Andhra Pradesh News Live August 31, 2024: APSDMA Helpline : భారీ వర్షాల వేళ జాగ్రత్త..! అత్యవసర సేవల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే-today andhra pradesh news latest updates august 31 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live August 31, 2024: Apsdma Helpline : భారీ వర్షాల వేళ జాగ్రత్త..! అత్యవసర సేవల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే

APSDMA Helpline : భారీ వర్షాల వేళ జాగ్రత్త..! అత్యవసర సేవల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే

Andhra Pradesh News Live August 31, 2024: APSDMA Helpline : భారీ వర్షాల వేళ జాగ్రత్త..! అత్యవసర సేవల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే

04:18 PM ISTAug 31, 2024 09:48 PM HT Telugu Desk
  • Share on Facebook
04:18 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 31 Aug 202404:18 PM IST

Andhra Pradesh News Live: APSDMA Helpline : భారీ వర్షాల వేళ జాగ్రత్త..! అత్యవసర సేవల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే

  • ఏపీలో వర్షాలు, వరదలపై విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ఆదేశాలను జారీ చేశారు. గోదావరి, కృష్ణా , తుంగభద్ర ఇతర నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రజలకు అత్యవసర సేవలను అందించేందుకు APSDMA హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202404:07 PM IST

Andhra Pradesh News Live: SCR Helpline Numbers : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దు- ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు

  • SCR Helpline Numbers : భారీ వర్షాల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దు చేశారు. మరికొన్నింటిని దారిమళ్లించారు. ఈ నేపథ్యంలో రైళ్ల సమాచారాన్ని ప్రయాణికులకు అందించేందుకు రైల్వే అధికారులు హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202403:01 PM IST

Andhra Pradesh News Live: CM Chandrababu : భారీ వర్షాలుంటే ముందు రోజే సెలవుపై ప్రకటన, ప్రతి జిల్లాకు రూ.3 కోట్లు- సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

  • CM Chandrababu : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రతి ప్రభుత్వ విభాగం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సహాయ చర్యలకు జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలుంటే విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202401:56 PM IST

Andhra Pradesh News Live: Chandrababu Naidu : చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎత్తుపల్లాలెన్నో- సీబీఎన్ పొలిటికల్ ప్రోగ్రెస్ రిపోర్ట్

  • Chandrababu Naidu : సెప్టెంబర్ 1, 1995న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. రాజకీయ నాయకునికీ లేని విధంగా, వైవిధ్యభరిత అవకాశాలు, సవాళ్లు ఎదుర్కొన్నారు. దాదాపు పదిహేనేళ్లు విపక్ష నేతగా, సుమారు అంతే కాలం సీఎంగా పనిచేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202401:12 PM IST

Andhra Pradesh News Live: Adani Gyan Jyoti Scholarship: విద్యార్థులకు అదానీ సంస్థ స్కాలర్‌షిప్, ఏడాదికి రూ.3.5 లక్షలు-అర్హతలు, దరఖాస్తు విధానం ఇలా

  • Adani Gyan Jyoti Scholarship : వృతి విద్యా కోర్సుల్లో జాయిన్ అయిన మొదటి సంవత్సరం విద్యార్థులకు అదానీ సంస్థ రూ.3.5 లక్షల వరకు స్కాలర్ షిప్ అందిస్తుంది. ఏపీ, రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల విద్యార్థులు ఈ స్కాలర్ దరఖాస్తుకు అర్హులు. దరఖాస్తులకు అక్టోబర్ 7 చివరి తేదీ.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202412:11 PM IST

Andhra Pradesh News Live: Railway Updates: రైల్వే ప్ర‌యాణికుల‌కు శుభవార్త.. పండగ సీజన్‌లో 14 ప్రత్యేక రైళ్లు.. రద్దీకి తగ్గట్టు ఏర్పాట్లు

  • Railway Updates: త్వరలో వరుస పండగలు రాబోతున్నాయి. దీంతో నగరాలు, పట్టణాల్లో ఉండే వారు సొంతూళ్లకు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో రైల్వే టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202411:48 AM IST

Andhra Pradesh News Live: Guntur Car Washed Away : ఏపీలో మరో విషాదం, వాగులో కొట్టుకుపోయిన కారు-ముగ్గురు మృతి

  • Guntur Car Washed Away : గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఉప్పలపాడు సమీపంలోని వాగులో కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఓ ఉపాధ్యాయుడు సహా ఇద్దరు విద్యార్థులు కొట్టుకుపోయారు. స్థానికులు కారు బయటకు లాగారు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202411:10 AM IST

Andhra Pradesh News Live: AP TG IMD Red Alert : ఏపీ, తెలంగాణకు రెడ్ అలర్ట్- ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

  • AP TG IMD Red Alert : బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తు్న్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నేడు, రేపు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202410:53 AM IST

Andhra Pradesh News Live: AP Police: పుష్పను మించిన స్మగ్లర్.. లారీ క్యాబిన్ చూసి షాకైన పోలీసులు

  • AP Police: తొందరగా డబ్బు సంపాదించడానికి చాలామంది గంజాయి స్మగ్లింగ్‌ను ఎంచుకుంటున్నారు. ఎన్ని కొత్త ప్లాన్‌లు వేసి స్మగ్లింగ్ చేసినా దొరికిపోతున్నారు. తాజాగా.. తూర్పు గోదావరి జిల్లాలో లారీలో గంజాయి తరలిస్తున్న వారిని ఏపీ పోలీసులు పట్టుకున్నారు. లారీ క్యాబిన్ చూసి పోలీసులు షాకయ్యారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202410:02 AM IST

Andhra Pradesh News Live: Nuzvid IIIT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో 1300 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఇవిగో కారణాలు..

  • Nuzvid IIIT: అన్నంలో పురుగులు.. నిళ్లలా సాంబారు.. అపరిశుభ్రమైన పరిసరాలు.. ఇదీ ప్రస్తుతం నూజివీడు ట్రిపుల్ ఐటీ పరిస్థితి. వీటి కారణంగా అక్కడ చదివే విద్యార్థులు 1300 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సమస్యలు చెప్పాలనుకున్న విద్యార్థులను సిబ్బంది బంధిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202410:01 AM IST

Andhra Pradesh News Live: Central Govt Schemes : పెట్టుబడి సాయం, తక్కువ వడ్డీ రుణాలు, పెన్షన్ - రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు

  • Central Govt Schemes For Farmers : రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పలు ముఖ్యమైన పథకాలను అమలు చేస్తుంది. రైతులకు పెట్టుబడి సాయం, తక్కువ వడ్డీతో రుణాలు, సబ్సిడీపై రుణాలు అందించేందుకు పలు పథకాలను అందుబాటులో తెచ్చింది. అలాగే రైతులకు పెన్షన్ ఇచ్చే పథకాన్ని కూడా కేంద్రం అమలు చేస్తుంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202409:44 AM IST

Andhra Pradesh News Live: Andhra Pradesh Rains: తీరాన్ని తాకక ముందే తీవ్ర ప్రభావం.. ఏపీలో వర్ష బీభత్సం

  • Andhra Pradesh Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రధాన నగరాల్లో జన జీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన ఉందని అధికారులు చెబుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202409:26 AM IST

Andhra Pradesh News Live: Vijayawada Trains Cancelled : ఏపీలో భారీ వర్షాలు-విజయవాడ డివిజన్ లో 20 రైళ్లు రద్దు

  • Vijayawada Trains Cancelled : భారీ వర్షాల కారణంగా విజయవాడ డివిజన్ లో 20 రైళ్లు రద్దు చేశారు. ఈ మేరకు విజయవాడ డీఆర్ఎం ప్రకటన జారీ చేశారు. నేటి నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు రైళ్లు రద్దు చేసినట్లు తెలిపారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202408:37 AM IST

Andhra Pradesh News Live: Pithapuram: డిప్యూటీ సీఎం తాలూకా.. పిఠాపురంలో పొట్టు పొట్టు కొట్టుకున్న అధికారులు!

  • Pithapuram: కౌన్సిల్ సమావేశాల్లో ఇన్నాళ్లు అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు గొడవలు పడటం చూశాం. కానీ.. తాజాగా పిఠాపురంలో ఇద్దరు ఆఫీసర్లు గొడవ పెట్టుకున్నారు. వ్యక్తిగత విషయాలను ప్రస్తావించుకుంటూ.. బూతులు తిట్టుకున్నారు. దీంతో కౌన్సిల్ సభ్యులు ముక్కున వేలేసుకున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202407:10 AM IST

Andhra Pradesh News Live: AP wine Shops Bandh: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ తేదీ నుంచి వైన్ షాపులు బంద్.. కారణం ఇదే..

  • AP wine Shops Bandh: మందుబాబులకు ఇది చేదు వార్త. అవును.. ఏపీలో వైన్ షాపులు బంద్ కానున్నాయి. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు బంద్ చేయాలని.. ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు నిర్ణయించారు. దీంతో అన్ని వైన్ షాపులు బంద్ కానున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202406:06 AM IST

Andhra Pradesh News Live: Anakapalli News : లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌య‌త్నం...! ప్రొఫెస‌ర్ అరెస్ట్

  • అన‌కాప‌ల్లిలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇంజ‌నీరింగ్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెస‌ర్ లైంగిక వేధింపుల‌తో విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌య‌త్నానికి పాల్ప‌డింది. దీంతో బాధితురాలి త‌ల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆ ప్రొఫెస‌ర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంత‌రం ఆ ప్ర‌బుద్ధుడిని రిమాండ్‌కు పంపారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202404:29 AM IST

Andhra Pradesh News Live: AP Pensions: భారీ వర్షంలోనూ కొనసాగుతున్న ఫించన్ల పంపిణీ.. దటీజ్ చంద్రబాబు

  • AP Pensions: ఓవైపు భారీ వర్షం.. మరోవైపు ఫించన్ల పంపిణీ.. అవును ఏపీలో ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యాలు ఇవి. భారీ వర్షంలోనూ ఏపీలో ఫించన్ల పంపిణీ కొనసాగుతోంది. ఆదివారం సెలవు కావడంతో.. శనివారం ఫించన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వర్షంలోనూ పంపిణీ చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202403:56 AM IST

Andhra Pradesh News Live: AP Rains: అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దు.. ఏపీ ప్రభుత్వం హెచ్చరిక

  • AP Rains: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఏపీ ప్రజలను వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కారు అలెర్ట్ అయ్యింది. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించింది. ముఖ్యంగా గుంటూరు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202403:12 AM IST

Andhra Pradesh News Live: Gudlavalleru Engg College Case : లేడీస్ హాస్టల్లో రహస్య కెమెరాల ఘటన..! కేసులోని ముఖ్యమైన విషయాలివే

  • గుడ్లవల్లేరులోని బాలికల వసతి గృహంలో రహస్య కెమెరాలు పెట్టారన్న ఘటన సంచలనంగా మారింది. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగటంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ పూర్తి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు నిరసన కొనసాగింది. 

పూర్తి స్టోరీ చదవండి