Andhra Pradesh News Live January 17, 2025: Chaganti Koteswara Rao : తిరుమలలో చాగంటి కోటేశ్వరరావుకు అవమానమంటూ వీడియో వైరల్, అవాస్తవ ప్రచారమని టీటీడీ క్లారిటీ
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 17 Jan 202504:36 PM IST
Chaganti Koteswara Rao : తిరుమలలో ఆథ్యాత్మిక ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావుకు అవమానం జరిగిందని, ఆయన ప్రవచనాలు రద్దు చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై టీటీడీ స్పందించింది. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చింది.
Fri, 17 Jan 202504:06 PM IST
CM Chandrababu : రాష్ట్రం, కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ తో డబుల్ డిజిట్ గ్రోత్ కల సాకారమవుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఏడు నెలల్లోనే ఏపీకి రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.
Fri, 17 Jan 202502:58 PM IST
- Tadepalli Rataining Wall: కృష్ణానదీ తీరంలో వరద ముంపుకు శాశ్వత పరిష్కారం లభించింది. దశాబ్దాలుగా కృష్ణా నది తీరంలో పేదలు నిర్మించుకున్న ఇళ్లు వరదల సమయంలో ముంపుకు గురయ్యేవి. విజయవాడ వైపు ఇప్పటికే రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టగా తాజాగా తాడేపల్లి వైపు గోడ నిర్మాణానికి క్యాబినెట్ అమోదం తెలిపింది.
Fri, 17 Jan 202501:09 PM IST
PM Modi On Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఈ విషయంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో ఉక్కు రంగం ప్రాముఖ్యతను అర్థం చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
Fri, 17 Jan 202501:05 PM IST
- Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల 2025 ఏప్రిల్ నెల కోటా షెడ్యూల్ ను ప్రకటించింది. జనవరి 21న ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
Fri, 17 Jan 202512:35 PM IST
- AP Politics : ఏపీ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉంటాయి. ఏదో ఒక ఇష్యూ ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేస్తుంటుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక.. తిరుమల లడ్డూ, రేషన్ బియ్యం మాఫియా, సనాతన హిందూ ధర్మం, తిరుపతి తొక్కిసలాట ఇష్యూలు తెరపైకి వచ్చాయి. తాజాగా లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాలనే చర్చ నడుస్తోంది.
Fri, 17 Jan 202512:22 PM IST
AP Grama Ward Secretariats : ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వర్గీకరణపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై సచివాలయ ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సచివాలయ ఉద్యోగుల వర్గీకరణపై పునరాలోచన చేయాలని సచివాలయ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
Fri, 17 Jan 202511:48 AM IST
AP Cabinet Decisions : పేదలందరికీ ఇళ్ల పథకంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకంది. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం అర్హులకు కేటాయించాలని నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాలను, ఉద్యోగులను మూడు విధాలుగా విభజించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు.
Fri, 17 Jan 202510:59 AM IST
- Visakhapatnam Steel Plant : విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించింది. రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించినట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటన విడుదల చేశారు.
Fri, 17 Jan 202510:06 AM IST
- ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయం తీసుకునేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయించింది. పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు వెంటనే ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.
Fri, 17 Jan 202508:49 AM IST
- AP Passenger Traffic : సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లిన వారు ఆ పల్లెలకు టాటా చెప్పి, బరువెక్కిన గుండెలతో పట్టణాలకు ప్రయాణం అవుతున్నారు. గురువారం నుంచి ప్రారంభమైన తిరిగి ప్రయాణాలు కొనసాగుతునే ఉన్నాయి. దీంతో రైల్వేస్టేషన్లు, బస్ కాంప్లెక్స్‌లు ప్రయాణికులతో నిండిపోయాయి.
Fri, 17 Jan 202508:43 AM IST
- Whatsapp Governance: ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి వాట్సప్‌లో పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ఈ గవర్నెన్స్‌లో మెటా సేవల్ని వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. అందరికి పౌర సేవల్ని వాట్సప్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
Fri, 17 Jan 202508:32 AM IST
- AP Tourism : ఏపీలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిని చూడటానికి పర్యాటకులు వస్తారు. వసతి కోసం సెర్చ్ చేసి.. రూమ్‌లను బుక్ చేసుకుంటారు. అయితే.. సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి టూరిస్టులను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై పర్యాటక శాఖ అలర్ట్ అయ్యింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Fri, 17 Jan 202507:53 AM IST
- AP New DGP: ఆంధ్రప్రదేశ్ డీజీపీ రేసులోకి మళ్లీ హరీష్ కుమార్ గుప్తా పేరు వినిపిస్తోంది. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు నెలాఖర్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త డీజీపీ ఎంపికపై చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన తర్వాత డీజీపీ ఎంపిక కసరత్తు కొలిక్కి రానున్నట్టు తెలుస్తోంది.
Fri, 17 Jan 202505:10 AM IST
Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం సుమారు రూ.11500 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. కేంద్రం ప్యాకేజీ ప్రకటిస్తే ప్రైవేటీకరణ ఆగినట్లేనని భావిస్తున్నారు.
Fri, 17 Jan 202505:09 AM IST
- YS Sharmila On CBN: ఏపీ సీఎం చంద్రబాబుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటంగా ప్రచారం చేసిన చంద్రబాబు అమలు చేయడానికి మాత్రం మడత పేచీలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.
Fri, 17 Jan 202503:53 AM IST
- Special trains: ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, రద్దీని తగ్గించడానికి ఈస్ట్ కోస్ట్ రైల్వేఆరు ప్రత్యేక రైలు సర్వీసులను నడపాలని నిర్ణయించింది. ప్రజలు ఈ ప్రత్యేక రైలు సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది.
Fri, 17 Jan 202503:33 AM IST
- AP Liquor Shops: ఏపీలో గీత కులాలకు కేటాయించే మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల కానుంది. గత ఏడాది అక్టోబర్ 16 నుంచి ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాలు ప్రారంభం అయ్యాయి. మొత్తం దుకాణాల్లో 10శాతం దుకాణాలను గీత కులాలకు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
Fri, 17 Jan 202502:13 AM IST
- Singarayakonda Tragedy: పండుగ సెలవుల్లో సరదాగా గడిపేందుకు సముద్ర స్నానాలకు వచ్చిన కుటుంబాన్ని సముద్రపు అలలు మింగేశాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని పాకాల సముద్ర తీరంలో జరిగిన ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, చిన్నారులు ఉన్నారు.