Andhra Pradesh News Live January 21, 2025: Sugarcane field Fire Accident : సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం, 50 ఎకరాలలో చెరుకు పంట కాలిబూడిద
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 21 Jan 202505:07 PM IST
Sugarcane field Fire Accident : సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 50 ఎకరాలలో చెరుకు తోట దగ్దం అయ్యింది. చెరుకు తోటల పైగా వెళ్తున్న కరెంటు తీగలు, ఒకదానికి ఒకటి తగలడంతో, నిప్పులు చెరుకు పంటలో పడ్డాయని రైతులు తెలిపారు.
Tue, 21 Jan 202504:38 PM IST
Janasena : జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. దీంతో గాజు గ్లాస్ సింబల్ ను ఇకపై జనసేనకు మాత్రమే కేటాయించనున్నారు. ఈ మేరకు ఈసీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు లేఖ రాసింది.
Tue, 21 Jan 202503:22 PM IST
Satyasai Crime : సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది. ఇంటిపక్కనే కూరగాయలమ్మే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ...ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Tue, 21 Jan 202502:51 PM IST
Kakinada Port : కాకినాడ పోర్టు వివాదంలో కేవీరావు, అరబిందో మధ్య రాజీ కుదిరింది. కేవీరావుకు కాకినాడ పోర్టుకు సంబంధించిన వాటాలను అరబిందో తిరిగి ఇచ్చేసింది. కాకినాడ సెజ్ అరబిందో వశమైంది.
Tue, 21 Jan 202501:23 PM IST
AP Liquor Shops : ఏపీలో మరోసారి మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది. గీత కార్మికులకు 335 మద్యం షాపులు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. జిల్లాల వారీగా దరఖాస్తులు ఆహ్వానించారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ తీసి రెండేళ్ల కాలానికి లైసెన్సులు జారీ చేయనున్నారు.
Tue, 21 Jan 202512:29 PM IST
Janasena : ఏపీలో డిప్యూటీ సీఎం అంశంగా తీవ్రంగా చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన నేతలు డిప్యూటీ సీఎం, సీఎం పదవులపై బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధిష్టానం స్పందించింది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దని కీలక ఆదేశాలు జారీ చేసింది.
Tue, 21 Jan 202510:22 AM IST
Anantapur DRO : ఒకవైపు ఎస్సీ వర్గీకరణపై కీలక సమావేశం జరుగుతున్న సమయంలో...ఓ రెవెన్యూ అధికారి సెల్ ఫోన్ లో పేకాట అడుతూ మీడియా కెమెరాకు చిక్కారు. అధికారి నిర్వాకం వైరల్ కావడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు.
Tue, 21 Jan 202509:53 AM IST
- Chittoor : జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఏపీకి చెందిన జవాన్ మృతి చెందారు. జవాన్ స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇవాళ (మంగళవారం) రాత్రి వరకు మృతదేహం గ్రామానికి చేరుకోవచ్చని స్థానికులు చెబుతున్నారు. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సహా.. పలువురు సంతాపం తెలిపారు.
Tue, 21 Jan 202506:28 AM IST
- Chiranjeevi Re Entry : మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. 2009కి ముందు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చిరు.. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కొన్నాళ్లు కేంద్రమంత్రిగా పనిచేశారు. మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టారు. తాజాగా ఆయనను రాజ్యసభకు పంపిస్తారనే చర్చ నడుస్తోంది.
Tue, 21 Jan 202505:41 AM IST
- US Citizenship Rules: అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే కీలక సంస్కరణలు చేపట్టారు. అమెరికా పౌరసత్వ నిబంధనల్లో కీలక మార్పులు చేపడుతూ ఉత్తర్వులపై సంతకాలు చేశారు. తాజా నిర్ణయంతో ఇకపై అమెరికా పౌరసత్వం లభించడం మరింత సంక్లిష్టం కానుంది.
Tue, 21 Jan 202505:03 AM IST
- AP Aadhaar Camps : చిన్నారులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తోన్నారు. రెండు విడతలుగా నిర్వహించే ఈ క్యాంపులు.. నేటి నుంచి జనవరి 24 వరకు మొదటి విడతగా జరుగుతాయి. రెండో విడతగా జనవరి 27 నుంచి జనవరి 30 వరకు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Tue, 21 Jan 202505:02 AM IST
- Visakha Fire Accident: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెట్రోకెన్ ఫార్మా కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. పరవాడ ఫార్మాసిటీలో తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలు స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
Tue, 21 Jan 202504:09 AM IST
- Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు ఏప్రిల్ నెల కోటా టిక్కెట్లు నేడు విడుదల కానున్నాయి. ఆర్జిత సేవల్లో సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల 2025 ఏప్రిల్ నెల కోటా నేడు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
Tue, 21 Jan 202503:13 AM IST
- AP Whatsapp Certificates: ఆంధ్రప్రదేశ్‌లో అతి త్వరలో వాట్సాప్‌లోనే పౌర సేవలు ప్రజలకు అందనున్నాయి. తెనాలిలో ప్రయోగాత్మకంగా వాట్సాప్ సేవల్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. మరోవైపు ప్రభుత్వ తీరుపై గ్రామ, వార్డు సచివాలయాలు, మీసేవ నిర్వాహకుల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతోంది.
Tue, 21 Jan 202502:10 AM IST
- Chandrababu Davos Tour: వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తొలిరోజు పర్యటనలో వరుసగా పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించారు. జ్యూరిచ్‌లోని హిల్టన్ హోటల్‌లో భారత అంబాసిడర్ మృధుల్ కుమార్‌తో సమావేశమయ్యారు.
Tue, 21 Jan 202512:27 AM IST
- Dy CM Demand: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై సరిగ్గా ఆర్నెల్లు నిండాయి. ఇప్పుడిప్పుడే పాలనపై ప్రభుత్వం పట్టు సాధిస్తోంది. ఈ క్రమంలో అనూహ్యంగా నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్‌ను టీడీపీ నేతలు తెరపైకి తెచ్చారు. సమయం, సందర్భం లేకుండా టీడీపీ నేతల డిమాండ్ వెనుక కారణాలు ఏమిటి.