LIVE UPDATES
YS Sharmila : 'విజయసాయిరెడ్డి చెబుతుంటే చాలా బాధ వేసింది... జగన్ క్యారెక్టర్ సున్నా' - వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
Andhra Pradesh News Live February 7, 2025: YS Sharmila : 'విజయసాయిరెడ్డి చెబుతుంటే చాలా బాధ వేసింది... జగన్ క్యారెక్టర్ సున్నా' - వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 07 Feb 202504:06 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: YS Sharmila : 'విజయసాయిరెడ్డి చెబుతుంటే చాలా బాధ వేసింది... జగన్ క్యారెక్టర్ సున్నా' - వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
- వైఎస్ జగన్ క్రెడిబులిటి సున్నా అంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మాటలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉందంటూ విమర్శలు గుప్పించారు. విజయసాయి రెడ్డి మాట్లాడాల్సిన అంశాలపై స్వయంగా జగన్ నోట్ ఇచ్చారని చెప్పారు. సాయిరెడ్డి చెప్పిన విషయాలు విని చాలా బాధ వేసిందన్నారు.
Fri, 07 Feb 202512:30 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Visakhapatnam : స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై ఆదివాసీ నేతల ఆగ్రహం.. రెండ్రోజులు ఏజెన్సీ బంద్!
- Visakhapatnam : ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వివాదంలో చిక్కుకున్నారు. 1/70 చట్టాన్ని సవరించాలని ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ అయన్న ఏమన్నారు.. 1/70 చట్టం ఏంటి.. ఓసారి చూద్దాం.
Fri, 07 Feb 202511:11 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Assembly Budget Session 2025 : ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- AP Assembly Budget Session 2025 : ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండనుంది. ఫిబ్రవరి 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Fri, 07 Feb 202510:56 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Tourism : తిరుపతి నుంచి కొత్తగా నాలుగు బస్ ప్యాకేజీలు.. తక్కువ ధరలకే యాత్రకు వెళ్లొచ్చు!
- AP Tourism : బస్ ప్యాకేజీల ద్వారా తిరుమల దర్శన టిక్కెట్లు రద్దయ్యాయి. దీంతో ఆర్థికంగా నష్టపోయిన ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ.. తమకు చెందిన బస్సులను ఇతర మార్గాల్లో నడిపేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే తిరుపతి నుంచి కొత్తగా నాలుగు బస్ ప్యాకేజీలను ప్రకటించింది.
Fri, 07 Feb 202510:06 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Ministers Rankings : ర్యాంకులు ఎవరినీ ఎక్కువ చేయడానికి కాదు - సీఎం చంద్రబాబు
- మంత్రులకు ర్యాంకుల విషయంపై సీఎం చంద్రబాబు స్పందించారు. కేవలం పనులు వేగవంతం కోసమే ర్యాంకులన్నారు. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అని చెప్పడం కోసం కాదని స్పష్టం చేశారు. పైస్థాయి నుంచి చిరుద్యోగి వరకు పనిపై దృష్టి పెడితేనే ఫలితాలు ఉంటాయని ట్వీట్ చేశారు.
Fri, 07 Feb 202509:36 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Vijayasai Reddy : 'క్యారెక్టర్ ఉంది కాబట్టే అలా చేశా'..! జగన్ వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్
- వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఎలాంటి ప్రలోభాలకీ లొంగలేదని స్పష్టం చేశారు. భయం అనేది తనలో ఏ అణువు అణువులోనూ లేదని ట్వీట్ చేశారు. నేతల రాజీనామాలపై నిన్న మాట్లాడిన జగన్.. రాజకీయాల్లో ఉన్నపుడు విశ్వసనీయతకు అర్థం తెలిసి ఉండాలంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే
Fri, 07 Feb 202507:04 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: BC Corporation Loans: బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పెంపు.. ఈ నెల 12 వరకూ దరఖాస్తుల స్వీకరణ
- BC Corporation Loans: ఏపీలో బీసీ కార్పోరేషన్ ద్వారా బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అందించే రుణాలకు దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్టు మంత్రి సవిత ప్రకటించారు.ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.ఇప్పటికే స్వయం ఉపాధి రుణాలకు ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు.
Fri, 07 Feb 202506:59 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Newyork Suicide: అమెరికాలో తెలుగు విద్యార్థి సాయికుమార్ రెడ్డి ఆత్మహత్య.. డిపోర్టేషన్ భయంతో సూసైడ్
- Newyork Suicide: అమెరికా నుంచి డిపోర్టేషన్ భయంతో ఓ తెలుగు విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని సాయికుమార్ రెడ్డిగా గుర్తించారు. పనిచేస్తున్న కార్యాలయంలోనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని పాస్‌పోర్ట్‌ను ఫెడరల్ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో ఆందోళనకు గురైనట్టు స్నేహితులు చెబుతున్నారు.
Fri, 07 Feb 202506:11 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Special Trains : కుంభమేళా యాత్రికులకు గుడ్‌న్యూస్.. ఏపీ నుంచి 8 స్పెషల్ ట్రైన్స్.. పూర్తి వివరాలు ఇవే
- Special Trains : మహా కుంభమేళాకు వెళ్లే యాత్రికులకు, భక్తులకు ఇండియన్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు.. విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి నుంచి వివిధ జిల్లాల మీదుగా స్పెషల్ ట్రైన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Fri, 07 Feb 202505:53 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Sake Sailajanath: వైసీపీలో చేరిన మాజీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్
- Sake Sailajanath: మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వైసీపీలో చేరారు. తాడేపల్లిలో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. 2023లో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమైన సమయంలో చంద్రబాబు అరెస్ట్ కావడంతో శైలజానాథ్ ఆ ప్రయత్నం విరమించుకున్నారు.
Fri, 07 Feb 202505:24 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Vijayawada West Bypass : నరకయాతన నుంచి విముక్తి.. బెజవాడ వాసుల దశాబ్దాల కల సాకారం!
- Vijayawada West Bypass : విజయవాడ వాసుల దశాబ్దాల కల సాకారం కాబోతోంది. ట్రాఫిక్ వల్ల ఎన్నో ఏళ్లుగా పడుతున్న నరకయాతన నుంచి విముక్తి లభించనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విజయవాడ పశ్చిమ బైపాస్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
Fri, 07 Feb 202505:10 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Trains Cancellation: ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా రైళ్ల రద్దు
- Trains Cancellation: తెలుగు రాష్ట్రాల్లో భారీగా రైళ్లు రద్దు చేశారు. విజయవాడ రైల్వే డివిజన్‌లోని నూజివీడు-వట్లూరు- ఏలూరు నాన్ ఇంటర్ లాకింగ్ పనులతో ఏపీలో, ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద నాన్ ఇంటర్ లాకింగ్ పనులతో తెలంగాణలో రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Fri, 07 Feb 202504:03 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Guntur Crime: గుంటూరు జిల్లాలో ఘోరం, ప్రేమ పేరుతో వెంటపడి, పెళ్లి చేసుకోమంటే ఆత్మహత్యకు పురిగొల్పాడు..
- Guntur Crime: గుంటూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ప్రేమ పేరుతో వెంటపడి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. తీరా పెళ్లి చేసుకోమనేసరికి చేతిని చాకుతో కోసి, ఎలుకల మందు ఇచ్చి ఆత్మహత్యకు పురిగొల్పాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Fri, 07 Feb 202501:09 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Liquor Prices: ఏపీలో త్వరలో పెరుగనున్న మద్యం ధరలు! దుకాణాలకు కమిషన్ల పెంపుకు సర్కారు అమోదం
- AP Liquor Prices: ఏపీలో మద్యం ధరలు త్వరలో పెరుగ నున్నాయి. ఓ వైపు ప్రైవేట్ మద్యం దుకాణాలతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోగా మరోవైపు లైసెన్స్ దారులకు నష్టాలు వస్తుడంటంతో ధరల్ని పెంచేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధం అవుతోంది.
Fri, 07 Feb 202512:13 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Inter Hall Tickets: వాట్సాప్ మనమిత్రలో ఏపీ ఇంటర్మీడియట్ హాల్ టిక్కెట్లు లభ్యం…
- AP Inter Hall Tickets: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ హాల్ టిక్కెట్లు విడుదలయ్యాయి. ప్రాక్టికల్ పరీక్షలు మొదలు కానుండటంతో ఇంటర్ విద్యార్థులకు హాల్ టిక్కెట్లను జారీ చేస్తున్నారు. ఈ ఏడాది కాలేజీలతో సంబంధం లేకుండా నేరు వాట్సప్ మనమిత్రలోనే హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించారు.