Andhra Pradesh News Live February 3, 2025: Amaravati : అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ నాలుగేళ్లలో పూర్తి, అమృత్ భారత్ కింద 20 స్టేషన్ల అభివృద్ధి -విజయవాడ డీఆర్ఎం
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 03 Feb 202505:39 PM IST
Amaravati Railway Line: రైల్వే బడ్జెట్ లో ఏపీకి భారీగా నిధులు కేటాయించారని విజయవాడ డీఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ల కింద 20 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్నారు.
Mon, 03 Feb 202501:38 PM IST
- Sonu Sood Charity: ఆరోగ్యం-సామాజిక సంక్షేమాలకు సేవలు అందించే ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ రాష్ట్రంలో ప్రజారోగ్య సంరక్షణ కోసం నాలుగు అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు సోనూ సూద్ సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు అంబులెన్స్‌లు అప్పగించారు.
Mon, 03 Feb 202512:14 PM IST
Tanuku SI Audio Viral : తణుకు ఎస్సై సత్యనారాయణ మూర్తి ఆత్మహత్యకు ముందు తన స్నేహితుడితో మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది. తనను ఇద్దరు అధికారులు వేధించారని, ఎంతగా ప్రాధేయపడినా వినిపించుకోవడంలేదని మూర్తి ఆవేదన చెందారు. తనకు సంబంధం లేని విషయంలో ఇరికించారని కన్నీళ్లు పెట్టుకున్నారు.
Mon, 03 Feb 202512:03 PM IST
- AP Engineering Colleges : ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెంపుదలపై దృష్టి సారించాలని.. మంత్రి నారా లోకేష్ సూచించారు. గత పాలకుల కారణంగా విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిందన్నారు. క్యాలెండర్ ప్రకారం రీయంబర్స్‌మెంట్ డబ్బులు విడుదల చేయాలని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు విజ్ఞప్తి చేశాయి.
Mon, 03 Feb 202511:13 AM IST
- Railway Budget : రైల్వే బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు జరిగాయి. ఏపీకి రూ.9,417 కోట్లు కేటాయించినట్టు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. తెలంగాణకు రూ.5337 కోట్లు కేటాయించారు. త్వరలో తెలంగాణకు నమో భారత్, అమృత్ భారత్ రైళ్లు రానున్నాయి.
Mon, 03 Feb 202510:59 AM IST
- Godavarru Sarpanch : పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు. అలాంటి పల్లెల అభివృద్ధి బాధ్యత ప్రథమ పౌరులు సర్పంచులపై ఉంటుంది. అయితే నిధుల లేమి, నిర్లక్ష్యం కారణంగా.. చాలామంది పనులు చేయలేకపోతున్నారు. కానీ.. గొడవర్రు గ్రామ సర్పంచి మాత్రం అందరికంటే భిన్నం. పట్టుదలతో తన గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నారు.
Mon, 03 Feb 202508:55 AM IST
PM SVANidhi Scheme : ఆధార్ కార్డుపై ఎలాంటి హామీ లేకుండా తక్కువ వడ్డీకి కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా బ్యాంకులు రుణాలు అందిస్తున్నాయి. పీఎం స్వనిధి పథకంలో భాగంగా చిరు వ్యాపారులకు లోన్లు ఇస్తున్నాయి. సకాలంలో రుణం తిరిగి చెల్లిస్తే మరోసారి రుణం మంజూరు చేస్తారు.
Mon, 03 Feb 202507:36 AM IST
- Union Budget: బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు చూస్తే వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇచ్చిన ఆక్సిజన్‌లా ఉందని చంద్రబాబు చెప్పారు. కేంద్రం అందిస్తున్న ఆర్థిక చేయూతతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తమ ముందున్న లక్ష్యం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
Mon, 03 Feb 202507:12 AM IST
- WakeUp Whatsapp: ఏపీ ప్రభుత్వం ప్రజలకు సరళవంతమైన పౌరసేవల్ని అందించేందుకు ప్రారంభించిన మనమిత్ర వాట్సాప్ సేవలు మొరాయిస్తున్నాయి. గత వారం మంత్రి నారా లోకేష్ మెటా భాగస్వామ్యంతో మనమిత్ర వాట్సాప్ సేవల్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు 161 సేవల్ని వాట్సాప్‌లోనే అందుకోవచ్చని ప్రకటించారు.
Mon, 03 Feb 202506:12 AM IST
- Hindupur Municipality: రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీల్లో ఖాళీ అయిన స్థానాలను టీడీపీ దక్కించుకుంది. హిందూపురంలో విప్ జారీ చేసినా వైసీపీకి ఓటమి తప్పలేదు. టీడీపీ అభ్యర్థి రమేష్ కుమార్ మునిసిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. నెల్లూరు, ఏలూరులో డిప్యూటీ మేయర్ స్థానాలను టీడీపీ దక్కించుకుంది.
Mon, 03 Feb 202504:14 AM IST
- Kakinada : ఏపీలో వైన్ షాపులను దక్కించుకోవడానికి మద్యం వ్యాపారులు లక్షల్లో వెచ్చించారు. కొన్ని చోట్ల ఎంతో కష్టపడి షాపులను ఏర్పాటు చేసుకున్నారు. కానీ.. ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగడం లేదు. దీంతో ఆఫర్లు ప్రకటిస్తూ.. మందుబాబులను ఆకర్షిస్తున్నారు. తాజాగా కాకినాడలో ప్రకటించిన ఆఫర్ వైరల్ అవుతోంది.
Mon, 03 Feb 202504:13 AM IST
- Guntur Rape and Murder: గుంటూరు జిల్లాలో ఉన్మాది దాష్టీకానికి వృద్ధురాలు బలైపోయింది. ఒంటరిగా నివస్తున్న వృద్ధురాలిపై కన్నేసి బలాత్కరించి హత్యకు పాల్పడటం సంచలనం సృష్టించింది. నిందితుడు ఇటీవల బెయిల్‌పై విడుదలైనట్టు గుర్తించారు.
Mon, 03 Feb 202512:35 AM IST
- Edible Oil Prices: ఏపీలో వంట నూనెల ధరల నియంత్రణ ముణ్ణాళ్ల ముచ్చటగా మారింది. సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గత ఏడాది ఆకస్మిక తనిఖీల పేరుతో చేసిన హంగామా అటకెక్కింది. మార్కెట్‌లో వంట నూనెల ధరలు మళ్లీ మొదటికి వచ్చాయి. సన్న బియ్యం ధరల బాటలోనే వంట నూనెల ధరలు కూడా పైకి ఎగబాకుతున్నాయి.
Mon, 03 Feb 202512:14 AM IST
- KLU NAAC Gradings: నాక్ గ్రేడింగ్స్ కోసం తనిఖీ బృందాలకు ముడుపులు చెల్లించిన వ్యవహారంలో నిందితులకు ప్రత్యేక కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. వర్శిటీ సిబ్బందిలో అంతర్గత కుమ్ములాటలు, ప్రైవేట్ వర్శిటీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో పక్కా సమాచారంతో సీబీఐ దాడులు చేసి నిందితుల్ని రిమాండ్‌కు పంపింది.