Andhra Pradesh News Live December 7, 2024: Low Pressure Forms Over BoB : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఏపీకి వర్షసూచన-రైతులు బీఅలర్ట్
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 07 Dec 202403:51 PM IST
Low Pressure Forms Over BoB : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఈ నెల 11 నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
Sat, 07 Dec 202401:23 PM IST
AP Contract Jobs : ఏపీ వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఏళ్ల తరబడి పనిచేస్తున్నఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. ఆ ఉద్యోగుల పాలిట తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు శాపంగా మారాయి. దీంతో ఉద్యోగులు, వారి కుటుంబాలు ఆందోళనలో చెందుతున్నారు.
Sat, 07 Dec 202401:08 PM IST
- Sabarimala Trains : శబరిమల భక్తులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. భక్తులకు, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి.. అదనపు కోచ్‌లతో పెంచాలని నిర్ణయించింది. అటు 18 రైళ్లు రద్దయ్యాయి. వాటి వివరాలను కూడా అధికారులు వెల్లడించారు.
Sat, 07 Dec 202412:42 PM IST
Minister Nara Lokesh : మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లుగా ఉందని మంత్రి లోకేశ్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతామన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలపై పాఠాలు నేర్పిస్తామన్నారు.
Sat, 07 Dec 202412:26 PM IST
- AP Children Missing : ఏపీలో చిన్నారుల మిస్సింగ్ ఇష్యూపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఏపీ సీఎస్ వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. గతంలో కోరిన నివేదిక ఇవ్వని కారణంగా ఎన్‌హెచ్‌ఆర్సీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెలుస్తోంది.
Sat, 07 Dec 202411:21 AM IST
Mega Parent Teacher Meeting : ఏపీ వ్యాప్తంగా 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెట్ టీచర్ మీటింగులు నిర్వహించారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్ పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. విద్యార్థులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు.
Sat, 07 Dec 202410:31 AM IST
- Kadapa : కడపలో మెగా పేరెంట్ - టీచర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీచర్లే నిజమైన హీరోలని.. విద్యార్థులు వారిని గౌరవించాలని సూచించారు.
Sat, 07 Dec 202410:02 AM IST
- YS Jagan : ప్రస్తుతం జగన్ రాజకీయ ప్రత్యర్థులు బలంగా ఉన్నారు. ఫలితంగా వైఎస్సార్సీపీ బలహినంగా మారుతోంది. అనేకమంది నాయకులు పార్టీని వీడారు. ఇంకా ఎంతమంది గుడ్ బై చెబుతారో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడం కష్టం. అందుకే జగన్ పక్కా ప్లాన్‌తో నిర్ణయాలు తీసుకుంటున్నారనే టాక్ ఉంది.
Sat, 07 Dec 202408:53 AM IST
- ADHAAR Struggles: ఆధార్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అయిపోయింది. ఆధార్‌లో తప్పొప్పుల సరవణలు కూడా ఇప్పుడు సంక్లిష్టం అయిపోయాయి. ఈ క్రమంలో మహిళలు, ఉద్యోగినులు ఆధార్ వివరాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సి.పెళ్లైన మహిళలు తెలిసి తెలియక ఆధార్‌లో నమోదులో చేసిన తప్పులు కొత్త కష్టాలకు కారణం అవుతోంది.
Sat, 07 Dec 202408:35 AM IST
Ration Mafia : తెలుగు రాష్ట్రాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా చాప కింద నీరులా విస్తరిస్తోంది. పేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల వ్యయంతో పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం....అక్రమార్కుల ఖాతాలు నింపుతున్నాయి.
Sat, 07 Dec 202407:29 AM IST
- YS Sharmila : ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. రేషన్ బియ్యం అక్రమాలపై సిట్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతించిన షర్మిల.. సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన అక్రమాలపై ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. అదానీ ఎంత లంచం ఆఫర్ చేశారని నిలదీశారు.
Sat, 07 Dec 202405:40 AM IST
- Guntur : ఈజీ మనీ కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ముఖ్యంగా స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం నడిపిస్తున్నారు. గుంటూరు నగరంలో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. తాజాగా పోలీసుల తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దందా వెనక రాజకీయ పార్టీల నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.
Sat, 07 Dec 202404:37 AM IST
- Prakasam District : ప్రకాశం జిల్లాలో ఘోరమైన సంఘటన జరిగింది. సహజీవనం చేయటం లేదని ఓ యువకుడు మహిళను హత్య చేశాడు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. కత్తి పోట్లకు గురైన మహిళ మృతి చెందడంతో ఆమె ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. మహిళ తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Sat, 07 Dec 202403:07 AM IST
- AP Govt Public Holidays 2025 : వచ్చే ఏడాది 2025కి సంబంధించిన సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. 2025లో మొత్తం 23 సాధారణ సెలవులు, 21 ఐచ్ఛిక సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు.
Sat, 07 Dec 202411:51 PM IST
- Union Cabinet Decisions : తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ కు ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణకు ఏడు నవోదయ విద్యాలయాలను కేటాయించింది. ఈ మేరకు కేంద్రమంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.