Andhra Pradesh News Live February 2, 2025: Chittoor Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీ బస్సు ఢీ- నలుగురి మృతి-today andhra pradesh news latest updates february 2 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live February 2, 2025: Chittoor Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీ బస్సు ఢీ- నలుగురి మృతి

Chittoor Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీ బస్సు ఢీ- నలుగురి మృతి(Photo Source @APSDMA Twitter)

Andhra Pradesh News Live February 2, 2025: Chittoor Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీ బస్సు ఢీ- నలుగురి మృతి

05:28 PM ISTFeb 02, 2025 10:58 PM HT Telugu Desk
  • Share on Facebook
05:28 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sun, 02 Feb 202505:28 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Chittoor Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీ బస్సు ఢీ- నలుగురి మృతి

  • Chittoor Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బస్సు ఢీకొన్న ఘటనలో 4గురు మృతి చెందారు, మరో 14 మంది గాయపడ్డారు. బాధితులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 02 Feb 202504:13 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Nagababu : పెద్దిరెడ్డి, జగన్, ద్వారంపూడి ఎవ్వరినీ వదలం, మెడపట్టి లోపలికి తోస్తాం- నాగబాబు సంచలన వ్యాఖ్యలు

  • Nagababu : సామాజిక మాధ్యమాల్లో, ఇళ్లల్లో కూర్చొని కాదు అసెంబ్లీకి వెళ్లి మాట్లాడాలని వైసీపీ ఎమ్మెల్యేలకు  నాగబాబు సవాల్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా నోరు జారి... ఇప్పుడు కుంటి సాకులు చెబుతున్నారన్నారు. పెద్దిరెడ్డి ఎవరెవరి ఆస్తులైతే కబ్జా చేశారో అన్నీ బయటకు తీస్తామన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 02 Feb 202501:38 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Mudragada House Attack : ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి, జనసేనపై ఆరోపణలు

  • Mudragada House Attack : వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై ఓ వ్యక్తి ట్రాక్టర్ తో దాడికి దిగాడు. ఇంటి గేటును, కారును ట్రాక్టర్ తో ఢీకొట్టాడు. తనకు రూ.50 వేలు ఇస్తానంటే దాడి చేసినట్లు ఆ యువకుడు చెప్పాడని ముద్రగడ అనుచరులు చెప్పారు. వైసీపీ నేతలు ముద్రగడను పరామర్శించారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 02 Feb 202509:40 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: West Godavari : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కోళ్లలో అంతుచిక్కని వైరస్, లక్షల్లో జీవాలు మృత్యువాత

  • West Godavari : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అంతుచిక్కని వైరస్ సోకి లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే 40 లక్షలకు పైగా కోళ్లు మృతి చెందినట్లు పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. గత రెండు నెలలుగా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉందని రైతులు అంటున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 02 Feb 202509:10 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Eluru Crime : బాలుడిని చిత్రహింసలు పెట్టిన మారు తండ్రి.. జంగారెడ్డిగూడెంలో దారుణం

  • Eluru Crime : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణ ఘటన జరిగింది. బాలుడిని చిత్రహింసలు పెట్టాడు మారు తండ్రి. ఫోన్ ఛార్జింగ్ వైరుతో కొట్టి చిత్రహింసలకు గురిచేయడంతో.. బాలుడి శరీరం కమిలిపోయింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు బాలుడు రాహుల్.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 02 Feb 202507:23 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Kadiri Sub Registrar : టీ కొట్టులో రిజిస్ట్రేషన్ దస్త్రాలపై సంతకాలు.. ఈ ఆఫీసర్ స్టైలే వేరు!

  • Kadiri Sub Registrar : ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా రిజిస్ట్రేషన్ల గురించే చర్చ జరుగుతోంది. అందుకు కారణం ఛార్జీలు పెరగడమే. భారం పెరగకుండా చాలామంది జనవరి చివరలో రిజిస్ట్రేషన్లు పెట్టుకున్నారు. ఈ సమయంలో కదిరి రిజిస్ట్రార్ తీరు చర్చనీయాంశంగా మారింది. ఆయన టీ షాపులోనే దస్త్రాలపై సంతకాలు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 02 Feb 202505:50 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Registration : కాసుల వర్షం కురిపించిన రిజిస్ట్రేషన్లు.. రికార్డు స్థాయిలో ఆదాయం.. ఈ జిల్లాల్లోనే ఎక్కువ!

  • AP Registration : ఏపీ ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా భారీగా ఆదాయం వచ్చింది. ఒక్కరోజులోనే రూ.139 కోట్ల ఆదాయం జమ అయ్యింది. విశాఖ, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఎక్కువగా రిజిస్టేషన్లు జరిగాయి. ఈ జిల్లాల నుంచి భారీగా ఆదాయం వచ్చింది. ఈ స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగడానికి కారణం ఏంటో ఓసారి చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 02 Feb 202504:31 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vijayawada : సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై విద్యార్థులకు ప్రత్యేక దర్శనం

  • Vijayawada : బెజవాడ దుర్గమ్మ ఆలయ అధికారులు విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన విద్యార్థులకు ఉచిత దర్శనం సౌకర్యం కల్పించారు. సరస్వతీదేవి జయంతిని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. వేలాది మంది విద్యార్థులు అమ్మవారి దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 02 Feb 202512:47 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TG Temperatures : తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు - అప్పుడే మొదలైన ఎండలు..!

  • AP Telangana Temperatures : తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎండల ప్రభావం కనిపిస్తోంది. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత బాగా ఉంటోంది. దీంతో అప్పుడే సమ్మర్ వచ్చేసిందా అన్నట్లు అనిపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు హైరానా అవుతున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి