Andhra Pradesh News Live January 11, 2025: AP Govt On Pending Bills : ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక, రూ.6700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 11 Jan 202504:25 PM IST
AP Govt On Pending Bills : ఏపీ ప్రభుత్వం విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులు, చిరు కాంట్రాక్టర్లకు సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చింది. పెండింగ్ బిల్లలను క్లియర్ చేస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం రూ.6700 కోట్ల నిధులతో పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆర్థికశాఖను ఆదేశించారు.
Sat, 11 Jan 202503:16 PM IST
Tirumala Leopard : తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. అలిపిరి వేదిక్ వర్సిటీ వద్ద దాటుతున్న చిరుతను చూసి భయాందోళనకు గురై బైక్ పై వెళ్తోన్న టీటీడీ ఉద్యోగి డివైడ్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డారు.
Sat, 11 Jan 202502:07 PM IST
Sankranti Celebrations : గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా సొంతూళ్లకు చేరుకుంటున్నారు. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఏర్పాట్లపై సోషల్ మీడియాలో రీల్స్ హల్ చల్ చేస్తున్నాయి.
Sat, 11 Jan 202501:43 PM IST
Sankranti Rush : సంక్రాంతికి సొంతూళ్లకు వస్తున్న ప్రయాణికులతో ఏపీలోని ప్రధాన నగరాల్లో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రజలను వీలైనంత తొందరగా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఆర్టీసీ, రవాణా అధికారులను ఆదేశించారు.
Sat, 11 Jan 202511:44 AM IST
YS Abhishek Reddy : మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో మరణించారు. ఆయన పార్థివదేహానికి పులివెందులలో వైఎస్ జగన్, భారతి నివాళులు అర్పించారు. అభిషేక్ రెడ్డి మృతికి పార్టీలకతీతంగా నాయకులు నివాళులు అర్పించారు.
Sat, 11 Jan 202510:05 AM IST
Nellore Crime : నెల్లూరులో విషాదం ఘటన చోటుచేసుకుంది. మనవడు సోఫాపై మూత్రం పోశాడని నాన్నమ్మ మందలించింది. తన కుమారుడ్ని అత్త మందలిందని మనస్తాపంతో కోడలు ఆత్మహత్య చేసుకుంది.
Sat, 11 Jan 202508:26 AM IST
Godavari Kodi Pandalu : గోదావరి జిల్లాలు కోడి పందాలకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే బరులు రెడీ చేశారు. బరులు చుట్టూ పందెంరాయుళ్లకు, చూసేవాళ్లకు ఏ లోటు రాకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు ఫేమస్ ఏరియాలు ఉన్నాయి. అవేంటంటే.
Sat, 11 Jan 202504:34 AM IST
- సంక్రాంతి పండగ వేళ ప్రజలపైన బాదుడే బాదుడుకు ప్రైవేట్ ట్రావెల్స్ పూనుకున్నాయి. పండగ కోసం స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులను నిలువుగా దోచుకుంటాయి. ప్రభుత్వ యంత్రాంగం చూసిచూడనట్లు వ్యవహరిస్తోంది. దీంతో ప్రజలపై భారం పెరుగుతోంది.
Sat, 11 Jan 202503:34 AM IST
- AP New Ration Card Updates : కొత్త రేషన్ కార్డుల జారీపై ఏపీ సర్కార్ మరో ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ఈనెలాఖారు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో రేషన్ కార్డుల జారీని ప్రారంభించనుంది. పాత కార్డుల స్థానంలో కొత్త డిజైన్ తో కార్డులను ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది.
Sat, 11 Jan 202502:18 AM IST
- AP Telangana Weather Updates : నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది.
Sat, 11 Jan 202501:07 AM IST
- గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మూడు కేటగిరీలుగా సచివాలయాలను విభజించనుంది. కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం ఉండనుంది. గ్రామాల్లో టెక్నాలజీ ప్రమోషన్‌కు ఆస్పిరేషనల్ సెక్రటరీలను నియమించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.