు, యాత్రీకులు అత్యధికంగా వెళ్లే మార్గాలకు అతితక్కువ ధరకు, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుంది. అందులో భాగంగానే తమిళనాడులోని అరుణాచలం (తిరువణ్ణామలై)కి ఆరు సర్వీస్‌లను అందుబాటులోకి తెచ్చింది.
Fri, 24 Jan 202504:36 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirupati Crime: తిరుపతి జిల్లాలో ఘోరం... కన్నకూతురిపై తండ్రి అసభ్య ప్రవర్తన... పోక్సో కేసు నమోదు
- Tirupati Crime: తిరుపతి జిల్లాలో ఘోరమైన అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న కన్న కూతురుపైన ఓ కీచక తండ్రి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం తల్లికి తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ తండ్రి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
Fri, 24 Jan 202502:41 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: US Citizenship: ముందస్తు ప్రసవాలకు ప్రవాసాంధ్రుల్ల ఆదుర్దా… నెలలు నిండకుండానే ప్రసవాలకు రెడీ.. ట్రంప్ నిర్ణయంతో టెన్షన్
- US Citizenship: అమెరికా పౌరసత్వం లేని వారికి పుట్టే బిడ్డలకు జన్మతా: పౌరసత్వాన్ని రద్దు చేయాలనే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ప్రవాసుల్లో టెన్షన్ నెలకొంది. అమెరికాలో జన్మనిచ్చిన వారికి పుట్టుకతో పౌరసత్వం లభించే హక్కును ట్రంప్ రద్దు చేయనుండటంతో ఫిబ్రవరి 20లోగా ప్రసవాల కోసం హడావుడి పడుతున్నారు.
Fri, 24 Jan 202511:30 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: BJP On SteelPlant: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌కు అప్పగించేది లేదన్న కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
- BJP On SteelPlant: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌కు అప్పగించేది లేదని కార్మికుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రకటించారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలన్నదే తన సంకల్పమన్నారు.