Andhra Pradesh News Live December 9, 2024: Alluri News : అల్లూరి జిల్లాలో తీవ్ర విషాదం-బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్‌తో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 09 Dec 202404:58 PM IST
Alluri News : అల్లూరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ తలిగి తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Mon, 09 Dec 202404:37 PM IST
Nagababu : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఏపీ కేబినెట్ లో చోటు దక్కనుందని సమాచారం. నాగబాబును మంత్రివర్గంలోని తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కూటమి పార్టీల పొత్తుల్లో భాగంగా జనసేనకు 4 మంత్రి పదవులు కేటాయించారు.
Mon, 09 Dec 202401:53 PM IST
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయి. పవన్ పేషీకి బెదిరింపు కాల్స్, అభ్యంతరమైన మెసేజ్ లు వచ్చాయని అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Mon, 09 Dec 202412:41 PM IST
AP Weather Alert : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 24 గంటల్లో బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Mon, 09 Dec 202410:55 AM IST
Teachers Mlc Election : ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎస్ అభ్యర్థి బొర్రా గోపిమూర్తి ఘన విజయం సాధించారు. బొర్రా గోపిమూర్తి తన సమీప అభ్యర్థి గంధం నారాయణ రావుపై 3,906 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.
Mon, 09 Dec 202408:54 AM IST
- Kakinada SEZ : సీఎం చంద్రబాబుకు యనమల రామకృష్ణుడు లేఖాస్త్రాం సంధించారు. కాకినాడ సెజ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సన్నిహితుడిపై ఆరోపణలు చేశారు. వైసీపీని కూడా వదలని యనమల.. 10 ముఖ్యమైన అంశాలను పస్తావించారు. యనమల లేఖలోని అంశాలు ఏంటో ఓసారి చూద్దాం.
Mon, 09 Dec 202408:35 AM IST
Social Media Politics : డిటిజల్ యుగంలో ఆన్ లైన్ మోడ్ సౌలభ్యంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాజకీయాలు సైతం ఆన్ లైన్ అంటే సోషల్ మీడియా బాట పడుతున్నాయి. ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టేందుకు రాజకీయ పార్టీల సోషల్ మీడియాను ఒక అస్త్రంలా వాడుతున్నాయి.
Mon, 09 Dec 202407:59 AM IST
- AP BJP Rajyasabha: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఆర్.కృష్ణయ్య పేరును బీజేపీ ఖరారు చేసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా చేశారు. వైసీపీ నుంచి ముగ్గురు రాజీనామా చేయగా వారిలో ఆర్.కృష్ణయ్యకు తిరిగి అవకాశం లభించింది.
Mon, 09 Dec 202405:47 AM IST
- CRDA Building Design : అమరావతిలో ఏపీ ప్రభుత్వం సీఆర్డీఏ భవనాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని భావిస్తోంది. ఈ భవనం డిజైన్లపై ప్రజాభిప్రాయ సేకరణకు అవకాశం ఇచ్చింది. ఎక్కువ మంది 4వ డిజైన్ బాగుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Mon, 09 Dec 202404:49 AM IST
- East Godavari Attack: తూర్పుగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది అరాచకం సృష్టించాడు. ప్రేమ పేరుతో వేధిస్తూ ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. దాన్ని అడ్డుకున్న అ అమ్మాయి తల్లిపై కత్తితో దాడికి ఒడిగట్టాడు. దీంతో ఆమె స్పృహతప్పి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
Mon, 09 Dec 202404:01 AM IST
- Inter Girl Murder: నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఇంటర్ విద్యార్ధినిపై యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో బాలిక ప్రాణాలు కోల్పోయింది. ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడుతున్న యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.
Mon, 09 Dec 202402:32 AM IST
- CRDA Employees: రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వ పిలుపుతో భూములిచ్చిన రైతులకు తమ వాటా కింద దక్కాల్సిన ఫ్లాట్లను కేటాయించడానికి కూడా సీఆర్డిఏ ఉద్యోగులు వేధిస్తున్నారు. అడిగినంత లంచం ఇవ్వకపోతే ఏదొక కొర్రీ వేసి ఫ్లాట్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు.ఈ వ్యవహారంపై సీఆర్డీఏ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Mon, 09 Dec 202411:30 PM IST
- AP Garbage Tax: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైసీపీ హయంలో తీసుకున్న వివాదాస్పద చెత్త పన్నును రద్దు చేసి ప్రజలకు ఊరటనిస్తే విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌లో మాత్రం కాలనీల్లో పారిశుధ్య సిబ్బంది రోడ్లను ఊడ్చేందుకు స్థానికులే ప్రతి నెల వారి జీతాలు చెల్లించాలని నిర్ణయించారు.