LIVE UPDATES
Krishna Water Allocation : కృష్ణా జలాల కేటాయింపులు - సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం, ఫిబ్రవరిలో విచారణ
Andhra Pradesh News Live January 23, 2025: Krishna Water Allocation : కృష్ణా జలాల కేటాయింపులు - సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం, ఫిబ్రవరిలో విచారణ
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 23 Jan 202505:05 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Krishna Water Allocation : కృష్ణా జలాల కేటాయింపులు - సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం, ఫిబ్రవరిలో విచారణ
- ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల కేటాయింపు వ్యవహారాన్ని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో మెన్షన్ చేసింది. దీనిపై స్పందించిన ధర్మాసనం… ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2 గంటలకు వాదనలు వింటామని స్పష్టం చేసింది.
Thu, 23 Jan 202503:04 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: POPSK in Araku : ఏజెన్సీ వాసుల కష్టాలకు చెక్ - అరకులో పాస్‌పోర్ట్ సేవాకేంద్రం
- గిరిజన ప్రాంతమైన అరకులో పోస్ట్ ఆఫీస్ పాస్ పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభమైంది. ఈ కేంద్రం ఏర్పాటుతో పాస్ పోర్ట్ సేవలు ఈ మారుమూల ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ కేంద్రంలో దేశంలో పోస్ట్ ఆఫీస్ పాస్ పోర్ట్ సేవా కేంద్రాల సంఖ్య 443కు చేరింది.
Thu, 23 Jan 202501:37 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Handloom Jobs: చేనేత స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ లో ఖాళీల భర్తీకి దరఖాస్తు చేసుకోండి ఇలా..
- Handloom Jobs: జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద ఏపీలో స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ లో క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్స్, టెక్స్ టైల్ డిజైనర్స్ గా పనిచేయుటకు ఆసక్తి గత అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
Thu, 23 Jan 202501:05 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Fisheries Training: 5వ తరగతి విద్యార్హతతో చేపల పెంపకంలో శిక్షణ..నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్‌లో అవకాశం
- AP Fisheries Training: 5వ తరగతి విద్యార్హతతో చేపల పెంపకంలో మెళకువలు నేర్చుకునేందుకు నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏలూరు జిల్లా బాదంపూడిలో ఉన్న దేశీయ జల మత్స్య సంవర్థన శిక్షణా కేంద్రంలో ఈ శిక్షణ అందిస్తారు.
Thu, 23 Jan 202511:09 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Grama Ward Secretariats : సచివాలయాల వర్గీకరణకు కమిటీ ఏర్పాటు - వ్యతిరేకిస్తున్న ఉద్యోగ సంఘాలు
- గ్రామ సచివాలయల వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదికను సమర్పించడానికి ఫిబ్రవరి 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. మరోవైపు సచివాలయాల వర్గీకరణను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
Thu, 23 Jan 202511:03 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Konaseema Crime : కోనసీమ జిల్లాలో ఘోరం.. యువతిపై ప్రైవేటు కాలేజీ లెక్చరర్ అత్యాచారం!
- Konaseema Crime : కోనసీమ జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిపై ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే.. తనకు పెళ్లి అయిందని లెక్చరర్ సమాధానం ఇచ్చాడు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించింది.
Thu, 23 Jan 202510:36 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: YS Sharmila On CBN : 'అదానీపై చర్యలకు భయపడుతున్నారా..?' సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల సూటి ప్రశ్నలు
- ముఖ్యమంత్రి చంద్రబాబుపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.ప్రతిపక్షంలో ఉండగా అదానీ శత్రువుగా ఉన్నారని.. ఇప్పుడేమో అదే అదానీ మిత్రుడుగా మారిపోయారని విమర్శించారు. అదానీ వ్యవహారంపై ACBని రంగంలోకి దించాలని... నిజానిజాలు ఏంటో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.
Thu, 23 Jan 202509:31 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Vizag Steel Plant : ఒకవైపు ప్యాకేజీ ప్రకటన.. మరోపక్క భద్రతా సిబ్బంది కుదింపు.. స్టీల్ ప్లాంట్‌లో ఏం జరుగుతోంది?
- Vizag Steel Plant : వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం నేపథ్యంలో.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.11,444 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించింది. దీనిపై రాజకీయ నాయకులు, కార్మిక సంఘాల నేతలు, మేథావులు స్టీల్‌ప్లాంట్ గురించి చర్చిస్తున్నారు.
Thu, 23 Jan 202506:52 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Andhra Odisha Border : ఛత్తీస్‌గడ్‌లో వరుస ఎన్‌కౌంటర్లు.. ఏవోబీలో అలర్ట్.. కీలక నేతలందరూ అక్కడే మకాం!
- Andhra Odisha Border : మావోయిస్టు పార్టీ వరుస ఎదురు దెబ్బలతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లలో దళ సభ్యులు భారీగా హతమయ్యారు. ఇటు పార్టీలో విధాన నిర్ణయాలు తీసుకునే పొలిట్‌బ్యూరో కూడా చిక్కిపోతోంది. దీంతో ఉన్న కొందరు కూడా ఏవోబీలో తల దాచుకుంటున్నారు.
Thu, 23 Jan 202506:28 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: CRDA Airport: సీఆర్డిఏ పరిధిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఏర్పాటుకు ఎయిర్ ఇండియా సీఈఓకు లోకేష్ వినతి
- CRDA Airport: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన సీఆర్డీఏ పరిధిలో అంతర్జాయీ విమానాశ‌్రయాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ ఎయిర్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్, సిఇఓ క్యాంప్ బెల్ విల్సన్ కు విజ్ఞప్తి చేశారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో ఎయిరిండియా సీఈఓతో భేటీ అయ్యారు.
Thu, 23 Jan 202506:12 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Nellore Tragedy: నెల్లూరు జిల్లాలో విషాదం… సహాయం చేయడానికి వెళ్లిన ఇద్దరు గిరిజనుల మృత్యువాత
- Nellore Tragedy: నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. బోల్తా పడిన ఆటోని లేపేందుకు ఇద్దరు గిరిజనులు సహాయం చేసేందుకు వెళ్లారు. అయితే ఆటో లేపే క్రమంలో విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Thu, 23 Jan 202504:41 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Republic Day: ఢిల్లీ రిపబ్లిక్ పరేడ్‌లో ఏపీ శకటం ప్రత్యేకతలు ఇవే.. ఈ ఏడాది ప్రదర్శనలో ఏపీతో పాటు 26శకటాలు
- Republic Day: 76 గణతంత్ర దినోత్సవంలో భాగంగా జనవరి 26న దేశ రాజధాని న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శకటాలు ప్రదర్శన జరగనున్నట్లు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
Thu, 23 Jan 202504:04 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Aadhaar Updates: ఆధార్ సవరణ అంటే బతుకు ఆగమాగం.. ప్రాంతీయ కేంద్రం ఏర్పాటును పట్టించుకోని ఏపీ ప్రభుత్వం
- Aadhaar Updates: లేదు లేదంటూనే ఆధార్ కార్డును ప్రతి ఒక్కరి జీవితంలో ఆనివార్యం చేసిన కేంద్ర ప్రభుత్వం సవరణల విషయంలో చుక్కలు చూపిస్తోంది. ప్రైవేట్ సంస్థలకు ఆధార్ బాధ్యతల్ని అప్పగించి నరకం చూపిస్తోంది. ఏపీలో ప్రాంతీయ కేంద్రం లేకపోవడంతో వేలాది మంది ఆధార్ సవరణల కోసం అల్లాడి పోతున్నారు.
Thu, 23 Jan 202502:00 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: RJY Bus Accident: రాజమండ్రిలో ట్రావెల్స్ బస్సు బోల్తా, యువతి మృతి…మరో 5గురికి తీవ్ర గాయాలు
- RJY Bus Accident: రాజమండ్రి శివార్లలో ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ యువతి మృతి చెందింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున రాజమండ్రి శివార్లలోని కాతేరు సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
Thu, 23 Jan 202501:22 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: CBN On Lokesh: అవకాశాలు అందుకోవాల్సిందే.. వారసత్వంతో కాదు.. లోకేష్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- CBN On Lokesh: ఏపీలో నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తుపై టీడీపీ నేతల డిమాండ్లు సద్దుమణగక ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.వారసత్వంతో ఏమి రాదని అవకాశాలు అందిపుచ్చుకుంటూనే రాణిస్తారని దావోస్‌లో పేర్కొన్నారు.దావోస్‌లో ఏపీ బ్రాండ్ ప్రమోట్ చేస్తున్న మీడియా సంస్థలతో సీఎం మాట్లాడారు.
Thu, 23 Jan 202512:38 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Investments: ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణలకు సహకరించాలని బిల్‌గేట్స్‌కు ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
- AP Investments: ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ బిల్ గేట్స్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. దావోస్‌లో మూడోరోజు బిల్ గేట్స్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి పలు అంశాలపై చర్చించారు.