Andhra Pradesh News Live December 28, 2024: TDP Mlc Son No More : ఎమ్మెల్సీ రామచంద్రయ్య కుమారుడు గుండెపోటుతో మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి-today andhra pradesh news latest updates december 28 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live December 28, 2024: Tdp Mlc Son No More : ఎమ్మెల్సీ రామచంద్రయ్య కుమారుడు గుండెపోటుతో మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

TDP Mlc Son No More : ఎమ్మెల్సీ రామచంద్రయ్య కుమారుడు గుండెపోటుతో మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Andhra Pradesh News Live December 28, 2024: TDP Mlc Son No More : ఎమ్మెల్సీ రామచంద్రయ్య కుమారుడు గుండెపోటుతో మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

02:24 PM ISTDec 28, 2024 07:54 PM HT Telugu Desk
  • Share on Facebook
02:24 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 28 Dec 202402:24 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: TDP Mlc Son No More : ఎమ్మెల్సీ రామచంద్రయ్య కుమారుడు గుండెపోటుతో మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

  • TDP Mlc Son No More : టీడీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య కుమారుడు విష్ణుస్వరూప్ గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన మరణించారు. ఎమ్మెల్సీ రామచంద్రయ్య కుమారుడు మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202401:56 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Arogyasri: ఆరోగ్యశ్రీలోకి మళ్లీ ప్రైవేట్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీలు.. ఇక వైద్య సేవల్లో బీమా కంపెనీలదే పెత్తనం…

  • AP Arogyasri: ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్య శ్రీ సేవలపై ఏపీ ప్రభుత్వం కీలక మార్పులకు సిద్ధం అవుతోంది. ఆరోగ్య శ్రీ బాధ్యతల్ని ఇన్సూరెన్స్‌ కంపెనీలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. వేల కోట్లు  ఖర్చు చేస్తున్నా ఆరోగ్యశ్రీ సేవలపై ప్రజల్లో సంతృప్తి లేని తరుణంలో ప్రభుత్వ నిర్ణయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202401:07 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Caste Survey : డిసెంబర్ నెలాఖరు వ‌ర‌కు ఎస్సీ కుల స‌ర్వేపై అభ్యంత‌రాలు స్వీక‌రణ‌, తుది జాబితా ఎప్పుడంటే?

  • AP Caste Survey : ఏపీలో ఎస్సీ కుల సర్వేపై డిసెంబర్ 31 వరకు అభ్యంతరాలను స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. జ‌న‌వ‌రి 10 తేదీన స‌ర్వే తుది జాబితాను గ్రామ, వార్డు స‌చివాల‌యాల్లో ప్రచురించనున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202412:34 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: DGP : సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై డీజీపీ వార్నింగ్, రౌడీ షీట్ల తరహాలో సైబర్ షీట్లు తెరుస్తామని ప్రకటన

  • DGP Dwaraka Tirumalarao : 2024లో సైబర్ క్రైమ్ కు సంబంధించి 916 కేసులు నమోదు చేశామని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఈ ఏడాది సైబర్ కేటుగాళ్లు రూ. 1229 కోట్లు కొట్టేశారన్నారు. డిజిటల్ అరెస్టు అనేదే లేదన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202412:33 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: South Central Railway : అనంత‌పురం మీదుగా నడిచే ఆరు రైళ్లు ర‌ద్దు.. ఈ రైళ్లకు అద‌న‌పు కోచ్‌లు

  • South Central Railway : అనంత‌పురం మీదుగా రాక‌పోక‌లు నిర్వ‌హించే పలు రైళ్లను రద్దు చేశారు. తాడిప‌త్రి, క‌డ‌ప మీదుగా రాక‌పోక‌లు నిర్వ‌హించే రెండు రైళ్లను 2 నెల‌ల పాటు ర‌ద్దు చేశారు. కుంభ‌మేళ పూర్తయ్యాక వీటిని పునరుద్ధ‌రిస్తామని అధికారులు చెబుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202411:50 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Pawan Kalyan : వైసీపీకి 11 సీట్లు వచ్చినా అహంకారం చావలేదు, అధికారులపై దాడులు చేస్తే కఠిన చర్యలు- పవన్ కల్యాణ్

  • Pawan Kalyan : వైసీపీకి 11 సీట్లు వచ్చినా ఇంకా ఆ పార్టీ నాయకులు గాల్లో విహరిస్తున్నారని, ఎలా కిందకి దించాలో తమకు బాగా తెలుసని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అహంకారంతో అధికారులపై దాడులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202411:05 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Sadarem Certificate : ఏపీలో సదరం క్యాంపులకు తాత్కాలిక బ్రేక్, తనిఖీల కారణంగా సర్టిఫికెట్ల పంపిణీ నిలిపివేత

  • AP Sadarem Certificate : ఏపీలో సదరం సర్టిఫికెట్ల జారీకి రాష్ట్ర ప్రభుత్వం క్యాంపుల నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వికలాంగ ధ్రువీకరణ పత్రాల తనిఖీల కారణంగా జనవరి ఒకటి నుంచి సదరం క్యాంపులు, సదరం సర్టిఫికెట్ల పంపిణీ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202410:47 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Perni Nani : నా భార్యను అరెస్ట్ చేయించాలని ఓ మంత్రి చూస్తున్నారు : పేర్ని నాని

  • Perni Nani : మాజీమంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్యను అరెస్ట్ చేయించాలని ఓ మంత్రి చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు దగ్గర కూడా ఈ విషయంపై చర్చించారన్న నాని.. మహిళల జోలికి వెళ్లొద్దని చంద్రబాబు చెప్పారని వివరించారు. సీఎం చెప్పినప్పటికీ వాళ్లు ప్రయత్నాలు ఆపడం లేదన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202410:00 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vijayawada Crime : బంగారం కోసం తల్లిని హత్య చేసిన పెద్ద కొడుకు కోడలు, రెండ్రోజుల్లో కేసు ఛేదించిన పోలీసులు

  • Vijayawada Crime : బంగారం కోసం కన్న తల్లిని హత్య చేశాడు గొప్ప కొడుకు. ఈ ఘనకార్యంలో కోడలి హస్తం కూడా ఉంది. అప్పులపై పాలై...ఆస్తి పంచాలని తల్లిని అడగగా..అందుకు ఆమె నిరాకరించింది. దీంతో కొడుకు, కోడలు కలిసి ఆమెను హత్య చేశారు. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202409:25 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Nitish Kumar Reddy : ఆసీస్ పై సెంచరీ బాదిన నితీష్ కు సీఎం చంద్రబాబు అభినందనలు, రూ.25 లక్షల నజరానా ప్రకటించిన ఏసీఏ

  • Nitish Kumar Reddy : ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన విశాఖ యువకుడు నితీష్ కుమారె రెడ్డికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఒత్తిడిలో కూడా నితీష్ కుమార్ రెడ్డి ధైర్యం, దృఢ సంకల్ప శక్తిని ప్రదర్శించి అద్భుతమైన తొలి సెంచరీని సాధించడం చాలా సంతోషం అని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202407:36 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Dy CM Pawan: పవన్ పర్యటనలో భద్రతా వైఫల్యం, మన్యంలో నకిలీ ఐపీఎస్‌ హల్‌చల్‌, విచారణకు ఆదేశించిన హోంమంత్రి

  • Dy CM Pawan: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం జిల్లా పర్యటనలో భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. ఇటీవల మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా నకిలీ ఐపీఎస్‌ పవన్ పర్యటన ఆద్యంతం హంగామా చేయడం వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతంపై విచారణకు జరుగుతోంది. 
పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202407:26 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: RS.99 Liquor Effect: రూ.99 లిక్కర్ ఎఫెక్ట్‌.. ఏపీలో మద్యం అమ్మకాల్లో భారీగా పడిపోయిన ఆదాయం

  • RS.99 Liquor Effect: ఆంధ్రప్రదేశ్‌లో రెండు నెలల క్రితం ప్రారంభమైన ప్రైవేట్ మద్యం దుకాణాల్లో అందుబాటులోకి తెచ్చిన రూ.99మద్యంతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది.  చౌక ధరలకు నాణ్యమైన  మద్యాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడంతో ఆ ఎఫెక్ట్‌ రెవిన్యూపై పడింది. 
పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202406:32 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala : ఈనెల 30 నుంచి శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు - 25 రోజుల పాటు నిర్వహణ

  •  TTD Adhyayanotsavams 2024 : శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. శ్రీవారికి నిర్వహించే అత్యంత సుదీర్ఘమైన అధ్యయనోత్సవాలు డిసెంబరు 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.  2025 జ‌న‌వ‌రి 23వ తేదీ వరకు తిరుమల ఆలయంలో ఈ ఉత్సవాలను ఘనంగా జరుపనున్నట్లు టీటీడీ పేర్కొంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202406:20 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Cabinet Expansion: ఏపీ క్యాబినెట్‌లో మార్పులు చేర్పులు తప్పవా..! మంత్రి వర్గం మార్పులపై జోరుగా ఊహాగానాలు

  • AP Cabinet Expansion: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆర్నెల్లు పూర్తవగానే మంత్రి వర్గ విస్తరణ పుకార్లు మొదలయ్యాయి.మంత్రుల తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారంతో పాటు కొందరికి ఉద్వాసన,కొత్తవారికి అవకాశం కల్పిస్తారనే ప్రచారాలు మొదలయ్యాయి.జనసేన తరపున నాగబాబుకు చోటు కల్పించనున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202405:44 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Yandagandi Crime Story : ఇంత దారుణమా.. ఆస్తికోసం అమాయకుణ్ని చంపేశారు.. పాపం పర్లయ్య

  • Yandagandi Crime Story : పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో.. చెక్కపెట్టెలో మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసం బెదిరించేందుకే నిందితులు హత్యకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఓ అమాయకుడు ప్రాణం కోల్పోయాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202404:42 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Krishna District Crime : కృష్ణా జిల్లాలో ఘోరం - ఎనిమిదో త‌ర‌గ‌తి బాలిక‌పై సామూహిక అత్యాచారం..!

  • కృష్ణా జిల్లాలో ఎనిమిదో త‌ర‌గ‌తి బాలిక‌పై సామూహిక అత్యాచారం జరిగింది. కాళ్లు, చేతులు క‌ట్టేసి అఘాయిత్యానికి పాల్పపడ్డారు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు న‌మోదు చేశారు. బాలిక‌పై అత్యాచారినికి పాల్ప‌డిన వారు అదే ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202403:47 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirupati : తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర యూనివ‌ర్సిటీలో లైంగిక వేధింపులు.. ప్రొఫెస‌ర్‌ను అరెస్టు చేసిన పోలీసులు!

  • Tirupati : తిరుప‌తిలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. వెంక‌టేశ్వ‌ర అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్శిటీలో విద్యార్థినిపై ప్రొఫెస‌ర్ లైంగిక వేధింపుల‌కు పాల్పడ్డాడు. విద్యార్థిని ఫిర్యాదుతో ఆయ‌న‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని పోలీసులు తెలిపారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202401:11 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: APSRTC Sankranti Special Buses : సంక్రాంతికి ఊరెళ్లే వారికి APSRTC గుడ్‌న్యూస్‌ - హైదరాబాద్ నుంచి 2,400 ప్రత్యేక బస్సులు

  • APSRTC Sankranti Special Buses 2025 : సంక్రాంతి వేళ సొంత ఊళ్లకు వెళ్లే వారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపనుంది.  రెగ్యులర్‌గా నడిచే సర్వీసులతో పాటు 2400 బస్సులను అదనంగా ఏర్పాటు చేయనుంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202412:55 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Former IAS Imtiaz Ahmed : వీఆర్ఎస్ తీసుకుని మరీ ఎమ్మెల్యేగా పోటీ...! ఇంతలోనే రాజకీయాలకు మాజీ ఐఏఎస్ గుడ్ బై..!

  • Former IAS Officer Imtiaz Ahmed : వైసీపీకి మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంతియాజ్ పోటీ చేసి ఓడిపోయారు. 
పూర్తి స్టోరీ చదవండి