Andhra Pradesh News Live January 12, 2025: YS Jagan : శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? క్షమాపణలు చెబితే సరిపోతుందా?-వైఎస్ జగన్ సంచలన ట్వీట్
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 12 Jan 202504:55 PM IST
YS Jagan : తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులపై చర్యల విషయంపై ప్రభుత్వం తీరు దుర్మార్గంగా ఉందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? క్షమాపణ చెబితే సరిపోతుందా? అని ప్రశ్నించారు.
Sun, 12 Jan 202502:11 PM IST
CM Chandrababu : 24 గంటలు గ్యాస్ సరఫరా అయ్యేలా, నేరుగా పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరాను సీఎం చంద్రబాబు ఆదివారం ప్రారంభించారు. భవిష్యత్‌లో ఏపీ నుంచి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులు ఎగుమతి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Sun, 12 Jan 202510:19 AM IST
AP Roads : ఏపీలో రోడ్ల దశ మారుతోంది. వాహనదారులకు తక్షణ ఉపశమనం కోసం రోడ్లపై గుంతలను శరవేగంగా పూడుస్తు్న్నారు. పలు చోట్ల నూతన రోడ్లు వేస్తున్నారు. రానున్న ఐదేళ్లలో 40,178 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టాలని అంచనాలు వేస్తున్నారు.
Sun, 12 Jan 202509:01 AM IST
Prakasam Crime : కూతురు కూలంతర వివాహం చేసుకుందని కక్ష పెంచుకున్న తండ్రి...అల్లుడ్ని హత్య చేయించేందుకు ఓవ్యక్తికి రూ.3 లక్షలు సుపారీ ఇచ్చారు. సుపారీ తీసుకున్న వ్యక్తి హత్య చేయలేదు. అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించడంలేదని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Sun, 12 Jan 202507:09 AM IST
- తిరుమల శ్రీవారి పరకామణిలో బంగారం చోరీకి బ్యాంకు ఉద్యోగి యత్నించి దొరికాడు. 100 గ్రాముల బంగారం బిస్కెట్ ఎత్తుకెళ్తుండగా విజిలెన్స్ సిబ్బంది గుర్తించింది. బ్యాంకు ఉద్యోగి పెంచలయ్యను అదుపులోకి తీసుకుని తిరుమల వన్ టౌన్ పోలీసులకు అప్పగించింది.
Sun, 12 Jan 202506:52 AM IST
- AP Cock fight competitions : సంక్రాంతి వేళ ఏపీలో కోడి పందేలకు బరులు సిద్ధమయ్యాయి. ఓవైపు కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ… చాలాచోట్ల నిర్వాహకులు తగ్గేదేలే అన్నట్లు ముందుకెళ్తున్నారు. అక్కడక్కడ బరులపై పోలీసులు దాడులు చేస్తున్నారు. ఈసారి కూడా కోట్లల్లోనే డబ్బులు చేతులు మారే అవకాశం ఉంది.
Sun, 12 Jan 202503:09 AM IST
- AP Telangana Vande Bharat Express : సంక్రాంతి రద్దీ వేళ రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ - విశాఖపట్నం వందేభారత్ కోచ్‌ల సంఖ్యను మరింత పెంచింది. దీంతో సీట్లు భారీగా పెరిగాయి. జనవరి 13 (సోమవారం) నుంచి ఈ అదనపు కోచ్‌లు అందుబాటులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది.