Andhra Pradesh News Live December 29, 2024: AP New CS : ఏపీ నూతన సీఎస్ గా విజయానంద్ నియామకం, ఉత్తర్వులు జారీ
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 29 Dec 202405:34 PM IST
AP New CS : ఏపీ కొత్త సీఎస్ గా విజయానంద్ పేరు ఖరారైంది. విజయానంద్ ను సీఎస్ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది.
Sun, 29 Dec 202404:27 PM IST
Kakinada Olive Ridley Turtle : కాకినాడ తీరంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు.
Sun, 29 Dec 202411:43 AM IST
Sankranti Special Trains : సంక్రాంతి రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సికింద్రాబాద్, విశాఖ, పార్వతీపురం, హైదరాబాద్, కటక్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు.
Sun, 29 Dec 202411:12 AM IST
Vijayawada New Year Celebrations : విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అర్ధరాత్రి రోడ్లపై న్యూ ఇయర్ వేడుకలకు అనుమతులు లేవన్నారు. రాత్రి వేళ కేకలు వేస్తూ వాహనాలపై తిరిగితే చర్యలు తీసుకుంటామని సీపీ రాజశేఖర్ బాబు హెచ్చరించారు.
Sun, 29 Dec 202410:37 AM IST
APSRTC Sankranti Special : సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. విజయవాడ నుంచి 1,350, విశాఖపట్నం నుంచి 800 స్పెషల్ బస్సు సర్వీసులను నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ సన్నాహాలు చేస్తుంది.
Sun, 29 Dec 202410:06 AM IST
JC Prabhakar Reddy On Perni Nani : మాజీ మంత్రి పేర్ని నానిపై టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పేర్ని నాని మంత్రిగా ఉన్నప్పుడు మా ఇంట్లో ఆడవాళ్లు గుర్తురాలేదా? అని ప్రశ్నించారు. పేర్ని నానిని మాత్రం వదిలిపెట్టమన్నారు.
Sun, 29 Dec 202409:02 AM IST
AP Govt Schemes : ఏపీ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. బీసీ వర్గాల్లో మహిళలకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా 90 రోజుల పాటు టైలరింగ్ శిక్షణ ఇచ్చి రూ.24 వేలు విలువ గల కుట్టు మిషన్ ఉచితంగా అందించనున్నారు. అలాగే బీసీ నిరుద్యోగ యువతకు జనరిక్ షాపుల ఏర్పాటుకు సబ్సిడీపై రూ.8 లక్షల రుణం అందించనున్నారు.
Sun, 29 Dec 202408:08 AM IST
- SCR Mahakumbh Mela Special trains : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మహాకుంభ మేళకు ఏపీలోని పలు ప్రాంతాల నుంచి 12 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో కొన్ని విజయవాడ, తిరుపతి, నర్సాపూర్ నుంచి రాకపోకలు సాగిస్తాయి.
Sun, 29 Dec 202407:16 AM IST
- Insurance In Arogyasri: ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీలో బీమా కంపెనీలను ప్రవేశపెట్టాలనే ఆలోచన వెనుక ఎవరి ఆసక్తులు ఉన్నాయనే సందేహం ఏపీలో చర్చ జరుగుతోంది. పేదలకు నాణ్యమైన వైద్య సేవల్ని అందించే లక్ష్యంతో మొదలైన ఆరోగ్యశ్రీ సేవలు..బీమా సేవలకు చేరుతుండటం వెనుక ఏదో జరుగుతుందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Sun, 29 Dec 202405:48 AM IST
- Tirumala Special Days 2025 : కొత్త ఏడాది జనవరి మాసంలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ వెల్లడించింది. ఏ తేదీల్లో ఏ ఉత్సవాలను నిర్వహిస్తారో వివరించింది. జనవరి 9 నుంచి 29వ తేదీ వరకు వివిధ ఉత్సవాలు జరగనున్నాయి.
Sun, 29 Dec 202403:58 AM IST
- మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను కత్తి వేటుతో భర్త హతమార్చాడు. ఈ దారుణ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని వీరభద్రవరంలో జరిగింది. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పల్నాడు జిల్లాలో అనుమానంతో భార్యను భర్త కొట్టి చంపాడు.
Sun, 29 Dec 202402:38 AM IST
- Tirumala Vaikunta Ekadasi Darshan 2025 : తిరుమలలో వైకుంఠ ఏకాదశికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమయంలో అన్నిరకాల ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఈవో స్పష్టం చేశారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులకు టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తామని చెప్పారు.