Andhra Pradesh News Live February 11, 2025: CM Chandrababu : మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం, ప్రతి మండలంలో ఐటీ కార్యాలయాలు- సీఎం చంద్రబాబు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 11 Feb 202504:25 PM IST
CM Chandrababu : ఏపీ ప్రభుత్వం మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు చేస్తుంది. ఈ విషయంగా సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ప్రతి నగరం, పట్టణం, మండలంలో ఐటీ కార్యాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నామన్నారు.
Tue, 11 Feb 202501:51 PM IST
Bird Flu Effect : తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేపుతోంది. లక్షల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలపై ఎఫెక్ట్ పడగా, తాజాగా కృష్ణా జిల్లాకు వైరస్ వ్యాపించింది. బర్డ్ ఫ్లూ నమోదైన ప్రాంతంలో 10 కి.మీ పరిధిలో చికెన్, గుడ్లు తినొద్దని అధికారులు సూచిస్తున్నారు.
Tue, 11 Feb 202512:18 PM IST
- AP Liquor Policy : ఏలూరు జిల్లాలో లిక్కర్ డోర్ డెలివరీ చేస్తున్నారంటూ.. ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై వైసీపీ స్పందించింది. కాకాణి గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై సెటైర్లు పేల్చారు. తమ హయాంలో రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేస్తే.. ఇప్పుడు లిక్కర్ సరఫరా చేస్తున్నారని విమర్శించారు.
Tue, 11 Feb 202511:18 AM IST
AP Teachers Transfers : ఏపీలో ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది. వేసవి సెలవులలో బదిలీలు, పదోన్నతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సీనియారిటీ జాబితాలను సిద్ధం చేసి, ఫిబ్రవరిలోనే విద్యాశాఖకు పంపించేలా జిల్లాల విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
Tue, 11 Feb 202510:35 AM IST
Srisailam Mahashivratri : శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మంత్రుల బృందం ఏర్పాట్లపై సమీక్షించి పలు కీలక సూచనలు చేశారు. అలాగే శివరాత్రికి వచ్చే భక్తుల సౌకర్యాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Tue, 11 Feb 202509:26 AM IST
- YSRCP Social Media : ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర అత్యంత కీలకంగా మారింది. సోషల్ మీడియా వింగ్‌లు తమ పార్టీని ప్రమోట్ చేసుకుంటూనే.. ప్రత్యర్థులను ఇరకాటంలో పడేస్తాయి. ఇది దాదాపు అన్ని రాజకీయ పార్టీల వింగ్‌లు చేసే పని. కానీ.. వైసీపీ సోషల్ మీడియా ఇందుకు భిన్నం. దానికి కారణం జగన్.
Tue, 11 Feb 202508:54 AM IST
Tollywood Piracy Crisis : టాలీవుడ్ ను పైరసీ భూతం వెంటాడుతోంది. ఎంత కొత్త సినిమా అయినా హెచ్డీ ప్రింట్ తో ఆర్టీసీ బస్సుల్లో, లోకల్ కేబుల్ టీవీల్లో ప్రదర్శించే స్థాయికి చేరింది. పైరసీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి.
Tue, 11 Feb 202508:22 AM IST
- AP MLC Elections : ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అభ్యర్థుల ప్రచారం హోరెత్తుతుంది. ఈ ఎన్నికలను అధికార టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందుకు అనుగుణంగా బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపింది. అయితే ఈ ఎన్నికలు అధికార కూటమికే సవాల్‌గా మారాయి.
Tue, 11 Feb 202508:22 AM IST
- Tribal Acts: గిరిజన హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యల నేపథ్యంలో ఏజెన్సీలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశ్యం లేదని సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
Tue, 11 Feb 202506:20 AM IST
- Jabalpur Accident: కుంభమేళా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తిరుగు ప్రయాణంలో ఉన్న టూరిస్ట్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సిహోరా సమీపంలో వంతెనపై టూరిస్ట్ బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలు కోల్పోయారు.
Tue, 11 Feb 202505:49 AM IST
- CBN on IAS: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో కొన్ని శాఖల్లో ఫైల్స్ క్లియర్ చేయడానికి ఆరు నెలలకు మించి సమయం పట్టడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు పట్టారు. వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇటీవల శాఖల వారీగా ఫలితాలు అలా ప్రకటించినవేనని చెప్పారు.
Tue, 11 Feb 202505:21 AM IST
- AP Budget 2025 : కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక.. పూర్తిస్థాయి బడ్దెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. కసరత్తు ముమ్మరం చేశారు. వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై చర్చలు ప్రారంభించారు. పలు శాఖల కార్యదర్శుల స్థాయిలో చర్చలు ముగిశాయి. మంత్రులతో పయ్యావుల కేశవ్ చర్చలు జరుపుతున్నారు.
Tue, 11 Feb 202504:15 AM IST
- Srikakulam Crime: శ్రీకాకుళం జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. దివ్యాంగురాలిపైఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో రాజీ ప్రయత్నాలు మొదల పెట్టాడు. యువతి నాన్నమ్మ సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Tue, 11 Feb 202504:07 AM IST
- AP Agency Protests: 1/70 చట్టాన్ని సవరించి ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాల్ని ఫ్రీ జోన్ చేయాలంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. అయ్యన్న వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ 48 గంటల బంద్‌కు ఆదివాసీలు పిలుపునిచ్చారు. దీంతో ఏజెన్సీలో భద్రత కట్టుదిట్టం చేశారు.
Tue, 11 Feb 202504:06 AM IST
- Vijayawada Metro : మెట్రో రైలు.. విజయవాడ వాసుల కల. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచీ.. దీనిపై ఊరిస్తూనే ఉన్నారు. గతంలో అదిగో.. ఇదిగో అంటూ ప్రకటనలు ఇచ్చారు. తాజాగా.. మెట్రో కల సాకారానికి తొలి అడుగు పడింది. భూసేకరణ ప్రతిపాదనలను ఏపీఎంఆర్‌సీ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు.
Tue, 11 Feb 202502:29 AM IST
- AP BirdFlu: ఆంధ్రప్రదేశ్‌లో లక్షల సంఖ్యలో కోళ్ల చావులకు బర్డ్‌ఫ్లూగా భోపాల్ హై సెక్యూరిటీ ల్యాబరేటరీ నిర్దారించింది. కొన్ని వారాలుగా గోదావరి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. కొల్లేరు పరివాహక ప్రాంతాలకు వలస వచ్చిన పక్షులతో వైరస్ విస్తరించినట్టు ఏపీ పశు సంవర్ధక శాఖ స్పష్టత ఇచ్చింది.