Andhra Pradesh News Live February 19, 2025: Case Filed On Jagan : గుంటూరు మిర్చి యార్డు పర్యటన, మాజీ సీఎం జగన్ సహా 8 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 19 Feb 202505:14 PM IST
Case Filed On Jagan : మిర్చి రైతులకు గిట్టుబాటు ధరను డిమాండ్ చేస్తూ మాజీ సీఎం జగన్ గుంటూరు మిర్చి యార్డులో పర్యటించారు. ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉందని చెప్పినా నిబంధనలు ఉల్లంఘించారని వైఎస్ జగన్ సహా 8 మందిపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
Wed, 19 Feb 202512:48 PM IST
AP Lawyers Practice : ఏపీలో న్యాయవాదుల ప్రాక్టీస్ దరఖాస్తు గడువు పెంచుతూ రాష్ట్ర బార్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులకు మార్చి 15న ఆఖరు తేదీగా నిర్ణయించారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసేవారు తమ ప్రాక్టీస్‌కు సంబంధించి ధృవీకరణ పత్రాలు బార్ కౌన్సిల్‌కు సమర్పించాల్సి ఉంటుంది.
Wed, 19 Feb 202511:37 AM IST
- Minister Achhennaidu: ఏపీ ప్రజలు తిరస్కరించడంతో జగన్ మానసిక ఆరోగ్యం పాడైనట్టుందని మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. ఐదేళ్ల పాటు తాడేపల్లి ప్యాలస్ కు పరిమితం అయిన జగన్ ఇప్పుడు రోడ్డుపై కి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని విమరశించారు.
Wed, 19 Feb 202511:23 AM IST
APSRTC Special Services : పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు డిపోల నుంచి రామతీర్థం, పుణ్యగిరి, శ్రీశైలం మల్లన్న క్షేత్రాలకు స్పెషల్ బస్సులు నడపనున్నారు.
Wed, 19 Feb 202511:14 AM IST
- AP Contract Lecturers: డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో పని చేసే కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణపై ప్రభుత్వం విముఖత చూపుతుండటంతో లెక్చరర్లు పోరాటానికి సిద్ధం అవుతున్నారు. తమ సర్వీసులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తున్నారు.
Wed, 19 Feb 202510:56 AM IST
- AP Registrations: వాట్సాప్‌లో ప్రభుత్వ సేవలన్నీ అందిస్తున్నామని చెప్పుకునే ఏపీలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సర్వర్లు మొరాయిస్తుండటంతో జనానికి చుక్కలు కనిపిస్తున్నాయి.బుధవారం గంటల పాటు సర్వర్లు నిలిచిపోవడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి.దీంతో క్రయ, విక్రయాల కోసం వచ్చిన వారికి చుక్కలు కనిపించాయి.
Wed, 19 Feb 202510:55 AM IST
- టీడీపీ, వైసీపీలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. సూపర్ సిక్స్ పథకాలపై చంద్రబాబు తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్ళని జగన్ కి, వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజా సమస్యల మీద మాట్లాడే నైతికత లేదని కామెంట్స్ చేశారు.
Wed, 19 Feb 202510:17 AM IST
Central Govt NDRF Funds : ఏపీ, తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అదనంగా ఎన్డీఆర్ఎఫ్ నిధులను విడుదల చేసింది. గత ఏడాదిలో సంభవించిన వరదలు, విపత్తుల సాయంగా కేంద్రం రూ.1554.99 కోట్లు మంజూరు చేసింది.
Wed, 19 Feb 202508:37 AM IST
- మిర్చి రైతుల ఇబ్బందులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పట్టడం లేదని జగన్ ఫైర్ అయ్యారు. బుధవారం గుంటూరు మిర్చి యార్డును సందర్శించిన జగన్.. ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం క్వింటాకు రూ.10-12 వేలు కూడా రావడం లేదన్నారు. రైతులు పండించిన పంట అమ్ముకోలేని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు.
Wed, 19 Feb 202505:31 AM IST
- ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిని మరో విద్యార్థి బెదిరించాడు. డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తానని వేధించాడు. బాధిత యువతి గుంటూరు అరండల్‌పేట్ పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు మేరకు... నిందితుడితో పాటు మరో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Wed, 19 Feb 202502:19 AM IST
- TTD Board Member: తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడి బూతులతో తిట్ల దండకం వైరల్‌గా మారింది. ఆలయ మహాద్వారం నుంచి బయటకు పంపేందుకు ఉద్యోగి అనుమతించక పోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన బోర్డు సభ్యుడు బూతులతో విరుచుకు పడ్డారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
Wed, 19 Feb 202501:19 AM IST
- Industrialist Murder: హైదరాబాద్‌లో హత్యకు గురైన పారిశ్రామికవేత్త జనార్ధనరావు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తాతపై పగతో రగిలిపోయిన మనుమడు పథకం ప్రకారం హత్యకు పాల్పడ్డాడు. 72సార్లు కత్తితో పొడిచి చంపేసినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
Wed, 19 Feb 202512:37 AM IST
- Teacher transfers: వివాదాలకు తావులేకుండా టీచర్ల సీనియారిటీ జాబితాను రూపొందించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. జీవో నెం.42 ద్వారా ఎయిడెడ్ కాలేజీల ఆస్తులు కాజేసేందుకు జగన్ కుట్ర పన్నారని పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై సమీక్షలో నారా లోకేష్ ఆరోపించారు.