Andhra Pradesh News Live January 10, 2025: AP Govt On Sankranti Movies : సంక్రాంతి సినిమాల బెనిఫిట్ షోలు - ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-today andhra pradesh news latest updates january 10 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live January 10, 2025: Ap Govt On Sankranti Movies : సంక్రాంతి సినిమాల బెనిఫిట్ షోలు - ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

AP Govt On Sankranti Movies : సంక్రాంతి సినిమాల బెనిఫిట్ షోలు - ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

Andhra Pradesh News Live January 10, 2025: AP Govt On Sankranti Movies : సంక్రాంతి సినిమాల బెనిఫిట్ షోలు - ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

05:19 PM ISTJan 10, 2025 10:49 PM HT Telugu Desk
  • Share on Facebook
05:19 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 10 Jan 202505:19 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Govt On Sankranti Movies : సంక్రాంతి సినిమాల బెనిఫిట్ షోలు - ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

  • సంక్రాంతి సినిమాల బెనిఫిట్ షోలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాల మేరకు అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటల అదనపు షోలకు అనుమతి నిరాకరించింది. ఈ మేరకు తాజాగా మెమో విడుదల చేసింది. ‘గేమ్‌ ఛేంజర్‌, ‘డాకు మహారాజ్‌’ మూవీ టికెట్‌ ధరల పెంపు, అదనపు షోలపై క్లారిటీ ఇచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 10 Jan 202502:15 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Govt Schools : పాఠ‌శాల విద్యలో సంస్క‌ర‌ణ‌లు…! జీవో 117 ర‌ద్దు, మార్పులతో కొత్త ఉత్తర్వులు

  • ఏపీలోని కూటమి ప్రభుత్వం జీవో 117 ను రద్దు చేసింది. విద్యా సంస్క‌ర‌ణ‌లకు సంబంధించి ఇంచుమించు అదే విధానాల‌తో తాజాగా ఉత్వ‌ర్వులు జారీ చేసింది. పాత జీవోతో పోల్చితే  కొన్ని మార్పులు చేసింది. 6 ర‌కాల పాఠ‌శాల‌ల‌కు బ‌దులు ఐదు ర‌కాల పాఠ‌శాల‌ల విధానాన్ని ముందుకు తీసుకువ‌చ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 10 Jan 202511:34 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirupati Stampede Incident : 'మీరంతా క్షమాపణ చెప్పి తీరాల్సిందే' - టీటీడీ పాలకమండలికి డిప్యూటీ సీఎం పవన్ అల్టిమేటం..!

  • Deputy CM Pawan Comments On TTD : తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఘటనకు బాధ్యత తీసుకుని.. టీటీడీ ఛైర్మన్, ఈవో, జేఈవోతో పాటు పాలకమండలి క్షమాపణలు చెప్పాలని సూచించారు. తొక్కిసలాట సంఘటన తనకు ఎంతో బాధను కలిగించిందని వ్యాఖ్యానించారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 10 Jan 202508:40 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Skill Census: ఏపీలో స్కిల్ సెన్సస్ ప్రి-వాలిడేషన్ కోసం ఇన్ఫోసిస్ తో ఒప్పందం, నారా లోకేష్ సమక్షంలో ఇన్ఫోసిస్ తో ఎంఓయు

  • AP Skill Census: రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు దేశంలోనే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్కిల్ సెన్సస్ కార్యక్రమాన్ని మరింత ప్రయోజనకరంగా చేపట్టేందుకు అవసరమైన సాంకేతిక సహకారం అందించడానికి ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ ముందుకు వచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 10 Jan 202508:20 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Prakasam Crime: ప్ర‌కాశం జిల్లాలో ఘోరం... విద్యార్థినుల‌పై ఇన్‌ఛార్జి ప్రిన్సిప‌ల్‌ లైంగిక వేధింపులు..

  • Prakasam Crime: ప్ర‌కాశం జిల్లాలో ఘోరమైన ఘ‌ట‌న చోటు చేసుకుంది.విద్యార్థినుల‌పై ఇన్‌ఛార్జి ప్రిన్సిప‌ల్‌ లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు.స‌హ‌క‌రిస్తే మార్కులేస్తాన‌ని, కాదంటే ఫెయిల్ చేస్తాన‌ని వేధింపుల‌కు దిగాడు. వేధింపులు తాళ‌లేక విద్యార్థినులు  ఫిర్యాదు చేయ‌డంతో ఆ లెక్చ‌ర‌ర్‌పై కేసు న‌మోదు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 10 Jan 202508:02 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Jana sadharan Trains: రైల్వే గుడ్‌న్యూస్‌, సంక్రాంతికి జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు, వందే భార‌త్‌కు అద‌న‌పు కోచ్‌లు

  • Jana sadharan Trains: ప్ర‌యాణికుల‌కు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. .సంక్రాంతికి జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తెచ్చింది. అలాగే విశాఖ‌పట్నం-సికింద్రాబాద్ వందే భార‌త్‌కు అద‌న‌పు కోచ్‌లు కూడా అందుబాటులోకి తెచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 10 Jan 202507:47 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Building Plan Rules: ఏపీలో భవన నిర్మాణ అనుమతులు మరింత సరళం చేస్తూ ఉత్తర్వులు, రియల్‌ ఎస్టేట్‌కు ఊతం

  • AP Building Plan Rules: ఏపీలో భవన నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణ‍యం తీసుకుంది. నిర్మాణ రంగం సమస్యల్ని పరిష్కరించే క్రమంలో నిబంధనల్ని సడలించింది. అనుమతులు, లే ఔట్లకు అనుమతుల్ని సులభతరం చేస్తూ ఉత్తర్వులు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 10 Jan 202506:53 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: TDP Cadre: టీడీపీ క్యాడర్‌ వైఖరితో చంద్ర బాబుకు చిక్కులు, సోషల్‌ మీడియాలో ఎడాపెడా విమర్శలు

  • TDP Cadre: తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడకు, కూటమి ప్రభుత్వానికి  ప్రతిపక్ష వైసీపీతో కంటే సొంత పార్టీ క్యాడర్‌తోనే చికాకులు ఎక్కువవుతున్నాయి. వైసీపీ ప్రశాంతంగా ఉందనుకుంటే టీడీపీ క్యాడర్‌ సోషల్ మీడియాలో చేస్తున్న హడావుడితోనే ఆ పార్టీకి ఎక్కువ డామేజ్ జరుగుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 10 Jan 202504:51 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Chandrababu Unhappy: తిరుపతి వెళ్లినా స్వామి దర్శనం కాకుండానే వెనక్కి వచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎందుకంటే?

  • Chandrababu Unhappy: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి వెళ్లినా స్వామి వారి దర్శనం చేసుకోకుండానే ఇంటికి తిరిగి వచ్చేశారు. తిరుపతిలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో గురువారం తిరుపతిలో పర్యటించిన సీఎం రాత్రికి తిరిగి అమరావతి వెళ్లిపోయారు. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 10 Jan 202502:24 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: TTD Chairman Vs EO: నువ్వంటే నువ్వు అంటూ సీఎం ముందే తగువులాట..ఒకరిపై ఒకరు ఫిర్యాదులు.. చర్చనీయాంశంగా ఈవో, ఛైర్మన్ వైఖరి

  • TTD Chairman Vs EO: తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రంలో జరిగిన తొక్కిసలాట బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లిన సీఎం ఈ ఘటనపై సమీక్షిస్తున్న సమయంలో టీటీడీ ఈవో, ఛైర్మన్ ఘర్షణ పడటం చర్చనీయాంశంగా మారింది. సీఎం సమక్షంలోనే  ఛైర్మన్‌,ఈవో తగువులాడుకోవడంతో టీటీడీ సమన్వయ లోపాన్ని బయటపెట్టింది. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 10 Jan 202501:47 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumla Darshans: తిరుమలలో మొదలైన వైకుంఠ ద్వార దర్శనాలు, గోవింద నామ స్మరణతో మార్మోగుతున్న తిరుమల గిరులు

  • Tirumla Darshans: గోవింద నామ స్మరణతో తిరుమల గిరులు మార్మోగుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు పోటెత్తారు.  రెండు,మూడు రోజుల ముందే తిరుమల చేరుకున్న భక్తులు వైకుంఠ ద్వార దర్శనాల కోసం క్యూలైన్లలో ఎదురు చూస్తున్నారు.వైైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవదేవుడి దర్శనం భారీగా వచ్చారు.
పూర్తి స్టోరీ చదవండి