Andhra Pradesh News Live December 30, 2024: AP New Pensions : పెన్షన్ల పంపిణీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, కొత్తగా 5402 మందికి స్పౌజ్ పింఛన్లు మంజూరు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 30 Dec 202405:43 PM IST
AP New Pensions : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ప్రక్రియలో కొత్తగా 5402 మందికి పింఛన్లు మంజూరు అయ్యాని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపింది. వీరికి డిసెంబర్ 31న కొత్త పింఛన్లు అందించనున్నామన్నారు. భర్త మరణించిన వారికి స్పౌజ్ కేటగిరీలో పెన్షన్లు అందిస్తున్నామన్నారు.
Mon, 30 Dec 202405:16 PM IST
ISRO PSLV C60 : పీఎస్ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతం అయినట్లు ఇస్రో ప్రకటించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సోమవారం రాత్రి 10.15 గంటలకు వాహక నౌక ప్రయోగించినట్లు వెల్లడించింది. ఈ ప్రయోగం భారత స్పేస్ డాకింగ్ సామర్థ్యాన్ని పెంచిందని పేర్కొంది.
Mon, 30 Dec 202404:15 PM IST
AP Registration Charges Hike : ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గ్రోత్ సెంటర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుదల ఉంటుందన్నారు. మొత్తం మీద 0 నుంచి 20 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుదల ఉంటుందన్నారు.
Mon, 30 Dec 202402:23 PM IST
- CBN On Godavari: గోదావరి జలాలను బనకచర్లకు తరలించి తెలుగుతల్లికి జలహారతి ఇవ్వడం తన జీవితాశయమని, ఇది పూర్తైతే ఏపీకి గేమ్ ఛేంబర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చరిత్ర తిరగరాసే ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరవు మాట వినబడదన్నారు.నదుల అనుసంధానంతో భావి తరాలకు నీటి సమస్య ఉండదని చెప్పారు.
Mon, 30 Dec 202412:30 PM IST
Vizianagaram Crime : విజయనగరం జిల్లాలో బాలికలపై ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ చిన్నారులపై వేధిస్తుండడం ఓ తాపీమేస్త్రీ చూసి, ఫొటోలు తీశారు. ఈ ఫొటోలు తల్లిదండ్రులు చూపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Mon, 30 Dec 202411:58 AM IST
Trains Information : ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎనిమిది మెము రైళ్లు పునరుద్ధరించింది. మరో 14 రైళ్లకు అదనపు కోచ్ లు పెంచింది.
Mon, 30 Dec 202410:16 AM IST
Perni Nani Ration Rice Case : పేర్ని నాని భార్య జయసుధ గోదాములో రేషన్ బియ్యం మాయం కేసులో అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. పౌరసరఫరాల శాఖ అధికారుల విచారణలో పేర్ని నాని గోదాములో 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయం అయినట్లు గుర్తించారు. ఈ షార్టేజీకి జాయింట్ కలెక్టర్ జరిమానా విధించారు.
Mon, 30 Dec 202407:49 AM IST
- Pawan on Allu Arjun: సినీ నటుడు అల్లు అర్జున్ వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ‌్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన పవన్ ఘటన జరిగిన వెంటనే క్షమాపణలు చెప్పి బాధితుల్ని పరామర్శించి ఉండాల్సిందన్నారు.
Mon, 30 Dec 202407:42 AM IST
- Pariksha Pe Charcha 2025 : విద్యార్థులకు ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడే అవకాశం వచ్చింది. పరీక్షా పే చర్చ కార్యక్రమంలో భాగంగా.. ప్రధానమంత్రి విద్యార్థులతో మాట్లాడనున్నారు. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం.. https://innovateindia1.mygov.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
Mon, 30 Dec 202405:24 AM IST
- NTR Bharosa Pensions: ఏపీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్ 31న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా నరసరావుపేటలోని యల్లమంద గ్రామంలో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
Mon, 30 Dec 202404:44 AM IST
- Visakha Central Jail: విశాఖసెంట్రల్ జైల్లో ఇద్దరు వార్డర్లకు ఖైదీల ముందే బట్టలిప్పి తనిఖీలు చేయడం కలకలం సృష్టించింది. జైల్లోకి గంజాయి తెస్తున్నారనే అనుమానంతో సోదాలు చేశామని అధికారులు చెబుతుంటే, వేధింపులపై సిబ్బంది, కుటుంబాలతో సహా రోడ్డెక్కడం కలకలం రేపింది.
Mon, 30 Dec 202403:22 AM IST
- Anakapalli Murder: అనకాపల్లి జిల్లా విషాదం ఘటన చోటు చేసుకుంది. కన్నకొడుకును తండ్రి హత్య చేశాడు. మద్యం మత్తులో కొడుకుపై రాయితో దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని వెంకునాయుడు పేటలో ఈ దారుణం జరిగింది.
Mon, 30 Dec 202401:09 AM IST
- Ambedkar Statue: విజయవాడలో వైసీపీ ప్రభుత్వ హయంలో సబ్‌ప్లాన్ నిధులతో రూ.400కోట్ల వ్యయంతో నిర్మించిన అంబేడ్కర్ సామాజిక న్యాయ శిల్పం నిర్వహణపై ప్రభుత్వ శాఖలు మల్లగుల్లాలు పడుతున్నాయి. విగ్రహ నిర్వహణకు ప్రతి నెల ఖర్చే తప్ప ఆదాయం లేకపోవడంతో ప్రత్యామ్నయాలు చూస్తున్నారు.
Mon, 30 Dec 202412:32 AM IST
- Godavari to Penna: ఏపీలో గోదావరి నుంచి వృధాగా సముద్రంలోకి మళ్ళించే వరద జలాలను పెన్నా బేసిన్‌కు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.గోదావరి జలాలను కృష్ణా మీదుగా పెన్నాకు తరలించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. 280 టిఎంసీలను తరలించి 80లక్షల మందికి తాగు,7.5లక్షల ఎకరాలకు సాగునీరుఅందిస్తారు.