Andhra Pradesh News Live February 1, 2025: Pawan Kalyan : సంక్షేమం, సంస్కరణల సమపాళ్లు- బడ్జెట్ పై పవన్ కల్యాణ్ రియాక్షన్
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 01 Feb 202506:04 PM IST
Pawan Kalyan : కేంద్ర బడ్జెట్ పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా, దేశాన్ని అభివృద్ధిలో నడిపించేలా బడ్జెట్ ఉందని పవన్ కల్యాణ్ అన్నారు.
Sat, 01 Feb 202505:04 PM IST
CBI Case On KLEF University : గుంటూరు జిల్లా కేంద్రంగా పనిచేస్తున్న కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీపై సీబీఐ కేసు నమోదు చేసింది. NAAC అక్రెడిటేషన్ కోసం లంచాలు ఇచ్చారని యూనివర్సిటీ అధికారులపై ఆరోపణలు వచ్చాయి. యూనివర్సిటీ యూనివర్సిటీ వీసీ, వైస్ ప్రెసిడెంట్ సహా 10 మందిని సీబీఐ అరెస్టు చేసింది.
Sat, 01 Feb 202512:25 PM IST
- Union Budget 2025 : కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్డీయే పక్షాలు స్వాగతిస్తుంటే.. ఇండియా కూటమి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. తాజా బడ్జెట్‌పై వైసీపీ నేతలు రియాక్ట్ అయ్యారు. చంద్రబాబును విమర్శించారు.
Sat, 01 Feb 202511:56 AM IST
CM Chandrababu : కేంద్ర బడ్జెట్ ను సీఎం చంద్రబాబు స్వాగతించారు. రాబోయే ఐదేళ్లలో ఆర్థిక వృద్ధికి ఆరు కీలక రంగాలను బడ్జెట్ గుర్తించిందన్నారు. బడ్జెట్ లో మధ్యతరగతి ప్రజలు, మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారన్నారు.
Sat, 01 Feb 202509:59 AM IST
Union Budget 2025-26 : కేంద్ర బడ్జెట్ లో ఏపీ కేటాయింపులపై స్పష్టత వచ్చింది. పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చారు.
Sat, 01 Feb 202506:47 AM IST
- ఐర్లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. ఒకరు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చిట్టూరి భార్గవ్ (25), పల్నాడు జిల్లాకు చెందిన చెరుకూరి సురేష్ (26) గా గుర్తించారు. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది
Sat, 01 Feb 202506:33 AM IST
- Fake liquor in AP : ఏపీ ప్రభుత్వం తక్కువ రేటుకే క్వాలిటీ లిక్కర్ అందజేయాలని ప్రయత్నిస్తోంది. కానీ కొన్నిచోట్ల ఇంకా తక్కువ ధరలకే ఓ ముఠా మద్యం సరఫరా చేస్తోంది. దీనిపై అనుమానం వచ్చి అధికారులు నిఘా పెట్టారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆ ముఠా నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు.
Sat, 01 Feb 202504:29 AM IST
- తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. తిరుమల, తిరుపతి స్థానిక కోటా దర్శనాల్లో మార్పులు చేసింది. రథసప్తమి దృష్ట్యా.. రెండో మంగళవారమైన 11వ తేదీకి స్థానిక కోటా దర్శనాలను మార్పు చేసినట్లు టీటీడీ తెలిపింది.
Sat, 01 Feb 202502:00 AM IST
- Land Registration Charges in AP: ఏపీలో ఇవాళ్టి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అందుబాటులోకి రానున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం విలువలు తగ్గించింది. మరికొన్నిచోట్ల పెంచగా…. ఇంకొన్నిచోట్ల ప్రస్తుతం ఉన్న ధరలోనే కొనసాగించాలని నిర్ణయించింది. సగటున 20 శాతం విలువలు పెరగనున్నాయి.