Andhra Pradesh News Live February 14, 2025: Prakasam Crime : ప్రకాశం జిల్లాలో దారుణం, కన్న కొడుకుని హత్య చేసి ముక్కలుగా నరికిన తల్లి
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 14 Feb 202504:52 PM IST
Prakasam Crime : ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న కొడుకును తల్లి, మరో వ్యక్తి సాయంలో హత్య చేసింది. ఆ మృతదేహాన్ని ముక్కలుగా చేసి గోనె సంచుల్లో కుక్కి పంటకాలవలో పడేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
Fri, 14 Feb 202512:47 PM IST
Govt Employees : ఏపీ ప్రభుత్వం ముస్లిం ఉద్యోగ, ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెప్పింది. రంజాన్ మాసంలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఒక గంట ముందు తమ కార్యాలయాలు, పాఠశాలల నుంచి ఇంటికి వెళ్లడానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Fri, 14 Feb 202510:33 AM IST
- YS Jagan : వల్లభనేని వంశీ అరెస్టు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై టీడీపీ, వైసీపీ మధ్య వార్ జరుగుతోంది. వంశీ అక్రమాలు చేశాడంటూ టీడీపీ ఆరోపిస్తుంటే.. ఆయనకు మద్దతుగా నిలుస్తోంది వైసీపీ. తాజాగా ఇదే అంశంపై స్పందించారు వైఎస్ జగన్. చట్టానికి, న్యాయానికి చోటు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Fri, 14 Feb 202508:17 AM IST
- AP Telangana Temperatures : ఏపీ, తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం దాటితే చాలు ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది. సగటు ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగానే నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ రెండు మూడురోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.
Fri, 14 Feb 202508:12 AM IST
- AP TG Bird Flu : తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. లక్షల్లో కోళ్లు మృతిచెందగా.. మనుషులకు వ్యాపిస్తుందనే భయం నెలకొంది. ఇప్పటికే ఏలూరు జిల్లాలో ఒకరు బర్డ్ ఫ్లూ బారినపడ్డారు. అసలు బర్డ్ ఫ్లూ ఎలా వ్యాపిస్తుంది.. మనుషులకు సోకితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఓసారి తెలుసుకుందాం.
Fri, 14 Feb 202507:30 AM IST
- Acid Attack: మదనపల్లె అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.. గుర్రంకొండ ప్యారంపల్లెలో యువతిపై యాసిడ్ దాడి జరిగింది. ఓ యువకుడు యువతి తలపై కత్తితో గాయపరిచి ముఖంపై యాసిడ్ పోశాడు. యువతికి ఏప్రిల్ 29న వివాహం నిశ్చయించారు. ఈ నేపథ్యంలో యువకుడు దాడి చేసి ఆమెపై యాసిడ్ పోసినట్టు గుర్తించారు.
Fri, 14 Feb 202506:23 AM IST
- ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. విజయవాడ మీదుగా నాలుగు స్పెషల్ వీక్లీ రైళ్లను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. మరోవైపు ఆరు నెలల పాటు వందేభారత్ రైలుకు ఏలూరులో స్టాపేజ్ కొనసాగనుంది.
Fri, 14 Feb 202505:22 AM IST
- Vizianagaram : విజయనగరంలో జిల్లాలో ఘోరం జరిగింది. వివాహేతర సంబంధం అనుమానంతో యువ ఇంజనీర్‌ను హతమర్చారు. వదినతో సన్నిహితంగా ఉంటున్నాడని, ఎలాగైనా దూరం చేయాలని మరిది ఈ హత్యకు పాల్పడ్డాడు. హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు.. విచారణలో విస్తుపోయే నిజాలు తెలుసుకున్నారు.
Fri, 14 Feb 202504:58 AM IST
- AP Bird Flu: ఆంధ్రప్రదేశ్‌లో పౌల్ట్రీ పరిశ్రమ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిండా మునిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పౌల్ట్రీ పరిశ్రమ భారీగా నష్టపోవాల్సి వస్తోంది. వదంతులు వ్యాపించడంతో ధరలు పడిపోయాయి.
Fri, 14 Feb 202504:22 AM IST
- CID DSP Death: రాజమండ్రిలో ఓ ఆలయం ముందు పడి ఉన్న గుర్తు తెలియని మృతదేహం చివరకు సీఐడీ డిఎస్పీదిగా తేలడంతో కలకలం రేగింది. రాజమండ్రి సీఐడీ డిఎస్పీగా పనిచేస్తున్న అధికారి కొద్ది రోజులుగా అదృశ్యమయ్యారు. అనూహ్యంగా శవమై కనిపించడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Fri, 14 Feb 202503:29 AM IST
- Nellore Crime: నెల్లూరు జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికపై పదో తరగతి చదువుతున్న విద్యార్థులు సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆడుకుంటున్న బాలికకు తినుబండరాలిస్తామని ఆశ చూపించి, పొదల్లోకి తీసుకెళ్లి ఒకరి తరువాత ఒకరు అత్యాచారానికి ఒడిగట్టారు.
Fri, 14 Feb 202503:14 AM IST
- AP Tourism: తిరుమల శ్రీవారి భక్తులకు ఏపీ పర్యాటక శాఖ తీపి కబురు చెప్పింది. పర్యాటక శాక ద్వారా తిరుమల శ్రీవారి దర్శనాలను పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అమోదం తెలిపారు. త్వరలోనే ఏపీ టూరిజం భాగస్వామ్యంతో తిరుమల దర్శనాలు ప్రారంభిస్తారు.
Fri, 14 Feb 202502:33 AM IST
- Auto Permits: విజయవాడ, విశాఖపట్నంలలో ట్రాఫిక్ చిక్కులు మరింత పెరుగనున్నాయి. ఇప్పటికే ఈ నగరాల్లో రోడ్లపై ఆటోలతో రద్దీ చుక్కలు చూపిస్తుంటే తాజాగా పర్మిట్లపై ఆంక్షల్ని ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. నగరాల్లో ట్రాఫిక్, కాలుష్య నియంత్రణ కోసం విధించిన ఆంక్షల్ని తొలగించారు.
Fri, 14 Feb 202501:34 AM IST
- AP Registrations: ఆంధ్రప్రదేశ్‌లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవల్ని అందుబాటులోకి తీసుకు వచ్చారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులు లేకుండా ముందుగా స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు.
Fri, 14 Feb 202512:19 AM IST
- మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి కోర్టులో ప్రవేశపెట్టగా…. విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం వంశీని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు.