Andhra Pradesh News Live December 11, 2024: AP Rains : ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు-today andhra pradesh news latest updates december 11 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live December 11, 2024: Ap Rains : ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

AP Rains : ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

Andhra Pradesh News Live December 11, 2024: AP Rains : ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

04:53 PM ISTDec 11, 2024 10:23 PM HT Telugu Desk
  • Share on Facebook
04:53 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 11 Dec 202404:53 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Rains : ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

  • AP Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు కదులుతుందని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో రేపు ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202402:47 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Inter 2025 Exams: ఏపీ ఇంటర్ పరీక్షల టైమ్‌ టేబుల్ విడుదల.. మార్చి 1 నుంచి పరీక్షల నిర్వహణ..

  • AP Inter 2025 Exams: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ పబ్లిక్‌ పరీక్షల టైమ్‌ టేబుల్ విడుదలైంది.మార్చి 1నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రకటించారు.ఇంటర్మీడియట్‌ రెగ్యులర్,ఒకేషనల్‌ విద్యార్థులకు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202401:37 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

  • AP SSC Exams Schedule : ఏపీ పదో తరగతి షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. 

పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202412:41 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Birth Death Certificates : బర్త్, డెత్ స‌ర్టిఫికేట్‌లు పొందేందుకు కొత్త వెబ్‌పోర్టల్-జ‌న‌వ‌రి 1 నుంచి అందుబాటులోకి

  • AP Birth Death Certificates : జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ఏపీ ప్రభుత్వం నూతన పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురానుంది. బర్త్ స‌ర్టిఫికేట్‌, డెత్ స‌ర్టిఫికేట్ స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించే దిశ‌గా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది

పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202412:22 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Housing Scheme : ఇల్లు లేని వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, సొంతింటి నిర్మాణానికి ఆర్థికసాయం-ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

  • AP Housing Scheme : సొంతింటి క‌ల‌ను నెరవేర్చుకోవ‌డానికి ఎదురు చూస్తున్నారా? అయితే ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంబంధిత స‌చివాలయానికి వెళ్లి ద‌ర‌ఖాస్తు తీసుకుని, దానికి అవ‌స‌ర‌మైన ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు జత చేసి సొంతింటి నిర్మాణానికి ఆర్థిక సాయం పొందవచ్చు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202412:05 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Tourism : ఏపీ నూతన టూరిజం పాలసీ-ఇకనైనా పర్యాటకానికి ఊతం లభిస్తుందా?

  • AP Tourism : ఏపీ నూతన టూరిజం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా కొత్త టూరిజం పాలసీని అమల్లోకి తెస్తున్నట్లు స్పష్టం చేసింది. సరైన ప్రోత్సాహం, నిధుల కేటాయింపుతో టూరిజాన్ని మరింత ముందుకు తీసుకెళ్లొచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202411:48 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: TDP Rajya Sabha Candidates : రాజ్య‌స‌భ అభ్యర్థుల ఖరారు - టీడీపీలో లుక‌లుక‌లు..!

  • TDP Rajya Sabha Candidates 2024 : తెలుగుదేశం పార్టీలో రాజ్య‌స‌భ అభ్యర్థుల ఖరారు చర్చనీయాంశంగా మారింది.  ఓ సీటును బీదా మస్తాన్ రావుకు దక్కినప్పటికీ… మరో సీటును సానా స‌తీష్‌కు ఇచ్చారు. అయితే కొత్తగా పార్టీలోకి వచ్చిన సానా సతీష్ కు ఎలా టికెట్ దక్కిందనే దానిపై పార్టీలోని నేతలు చర్చించుకుంటున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202409:27 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Dy CM Pawan Kalyan : రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మా విభేదాలు పక్కనపెట్టాం, అధికారుల తీరు మారాలి- పవన్ కల్యాణ్

  • Dy CM Pawan Kalyan : తప్పులు జరుగుతున్నా వద్దని చెప్పకపోవడం నేడు రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202408:18 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Liquor Shops: ఏపీలో నేతల గుప్పెట్లో మద్యం వ్యాపారం.. వేలంలో దుకాణాలు వచ్చినా.. తెరుచుకోని మద్యం దుకాణాలు

  • AP Liquor Shops: ఏపీలో ప్రైవేట్‌ మద్యం దుకాణాలు వేలంలో కేటాయించి రెండు నెలలు దాటుతున్న ఇంకా పలు ప్రాంతాల్లో దుకాణాలు తెరుచుకోలేదు.  ప్రతి నియోజక వర్గంలో స్థానిక నాయకులే ప్రైవేట్‌ మద్యం దుకాణాల్లో వ్యాపారాన్ని చేజిక్కించుకున్నారు. లాటరీలో దుకాణాలు వచ్చినా  వ్యాపారాలు మాత్రం చేయనివ్వడం లేదు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202407:27 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: CBN Collectors Meeting: సంక్షోభాల్లో అవకాశాలు వెదుక్కోవడమే నాయకత్వం, కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు

  • CBN Collectors Meeting:  ప్రతీ సంక్షోభంలో అవకాశాలుంటాయని, అందులో అవకాశాలు వెతుక్కోవడమే నాయకత్వమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వెలగపూడి సచివాలయంలో కలెక్టర్ల సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు.  జిల్లాల్లో రేషన్, గంజాయి, డ్రగ్స్‌ మాఫియాలను కూకటి వేళ్లతో పెకిలించాలని పిలుపునిచ్చారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202407:00 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Christmas Kanuka: రేషన్‌ కార్డుదారులకు శుభవార్త, మళ్లీ క్రిస్మస్ కానుక.. త్వరలో అంబేడ్కర్ విద్యా దీవెన పథకం

  • Christmas Kanuka: ఏపీలో రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.వైసీపీ ప్రభుత్వంలో రద్దు చేసిన పథకాలను త్వరలో పునరుద్ధరించేందుకు సిద్ధమవుతోంది.  దళితులకు రద్దు చేసిన పథకాలను పునరుద్దరించనున్నట్టు మంత్రి డోలా బాలవీరాంజనేయులు ప్రకటించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202406:12 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Sankranti Special Buses : ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ - తూర్పుగోదావ‌రి జిల్లా నుంచి హైదరాబాద్‌కు 88 స్పెష‌ల్ స‌ర్వీసులు

  •  సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. దీంతో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను తీసుకొచ్చే పనిలో పడింది. ఇందులో భాగంగా… తూర్పు గోదావ‌రి జిల్లా నుంచి హైదరాబాద్‌కు 88 స్పెష‌ల్ స‌ర్వీసులను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు తేదీలతో పాటు సర్వీసుల సంఖ్య వివరాలను వెల్లడించింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202405:24 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Visakha Hospital: విశాఖలో దారుణం..తలకు స్కాన్‌ చేయడానికి మహిళ బట్టలిప్పాలన్న టెక్నిషియన్‌..సీఎం ఆదేశాలతో అరెస్ట్

  • Visakha Hospital: విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తలకు గాయమై స్కానింగ్ కోసం వచ్చిన మహిళను బట్టలిప్పాలని సూచించడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించిన ఆస్పత్రి ల్యాబ్ టెక్నిషియన్ కటకటాల పాలయ్యాడు. ఈ ఘటనసై సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు వేగంగా స్పందించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202404:54 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala : ఈనెల 16 నుంచి ధనుర్మాసం - శ్రీవారికి సుప్రభాత సేవ స్థానంలో 'తిరుప్పావై '

  • తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. డిసెంబరు 16 నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం ఉంటుందని తెలిపింది. దీంతో డిసెంబరు 17వ తేదీ నుంచి తిరుమలలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై నివేదిస్తారని పేర్కొంది. జనవరి 14వ తేదీన ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయని తెలిపింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202404:20 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TG Weather Updates : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం - ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, తెలంగాణలో పొడి వాతావరణం

  • బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ అంచనా వేసింది. తెలంగాణలో మాత్రం పొడి వాతావరణమే ఉండనుంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202412:21 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Panchayat Elections: పంచాయితీ ఎన్నికల్లో 650 మంది ఓటర్లకో పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తామన్న సంగారెడ్డి కలెక్టర్

  • Panchayat Elections: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి అన్నారు.ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతినిధులతో కలెక్టర్ క్రాంతి  సమావేశం నిర్వహించారు.
పూర్తి స్టోరీ చదవండి