Andhra Pradesh News Live December 8, 2024: AP Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం, డిసెంబర్ 15 వరకు ఏపీలో వర్షాలు-today andhra pradesh news latest updates december 8 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live December 8, 2024: Ap Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం, డిసెంబర్ 15 వరకు ఏపీలో వర్షాలు

AP Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం, డిసెంబర్ 15 వరకు ఏపీలో వర్షాలు(HT_PRINT)

Andhra Pradesh News Live December 8, 2024: AP Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం, డిసెంబర్ 15 వరకు ఏపీలో వర్షాలు

04:45 PM ISTDec 08, 2024 10:15 PM HT Telugu Desk
  • Share on Facebook
04:45 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sun, 08 Dec 202404:45 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం, డిసెంబర్ 15 వరకు ఏపీలో వర్షాలు

  • AP Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అల్పపీడనం బుధవారం నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబర్ 15 వరకు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 08 Dec 202401:27 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Waqf Board : ఏపీ వ‌క్ఫ్‌ బోర్డును పున‌ర్ నియామ‌కం, న్యాయ‌పోరాటానికి సిద్ధమంటున్న మాజీ డిప్యూటీ సీఎం

  • AP Waqf Board : ఏపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును పునర్ నియమించింది. వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన బోర్డును కూటమి ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. తాజాగా జీవో నెంబర్ 77 ప్రకారం కొత్త బోర్డును ప్రకటించింది. అయితే ఇది చట్ట విరుద్ధమని వైసీపీ నేత అంజద్ బాషా ఆరోపిస్తున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 08 Dec 202401:14 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Potti Sriramulu Death Anniversary : పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినంగా ప్రక‌టించిన ఏపీ ప్రభుత్వం, జీవో జారీ

  • Potti Sriramulu Death Anniversary : పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం నాడు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 08 Dec 202410:57 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Pensions : పెన్ష‌న్ల‌పై కీల‌క అప్‌డేట్‌.. అన‌ర్హుల‌ ఏరివేత‌కు రంగం సిద్ధం.. 8 ముఖ్యమైన అంశాలు

  • AP Pensions : రాష్ట్రంలో పెన్ష‌న్ల‌పై కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. అన‌ర్హ‌ుల పెన్ష‌న్లు ఏరివేత‌కు రంగం సిద్ధ‌మైంది. పెన్ష‌న్లను త‌నిఖీ చేసేందుకు పైల‌ట్ ప్రాజెక్ట్‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం అడుగు ముందుకేసింది. పైల‌ట్ ప్రాజెక్ట్‌గా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఒక్కొ స‌చివాల‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Sun, 08 Dec 202409:52 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Instagram Love : వివాహిత ఇన్ స్టాగ్రామ్ ప్రేమ, భార్య ముందే ప్రియుడికి దేహశుద్ధి చేసిన భర్త

  • Instagram Love : ఇన్ స్టా గ్రామ్ లవ్ పచ్చని కాపురంలో చిచ్టుపెట్టింది. పెళ్లై పిల్లలున్న ఓ వివాహిత... ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ తో పరిచయం పెంచుకుంది. వీరి మధ్య ప్రేమ చిగురించింది. భార్య తీరుతో అనుమానం వచ్చిన భర్త... ఆమె ప్రియుడితో ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహశుద్ధి చేశాడు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 08 Dec 202408:21 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Allavaram Rajula Saare : అల్లవరం రాజుల సారె వరల్డ్ ఫేమస్- గోదావరి జిల్లాల స్పెషల్ స్వీట్లు

  • Allavaram Rajula Saare : ఆయ్.. గోదారోళ్లంటే మమూలుగా ఉండదండోయ్. ఆడబిడ్డను అత్తింటికి పంపెటప్పుడు పదుల రకాల స్వీట్లు, హాట్ పదార్థాలతో సారె పంపుతారు. ఈ సారె తయారీకి అల్లవరం గ్రామానికి పెట్టింది పేరు. ఇక అల్లవరం రాజుల సారె అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదండోయ్.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 08 Dec 202407:17 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: TTD : ఇకపై ఆ దాతలకు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం... బహుమానంగా బంగారం, వెండి కాయిన్స్ - టీటీడీ తాజా నిర్ణయాలు

  • టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనాలను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సవరించిన సౌకర్యాల వివరాలు వెల్లడించింది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 08 Dec 202405:27 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Kadapa : కడపలో పడగ విప్పిన ప్రేమ కత్తి.. యువతిపై 14 కత్తిపోట్లు.. ప్రమోన్మాది ఘాతుకం

  • Kadapa : కడప జిల్లాలో ప్రేమ కత్తి పంజా విసిరింది. ఓ యువతిని చావు అంచుల వరకు తీసుకెళ్లింది. త‌న‌ను ప్రేమించ‌లేద‌నే కోపంతో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయి.. యువతిపై క‌త్తితో దాడి చేశాడు. దాడి అనంత‌రం నిందితుడు ప‌రార‌య్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 08 Dec 202404:22 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: CRDA Building Design : ఏపీ సీఆర్డీఏ భవనం.. ఈ డిజైన్‌కే ఎక్కువమంది మొగ్గు!

  • CRDA Building Design : అమ‌రావ‌తిలో ప్రభుత్వం సీఆర్డీఏ భ‌వ‌నాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ భవనం డిజైన్ల‌పై ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌కు అవ‌కాశం ఇచ్చింది. తాజాగా.. ప్రజలు మొగ్గుచూపిన భవనం వివరాలను అధికారులు వెల్లడించారు. ఎక్కువ మంది 4వ డిజైన్‌ బాగుందని అభిప్రాయపడ్డారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 08 Dec 202402:41 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Palnadu Road Accident : పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - స్పాట్ లోనే నలుగురు మృతి

  • Road Accident in Palnadu District : పల్నాడు జిల్లాలోని బ్రాహ్మణపల్లి దగ్గర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్టును కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు స్పాట్ లోనే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది.
పూర్తి స్టోరీ చదవండి