LIVE UPDATES
Andhra Pradesh News Live December 6, 2024: Ration Rice Smuggling : రేషన్ బియ్యం అక్రమ రవాణా - ‘సిట్’ ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 06 Dec 202401:00 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Ration Rice Smuggling : రేషన్ బియ్యం అక్రమ రవాణా - ‘సిట్’ ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్
- SIT On Ration Rice Smuggling : రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. సిట్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలను జారీ చేసింది. సిట్‌కు చీఫ్‌గా వినీత్ బ్రిజ్‌లాల్‌ను నియమించింది. మరో 5 మంది సభ్యులు ఉన్నారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు.
Fri, 06 Dec 202411:56 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: APSRTC : భక్తులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. వైష్ణవ క్షేత్ర దర్శినికి ప్రత్యేక బస్సులు.. ప్యాకేజీ ఇదే
- APSRTC : పుణ్యక్షేత్రాల యాత్ర చేసే భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వైష్ణవ క్షేత్ర దర్శిని పేరుతో పుణ్యక్షేత్రాలకు స్పెషల్ సర్వీసులను నడుపుతోంది. అవనిగడ్డ, మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం ఆర్టీసీ డిపోల నుంచి ఐదు వైష్ణవ ఆలయాల దర్శనానికి బస్ సర్వీస్‌లను వేసింది.
Fri, 06 Dec 202411:18 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Rain Alert : ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ 6 జిల్లాలకు వర్షసూచన.. రైతుల్లో ఆందోళన
- AP Rain Alert : ఏపీ ప్రజలను వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. మొన్నటి దాకా ఫెంగల్ తుపానుతో రైతులు అల్లాడిపోయారు. ఇప్పుడు మళ్లీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా 6 జిల్లాలకు వర్షసూచన ఉందని అధికారులు వెల్లడించారు. దీంతో రైతుల్లో ఆందోళన మరింత పెరిగింది.
Fri, 06 Dec 202409:41 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Visakhapatnam : విశాఖ జిల్లాలో ఘోరం.. మతిస్థిమితం లేని బాలికపై లైంగికదాడి
- Visakhapatnam : విశాఖ జిల్లాలో ఘోరమైన సంఘంటన చోటు చేసుకుంది. మతిస్థితం లేని చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఇప్పటివరకు ఆ వ్యక్తిపై కేసు నమోదు కాకపోవడం గమనార్హం.
Fri, 06 Dec 202408:51 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Srikakulam : ఏపీ రాజకీయాల్లో బసవ రమణ బాంబ్.. ఆర్మీ ఉద్యోగాల పేరుతో గలీజ్ దందాలు : వైఎస్సార్సీపీ
- Srikakulam : ఆంధ్రా రాజకీయాల్లో మరో అంశం సంచలనంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ వ్యవస్థాపకుడి ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ వ్యవహారంపై వైఎస్సార్సీపీ సంచలన ఆరోపణలు చేసింది. బసవ రమణ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడి అనుచరుడని ఆరోపించింది.
Fri, 06 Dec 202408:07 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: RTC Bus Driver: లోకేష్‌ను కలిసిన తుని ఆర్టీసీ డ్రైవర్, మంత్రి చొరవతో సస్పెన్షన్ రద్దు
- RTC Bus Driver: రోడ్డుపై నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ డ్యాన్స్ గుర్తుందా… కొద్ది వారాల క్రితం ఏపీలో ఆగిపోయిన ఆర్టీసీ బస్సు ముందు డాన్స్ చేసినందుకు ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురై, సస్పెండ్ అయిన డ్రైవర్‌కు మంత్రి లోకేష్ చొరవతో ఉద్యోగం దక్కింది. తాజాగా మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Fri, 06 Dec 202406:10 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Kurnool : పోలీసుల చుట్టూ తిరిగి అలసిపోయాం.. కన్నీరు పెట్టిస్తున్న దంపతుల వీడియో
- Kurnool : ఆ కుటుంబం ఎంతో కష్టపడి షాపులు నిర్మించుకుంది. వాటిని అద్దెకు ఇచ్చింది. కానీ.. అద్దెకు తీసుకున్న వారు డబ్బులు చెల్లించడం లేదు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఫలితం లేదు. ఇక తమకు చావే దిక్కని ఆ కుటుంబం వీడియో విడుదల చేసింది. నంద్యాలలో ఇది చర్చనీయంశంగా మారింది.
Fri, 06 Dec 202405:50 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: RTGS IVRS: ఆర్టీజీఎస్‌లో అప్పుడు ఇప్పుడు అదే తంతు.. రియల్ టైమ్ ఫీడ్‌బ్యాక్ పేరుతో టోకరా
- RTGS IVRS: రియల్ టైమ్ గవర్నెన్స్… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక… రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సచివాలయం నుంచి రాష్ట్రంలో ఏ మూల ఏమి జరిగినా క్షణాల్లో తెలుసుకునేలా వ్యవస్థల్ని అనుసంధానించిన టెక్నాలజీ. 2019కు ముందు ఈ వ్యవస్థ ముఖ్యమంత్రి చంద్రబాబును మభ్య పెట్టిందనే విమర్శలు కూడా ఉన్నాయి.
Fri, 06 Dec 202402:59 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Inter Exams 2025: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ పబ్లిక్ పరీక్ష తేదీల ఖరారు.. ముగిసిన ఫీజు చెల్లింపు గడువు
- AP Inter Exams 2025: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్ధుల వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. 2025 పబ్లిక్ పరీక్షల్ని మార్చి 1 నుంచి నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు పరీక్షల నిర్వహణ తేదీలను రాష్ట్ర ప్రభుత్వ అమోదానికి పంపారు. ప్రభుత్వ అమోదం లభించిన వెంటనే తేదీలను అధికారికంగా ప్రకటిస్తారు.
Fri, 06 Dec 202402:26 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: CID Lookout Notice: విజయసాయిరెడ్డిపై ఏపీ సీఐడీ లుకౌట్ నోటీసులు, దుష్ప్రచారమంటోన్న వైసీపీ ఎంపీ…
CID Lookout Notice: కాకినాడ సీ పోర్ట్ కంపెనీ షేర్ల బదలాయింపు వ్యవహారంలో వైసీపీ ఎంపీ సాయిరెడ్డితో పాటు,మరో నేత వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి,సాయిరెడ్డి సమీప బంధువు అరబిందో ఫార్మా ప్రమోటర్ పెనక శరత్ చంద్రారెడ్డిలపై ఏపీ సీఐడీ లుకౌట్ సర్క్యులర్లు జారీ అయ్యాయి. ఆరోపణల్ని ఎంపీ ఖండించారు.
Fri, 06 Dec 202412:53 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Google MOU: ఏపీ ప్రభుత్వంతో గూగుల్ సంస్థ కీలక ఒప్పందం, అంతర్జాతీయస్థాయి అవకాశాల కోసం యువతకు నైపుణ్య శిక్షణ
- AP Google MOU: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన తొలి అడుగు వేసింది. ఎఐ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య కీలక ఒప్పందం జరిగింది.
Fri, 06 Dec 202411:30 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Missing Citizens: ఏపీ ప్రభుత్వ లెక్కల్లో 50లక్షల మంది పౌరుల వివరాలు మాయం, పథకాల్లో లేని వాళ్లే బాధితులు
- AP Missing Citizens: ఆంధ్రప్రదేశ్ జనాభాల్లో అక్షరాలా యాభై లక్షల మంది వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో లేవు. రాష్ట్ర జనాభాకు, ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారానికి పొంతన లేదు. పదేళ్లలో పలుమార్లు ఇంటింటి సర్వేలు చేపట్టినా 50లక్షల మంది పౌరుల సమాచారం ప్రభుత్వం వద్ద లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.