Andhra Pradesh News Live January 20, 2025: YS Jagan : మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దు కేసులో కీలక పరిణామం, మళ్లీ ధర్మాసనాన్ని మార్చిన సుప్రీం కోర్టు రిజిస్ట్రీ
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 20 Jan 202505:33 PM IST
YS Jagan : మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ బదిలీ పిటిషన్లపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారిస్తున్న ధర్మాసనాన్ని సుప్రీం కోర్టు రిజిస్ట్రీ మార్పు చేసింది.
Mon, 20 Jan 202504:27 PM IST
AP IPS Transfers : ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 27 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ సీఎస్ విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Mon, 20 Jan 202502:28 PM IST
Lokesh Future CM : 'ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా టీడీపీ భవిష్యత్ నారా లోకేశ్, కాబోయే ముఖ్యమంత్రి ఆయనే' అని మంత్రి టీజీ భరత్ అన్నారు. దావోస్ లో పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
Mon, 20 Jan 202512:23 PM IST
Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు వీఆర్ఎస్ బాటపట్టారు. ఇప్పటికే 460 మంది ఉద్యోగులు వీఆర్ఎస్ దాఖలు చేసుకున్నారు. దీంతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. 2018 తర్వాత ఖాళీ పోస్టులు భర్తీ చేయలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Mon, 20 Jan 202511:39 AM IST
TDP On Deputy CM Issue : లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న టీడీపీ నేతల డిమాండ్లపై అధిష్ఠానం స్పందించింది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దని పార్టీ నేతలను ఆదేశించింది. ఈ అంశంపై ఎవరూ మీడియా ముందు బహిరంగ ప్రకటనలు చేయొద్దని సూచించింది.
Mon, 20 Jan 202511:13 AM IST
Drone On Pawan Camp Office : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు ఆఫీసుపై డ్రోన్ వ్యవహారం కొలిక్కి వచ్చింది. ఆ డ్రోన్ ఏపీ ఫైబర్ నెట్ సంస్థకు చెందినదిగా గుర్తించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా డ్రోన్ ఎగరవేసినట్లు పోలీసులు గుర్తించారు.
Mon, 20 Jan 202510:16 AM IST
CM Vs Deputy CM : ఏపీలో డిప్యూటీ సీఎం, సీఎం పదవులపై టీడీపీ, జనసేన మధ్య వాడీవేడి చర్చ జరుగుతోంది. లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతల ప్రతిపాదిస్తున్నారు. పవన్ కల్యాణ్ సీఎంగా చూడాలని ఉందని జనసైనికులు అంటున్నారు. ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
Mon, 20 Jan 202508:33 AM IST
- TTD Darshans: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిశాయి. వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభానికి ముందు చోటు చేసుకున్న ఘటన మినహాయిస్తే పది రోజుల పాటు సజావుగా స్వామి వారి దర్శనాలు జరిగాయి. పదిరోజుల్లో దాదాపు 6.58లక్షల మంది భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు.
Mon, 20 Jan 202508:18 AM IST
- CBN In Davos: ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం దావోస్ చేరుకుంది. మంత్రులు, అధికారులతో కూడిన ఈ బృందంలో నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి కూడా కనిపించారు.
Mon, 20 Jan 202506:41 AM IST
- Chittoor Crime: చిత్తూరు జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. భార్యతో వివాహేతర సంబంధ పెట్టుకుని, అడ్డువచ్చిన ఆమె భర్తను నిందితుడు హతమార్చారు. తొలిత ఈ కేసు సాధారణ హత్య కేసుగా పోలీసులు నమోదు చేశారు. అనంతరం విచారణ చేపట్టే పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.
Mon, 20 Jan 202505:19 AM IST
- APSRTC Special: మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ రాజమండ్రి, కొవ్వూరు నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరిగే మహా కుంభమేళాకి ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్ సర్వీస్‌ను తీసుకొచ్చింది.
Mon, 20 Jan 202504:23 AM IST
- AP TG Arogyasri: తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. దాదాపు రెండు వారాలుగా రోగులకు ఆరోగ్య శ్రీలో ప్రైవేట్ ఆస్పత్రులు సేవలు నిలిపి వేయడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. నెట్‌వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు భారీగా పేరుకు పోవడంతో ఆస్పత్రులు సేవలు నిలిపి వేశాయి.
Mon, 20 Jan 202503:12 AM IST
- Eluru Crime: ఏలూరు జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. బాలికను ఒక బాలుడు ప్రేమ పేరుతో వశపరుచుకున్నాడు. అనంతరం కిడ్నాప్ చేసి, ఆపై కారులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలుడిపై పోలీసులకు బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది.
Mon, 20 Jan 202501:28 AM IST
- Amaravati Raft Foundation: రాజధాని నిర్మాణంలో భాగంగా అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో నీటి ముంపులో ఉన్న పునాదులు ఎట్టకేలకు బయటపడ్డాయి. ఐదేళ్లకు పైగా వర్షపు నీటిలో మునిగి ఉన్న రాఫ్ట్ ఫౌండేషన్ బయటపడింది. నిర్మాణాలను కొనసాగించడానికి అనువుగానే పునాదులు ఉన్నాయని ఐఐటీ మద్రాస్ ఇప్పటికే నివేదిక ఇచ్చింది.
Mon, 20 Jan 202511:30 PM IST
- CBN On Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను చూస్తే తనకు అసూయగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ భవనాల ప్రారంభంలో ఈ వ్యాఖ్యలు చేశారు.