LIVE UPDATES
Former minister Alla Nani : టీడీపీలో చేరిన మాజీ మంత్రి ఆళ్ల నాని
Andhra Pradesh News Live February 13, 2025: Former minister Alla Nani : టీడీపీలో చేరిన మాజీ మంత్రి ఆళ్ల నాని
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 13 Feb 202503:56 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Former minister Alla Nani : టీడీపీలో చేరిన మాజీ మంత్రి ఆళ్ల నాని
- మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని (కాళీకృష్ణ శ్రీనివాస్) తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. కొద్దిరోజుల కిందటే ఆళ్ల నాని… వైసీపీకి రాజీనామా చేశారు.
Thu, 13 Feb 202502:33 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Birdflu Terror: బర్డ్ ఫ్లూపై ఏపీ సర్కార్ అలర్ట్, వైరస్ విస్తరించకుండా చర్యలు, లక్షల్లో కోళ్లు మృతి
- Birdflu Terror: ఏపీలో మూడు జిల్లాలకు బర్డ్ ఫ్లూ విస్తరించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటంతో మిగిలిన జిల్లాలకు వ్యాప్తి చెందకుండా చర్యలు ముమ్మరం చేశారు. అన్ని జిల్లాల్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎస్ సమీక్షించారు.
Thu, 13 Feb 202502:18 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Police Act: విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాలో సెక్షన్ 30, BNSS 163 అమలు..ఎన్నికలు, పరీక్షల నేపథ్యంలో మే 12 వరకు అమలు
- Police Act: విజయవాడ నగరంతో పాటు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్‌ను ప్రకటించారు. ఏప్రిల్ 3 వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికలు, టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఆంక్షలు అమలు చేయనున్నారు.సమావేశాలు,ధర్నాలపై ఆంక్షలు కొనసాగుతాయి.
Thu, 13 Feb 202502:08 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: APSRTC Tour Package : హిందూపురం నుంచి కుంభమేళా, కాశీ, అయోధ్య ట్రిప్ - టికెట్ ధరలు, షెడ్యూల్ వివరాలివే
- హిందూపురం నుంచి కుంభమేళా (ప్రయాగ్‌రాజ్) కాశీ, అయోధ్య యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాత్ర దాదాపు 4 వేల కిలో మీటర్ల మేర సాగుతోంది. ఎనిమిది రోజుల పాటు వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వీలు ఉంటుంది.
Thu, 13 Feb 202509:56 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP MLC Elections 2025 : కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు - పోటీ ఎవరి మధ్య..? 9 ముఖ్యమైన అంశాలు
- కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతోంది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు మధ్య పోటీ ఉండనుంది.
Thu, 13 Feb 202507:55 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Vallabhaneni Vamsi Arrest : విత్‌డ్రా చేసుకున్న కేసులో అరెస్ట్ ఏంటి.. వంశీ వ్యవహారంపై వైసీపీ రియాక్ష్ ఇదే!
- Vallabhaneni Vamsi Arrest : వల్లభనేని వంశీ అరెస్టుపై టీడీపీ, వైసీపీ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. వంశీ అరెస్టును వైసీపీ నేతలు ఖండిస్తుంటే.. లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ అయ్యిందని టీడీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. లిస్టులో మరికొందరు ఉన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Thu, 13 Feb 202505:56 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Bird Flu Alert : చేపల చెరువులకు మేతగా బర్డ్‌ఫ్లూ కోళ్లు.. ఏలూరు జిల్లాలో మనిషికి సోకిన వైరస్
- AP Bird Flu Alert : ఏపీని బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అటు మనిషికి కూడా ఈ వైరస్ సోకినట్టు అధికారులు నిర్ధారించారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
Thu, 13 Feb 202505:22 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Road Accident : పొగ మంచు ఎఫెక్ట్.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. నలుగురికి గాయాలు
- AP Road Accident : పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా గురువారం ఉదయం పీలేరు సమీపంలో ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. అయితే పొగముంచు కురిసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
Thu, 13 Feb 202503:01 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Vallabhaneni Vamsi Arrest : టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్
- Vallabhaneni Vamsi Arrest : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో అరెస్టు చేసిన ఏపీ పోలీసులు.. ఆయన్ను విజయవాడకు తరలిస్తున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. గతంలో లోకేష్, చంద్రబాబుపై వంశీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Thu, 13 Feb 202502:36 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Budget 2025 : బడ్జెట్‌పై చంద్రబాబు ఫోకస్.. మూడు కొత్త పథకాలకు శ్రీకారం.. 9 ముఖ్యమైన అంశాలు
- AP Budget 2025 : ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 28న పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు బడ్జెట్ కూర్పుపై ఫోకస్ పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే కొత్త పథకాలు ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Thu, 13 Feb 202501:18 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Pawan Kalyan : ఆరోగ్యం సహకరించకున్నా.. ఆలయాల యాత్రకు పవన్ కల్యాణ్.. కారణం ఇదే!
- Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలయాల యాత్రకు శ్రీకారంచుట్టారు. ఆరోగ్యం సహకరించకున్నా.. యాత్రకు బయల్దేరినట్టు పవన్ స్పష్టం చేశారు. అయితే ఈ యాత్రపై రకరకాల పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ.. పవన్ మాత్రం వ్యక్తిగతం అని చెబుతున్నారు. ఆయన ఏమన్నారో ఓసారి చూద్దాం.