Andhra Pradesh News Live February 18, 2025: Ysrcp : వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పూడి శ్రీహరి నియామకం-today andhra pradesh news latest updates february 18 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live February 18, 2025: Ysrcp : వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పూడి శ్రీహరి నియామకం

Ysrcp : వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పూడి శ్రీహరి నియామకం

Andhra Pradesh News Live February 18, 2025: Ysrcp : వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పూడి శ్రీహరి నియామకం

Updated Feb 18, 2025 10:34 PM ISTUpdated Feb 18, 2025 10:34 PM IST
  • Share on Facebook
Updated Feb 18, 2025 10:34 PM IST
  • Share on Facebook

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 18 Feb 202505:04 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Ysrcp : వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పూడి శ్రీహరి నియామకం

  • Ysrcp : వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(మీడియా)గా పూడి శ్రీహరి నియమితులయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలు ఈ నియామకం చేపట్టినట్లు వైసీపీ ప్రకటించింది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 18 Feb 202502:07 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Police : ఏపీ పోలీసు రిక్యూట్‌మెంట్ రూల్స్ సవరణ, ఇకపై 65 శాతం ఎస్ఐ పోస్టులు ప్రత్యక్షంగానే భర్తీ

  • AP Police Recruitment Rules : ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్ నిబంధ‌న‌లను ప్రభుత్వం సవరించింది. 65 శాతం ఎస్ఐ పోస్టులను ప్రత్యక్ష నియామ‌కాల ద్వారానే భ‌ర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 18 Feb 202501:19 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Pawan Kalyan : మహాకుంభ మేళాలో పాల్గొన్న పవన్ కల్యాణ్, కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం

  • Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సమేతంగా మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేశారు. ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి గంగాదేవికి పూజలు చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 18 Feb 202512:35 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Lokesh vs Jagan : నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం మీకేమైనా ఉందా.. జగన్ రెడ్డి గారు? : లోకేష్

  • Lokesh vs Jagan : ఎన్టీఆర్‌ జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై లోకేష్ స్పందించారు. నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం మీకేమైనా ఉందా అని ప్రశ్నించారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 18 Feb 202511:37 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Mlc Elections : ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు, పోలింగ్ రోజున క్యాజువల్ లీవ్ గా ప్రకటించిన ప్రభుత్వం

  • AP Mlc Elections : ఏపీలో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రెండు రోజులు సెల‌వు రాబోతుంది. పోలింగ్ రోజున(ఫిబ్రవరి 27) స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇస్తున్నట్లు ప్రకటించింది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 18 Feb 202510:58 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP New VCs : ఏపీలోని పలు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకం

  • AP New VCs : ఏపీలోని పలు యూనివర్సిటీలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వైఎస్ ఛాన్సలర్లను నియమించారు. ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ రాజశేఖర్ నియమితులయ్యారు. కాకినాడ జేఎన్టీయూ వీసీగా సీఎస్ఆర్కే ప్రసాద్ నియమితులయ్యారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 18 Feb 202510:11 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Eluru Crime : ఏలూరు జిల్లాలో దారుణం- భార్యతో ప్రియుడి చాటింగ్, కుడి చేయి నరికి హత్య చేసిన భర్త

  • Eluru Crime : ఏలూరు జిల్లా నిడమర్రు మండలంలో దారుణం జరిగింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ యువకుడిని అతిదారుణంగా హత్య చేశాడు భర్త. తన భార్యతో తరచూ చాటింగ్ చేస్తున్నాడని కుడి చేయి సగానికి నరికి వేశాడు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 18 Feb 202509:26 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tuni High Tension : తునిలో తీవ్ర ఉద్రిక్తత, వీధుల్లో వైసీపీ కౌన్సిలర్లు పరుగులు-వైఎస్ ఛైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా

  • Tuni High Tension : కాకినాడ జిల్లా తునిలో ఉద్రిక్తత నెలకొంది. తుని మున్సిపల్ వైఎస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మున్సిపల్ ఆఫీసుకు వచ్చిన వైసీపీ కౌన్సిలర్లను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో వారంతా తిరిగి మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇంటికి వెళ్లిపోయారు. కోరం లేకపోవడంతో మరోసారి ఎన్నిక వాయిదా పడింది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 18 Feb 202508:49 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Farmers Subsidies : ఏపీ సూక్ష్మ, బిందు సేద్యం రైతులకు గుడ్ న్యూస్-సబ్సిడీలు ఖరారు చేసిన ప్రభుత్వం

  • AP Farmers Subsidies : ఏపీ ప్రభుత్వం సూక్ష్మ, బిందు సేద్యం సబ్సిడీలు ఖరారు చేసింది. కేంద్ర ప్రభుత్వ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం ప్రకారం రైతులకు డ్రిప్, స్పింక్లర్లపై సబ్సిడీని అందిస్తుంది. 5 ఎకరాల్లోపు ఎస్సీ, ఎస్సీ రైతులకు 100 శాతం సబ్సిడీపై పరికరాలు అందిస్తారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 18 Feb 202507:27 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Srisailam Brahmotsavalu 2025 : రేపటి నుంచి శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు - ముఖ్యమైన 10 విషయాలు

  • Srisailam Maha Shivratri Brahmotsavam 2025: రేపటి నుంచి శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మార్చి 1వ తేదీతో పూర్తి కానున్నాయి. గతేడాది పోల్చితే ఈసారి అదనపు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 18 Feb 202506:38 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: YS Jagan Meets Vamsi: విజయవాడ జైల్లో వల్లభనేని వంశీకి వైఎస్ జగన్ పరామర్శ, కిడ్నాప్‌ కేసులో వంశీపై అభియోగాలు

  • YS Jagan Meets Vamsi: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ములాఖత్‌ అయ్యారు. గన్నవరం  టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ఫిర్యాదు చేసిన వ్యక్తిని కిడ్నాప్‌ చేసిన వ్యవహారంలో వంశీని అరెస్ట్‌ చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 18 Feb 202505:59 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Konaseema Crime : కోన‌సీమ జిల్లాలో దారుణం.. రెండు ప్రాంతాల్లో ఇద్ద‌రు విద్యార్థినుల‌పై అత్యాచారం

  • Konaseema Crime : కోన‌సీమ జిల్లాలో దారుణం జరిగింది. రెండు ప్రాంతాల్లో ఇద్ద‌రు విద్యార్థినుల‌పై అత్యాచారం జ‌రిగింది. 8వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలిక‌కు మాయ మాటలు చెప్పి ఓ వ్య‌క్తి అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. మ‌రో ప్రాంతంలో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలిక‌పై ఆటో డ్రైవ‌ర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 18 Feb 202505:10 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Railway information : శ్రీకాకుళం రోడ్ - చ‌ర్ల‌ప‌ల్లి మ‌ధ్య ప్రత్యేక రైళ్లు... ఈ రూట్లలో 4 రైళ్లు రద్దు

  • ప్ర‌యాణికుల ర‌ద్దీని త‌గ్గించేందుకు శ్రీకాకుళం రోడ్-చ‌ర్ల‌ప‌ల్లి మ‌ధ్య స్పెష‌ల్ రైళ్లను ప్రకటించారు. అంతేకాకుండా ఫిబ్రవరి 20 20 నుంచి విశాఖ‌ప‌ట్నం -లోక‌మాన్య తిల‌క్ ట‌ర్మిన‌ల్‌-విశాఖ‌ప‌ట్నం ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ పున‌రుద్ధ‌రించ‌నున్నారు. ఈ మేరకు రైల్వే అధికారులు వివరాలను ప్రకటించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 18 Feb 202503:19 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Fire Accident: గన్నవరం లిటిల్‌ లైట్స్ అనాథశ్రమంలో అగ్నిప్రమాదం, ఆరుగురు చిన్నారుల గాయాలు..

  • Fire Accident: కృష్ణా జిల్లాలో గన్నవరం మండలం గోపనపల్లి గ్రామంలో ఉన్న లిటిల్‌ లైట్స్‌ అనాథశ్రమంలో అర్థరాత్రి మంటలు చెలరేగాయి.  చిన్నారులు నిద్రిస్తున్న సమయంలో మంటలు చెలరేగడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 18 Feb 202502:48 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Registrations DIG: భార్య, కొడుకుపై దాడి చేసిన రిజిస్ట్రేషన్స్‌ డీఐజీ కిరణ్‌కుమార్‌, కేసు నమోదు

  • Registrations DIG: భార్యను వేధించి దాడి చేసిన ఘటనలో ఆంధ్రప్రదేశ్‌ స్టాంప్స్‌ అండ్  రిజిస్ట్రేషన్స్‌ డీఐజీపై కేసు నమోదు కావడం కలకలం రేపింది. నెల్లూరులో డీఐజీ హోదాలో ఉన్న కిరణ్‌కుమార్‌ వివాహేతర సంబంధం పెట్టుకుని, భార్యను వేధిస్తున్నారంటూ కేసు నమోదు చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి