Andhra Pradesh News Live December 31, 2024: AP Liquor Shops: ఏపీలో మరో 340 మద్యం దుకాణాలు.. వారం రోజుల్లో నోటిఫికేషన్, గీత కులాలకు కేటాయింపు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 31 Dec 202404:12 PM IST
- AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్లో త్వరలో మరో 340 మద్యం దుకాణాల ఏర్పాటుకు నోటిఫికేషన్ వెలువడనుంది. 2024 ఎక్సైజ్ పాలసీలో భాగంగా గీత కులాలకు 10శాతం దుకాణాలను కేటాయించాాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దుకాణాలకు వారం రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
Tue, 31 Dec 202412:47 PM IST
Anakapalli Crime : అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గిరిజన బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి అనంతరం అత్యాచారం చేశారు.
Tue, 31 Dec 202412:02 PM IST
- APSRTC : పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పంచ వైష్ణవ క్షేత్ర దర్శిని పేరుతో స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి వైష్ణవ ఆలయాల దర్శనం, తణుకు నుంచి సప్త శ్రీనివాస క్షేత్ర దర్శనానికి స్పెషల్ సర్వీస్‌ల వేసింది.
Tue, 31 Dec 202411:42 AM IST
AP Social Media Campaign : ఏపీ సర్కార్ సోషల్ మీడియాను మంచికి వాడుదామంటూరు ప్రచారం చేపట్టింది. చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడవద్దు అనే గాంధీజీ సూక్తి కాన్సెప్ట్‌తో సోషల్ మీడియాలో చెడు పోస్టులు వద్దంటూ క్యాంపెయిన్ చేపట్టింది
Tue, 31 Dec 202410:13 AM IST
Perni Nani : రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నానిని ఏ6గా చేర్చారు మచిలీపట్నం పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని జయసుధకు కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. తాజాగా పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది.
Tue, 31 Dec 202408:45 AM IST
- AP ration Shops: ఆంధ్రప్రదేశ్‌లోని పౌరసరఫరాల శాఖలో రేషన్ డీలర్ల నియామకానికి సంబంధించి ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. శాశ్వత ప్రాతిపదికన మూడు జిల్లాల్లో 438 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నారు.
Tue, 31 Dec 202408:42 AM IST
AP Inter College Mid Day Meal : ఏపీలో రేపటి నుంచి జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉచిత భోజన పథకం అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
Tue, 31 Dec 202408:28 AM IST
IRCTC Kerala Package : ఐఆర్సీటీసీ విశాఖ నుంచి 7 రోజుల కేరళ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ టూర్ లో కొచ్చి, మున్నార్, తేక్కడి , కుమారకోమ్, త్రివేండ్రంలోని టూరిస్ట్ ప్రదేశాలు విజిట్ చేయవచ్చు. జనవరి 24, 2025 తేదీన ఈ ఎయిర్ ట్యూర్ ప్యాకేజీ ప్రారంభం కానుంది.
Tue, 31 Dec 202407:51 AM IST
- AP Welfare Pensions: ఆంధ్రప్రదేశ్లో సామాజికర పెన్షన్ల పంపిణీ చురుగ్గా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజాముకు ముందే పెన్షన్లను సచివాలయ ఉద్యోగులు ప్రారంభించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని యల్లమందలో ముఖ్యమంత్రి స్వయంగా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. లబ్దిదారులతో ముచ్చటించారు.
Tue, 31 Dec 202407:08 AM IST
- AP River Connection : నదులను అనుసంధానం అనేది భారీ ప్రాజెక్టు. దీని వల్ల అనేక రకాలుగా లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నదుల అనుసంధానం గురించి అనేక అధ్యయనాలు జరిగాయి. తాజాగా.. ఏపీలో గోదావరి- బనకచర్ల అనుసంధానం అంశం తెరపైకి వచ్చింది. దీని వల్ల లాభాలు ఏంటో చూద్దాం.
Tue, 31 Dec 202405:40 AM IST
- AP SSC Paper leak: ఆంధ్రప్రదేశ్ పదోతరగతి సమ్మేటివ్ 1 పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేసిన కేసులో ఉపాధ్యాయుడిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ సెంటర్ అధికారుల ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు కోనసీమ జిల్లా రామచంద్రాపురం స్కూల్ టీచర్‌ను నిందితుడిగా గుర్తించారు.
Tue, 31 Dec 202404:53 AM IST
- AP Freebus Scheme: ఏపీలో కూటమి పార్టీల ఎన్నికల హామీల్లో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణానికి ముహుర్తం ఖరారైంది. 2025 ఉగాది నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సర్కారు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న బస్సులతో ఉచిత హామీ నెరేవర్చడం సాధ్యం కాకపోవడంతో కొత్తబస్సులతో కలిపి ఉగాది నుంచి అమలు చేస్తారు.
Tue, 31 Dec 202403:50 AM IST
- East Godavari : తూర్పుగోదావరి జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు కలకలం సృష్టిస్తోన్నాయి. ఒకపక్క రేవ్ పార్టీలు, మరోవైపు స్పా సెంటర్ పేరుతో వ్యభిచార కేంద్రాలు నడుస్తోన్నాయి. వీటీపై పోలీసులు నిఘా పెట్టారు. రేవ్ పార్టీలో 19 మందిని, స్పా సెంటర్ వద్ద ఉన్న వ్యభిచార కేంద్రంలో 9 మందిని అరెస్టు చేశారు.
Tue, 31 Dec 202402:55 AM IST
- Janasena Pawan: జనసేనలో నాగబాబు పనితీరే ప్రామాణికంగా తీసుకుని పదవులు కేటాయిస్తున్నట్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన హరిప్రసాద్ కులమేమిటో తెలియదని, నాగబాబును కూడా పనితీరు ఆధారంగానే గుర్తించి త్వరలో ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామన్నారు.
Tue, 31 Dec 202401:55 AM IST
- TG Mla Letters: తెలంగాణ ప్రజా ప్రతినిధుల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలతో తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలని కోరుతున్నారు.దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
Tue, 31 Dec 202412:30 AM IST
- CBN Consultants: ఏపీలో రాజకీయ పార్టీల్లోనే కాదు ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా కన్సల్టెంట్ల మోజును వీడటం లేదు. పార్టీని గెలిపించిన కన్సల్టెంట్లను ప్రభుత్వ కార్యకలాపాల్లోకి కూడా చొప్పించడానికి ప్రభుత్వాలు సంకోచించడం లేదు. సాంకేతికత మోజుతో ఏపీలో అవసరానికి మించి కన్సల్టెన్సీల జోరు సాగుతోంది.
Tue, 31 Dec 202411:30 PM IST
- Sambara Jatara: ఉత్తరాంధ్రలో జరిగే పోలమాంబ జాతరను రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 27,28,29 తేదీల్లో మూడ్రోజులపాటు పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ వేడుకల్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు.