LIVE UPDATES
Andhra Pradesh News Live August 30, 2024: Lokesh Wishes to NBK: ‘బాల మామయ్యా...సరిలేరు నీకెవ్వరయ్యా..’ - నారా లోకేశ్ విషెష్
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 30 Aug 202402:32 PM IST
Andhra Pradesh News Live: Lokesh Wishes to NBK: ‘బాల మామయ్యా...సరిలేరు నీకెవ్వరయ్యా..’ - నారా లోకేశ్ విషెష్
- ఇవాళ్టితో హీరో బాలకృష్ణ నట ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖులతో పాటు అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. ఇదే క్రమంలో ఆయన మేనల్లుడు, మంత్రి నారా లోకేశ్ కూడా ట్వీట్ చేశారు. ‘బాల మామయ్యా..సరిలేరు నీకెవ్వరయ్యా!’ అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు.
Fri, 30 Aug 202412:59 PM IST
Andhra Pradesh News Live: AP TG Weather Updates : వాయుగుండంగా మారనున్న అల్పపీడనం - 4 రోజులు అతి భారీ వర్షాలు..! IMD ‘ఆరెంజ్’ హెచ్చరికలు
- ఏపీ, తెలంగాణకు ఐఎండీ భారీ వర్ష సూచన ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. కోస్తా తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నాని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Fri, 30 Aug 202412:05 PM IST
Andhra Pradesh News Live: YS Jagan On CBN : 'చంద్రబాబు గారు ఇకనైనా మేల్కోండి'... విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి - వైఎస్ జగన్
- చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమల్లో ప్రభుత్వంలోని పెద్దలు మునిగిపోయారని ఆరోపించారు.
Fri, 30 Aug 202411:02 AM IST
Andhra Pradesh News Live: YSR Name: కొత్త మెడికల్ కాలేజీలకు వైఎస్ఆర్ పేరు తొలగింపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- YSR Name: రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలకు ఉన్న వైఎస్ఆర్ పేరును రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దిశ పోలీస్ స్టేషన్లను కూడా మహిళా పోలీస్ స్టేషన్లగా పేరు మార్చుతూ.. కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Fri, 30 Aug 202410:32 AM IST
Andhra Pradesh News Live: Tirumala Laddu : శ్రీవారి లడ్డూల జారీలో మార్పులు - TTD తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి
- తిరుమలలో లడ్డూ ప్రసాదం పంపిణీపై విధించిన ఆంక్షలపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. దళారుల బెడదను లేకుండా చేయడమే లక్ష్యంగా కొన్ని మార్పులు చేసినట్లు పేర్కొంది. అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఓ ప్రకటనలో కోరింది. కొన్ని మార్పులు చేసినట్లు వెల్లడించింది.
Fri, 30 Aug 202408:42 AM IST
Andhra Pradesh News Live: Sharmila Warning: ఆడపిల్లల బాత్ రూముల్లో రహస్య కెమెరాలపై షర్మిల ఆగ్రహం.. వ్యక్తిగత గొడవలేనంటోన్న పోలీసులు
- Sharmila Warning: ఆడపిల్లల బాత్ రూముల్లో రహస్య కెమెరాలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోవైపు ఈ వివాదానికి వ్యక్తిగత గొడవలే కారణమని పోలీసులు చెబుతున్నారు.విద్యార్థుల మధ్య నెలకొన్న వ్యక్తిగత వివాదాలతోనే రహస్య కెమెరాల ప్రచారం జరిగిందని ప్రచారం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
Fri, 30 Aug 202408:17 AM IST
Andhra Pradesh News Live: Ycp Mlcs: వైసీపీలో కొనసాగుతున్న దుమారం, పార్టీని వీడనున్న మరో ఇద్దరు ఎమ్మెల్సీలు
- Ycp Mlcs: వైసీపీలో తలెత్తిన రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. అధికారానికి దూరమైన పార్టీని వీడేందుకు ఆ పార్టీ నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎంపీలు మోపిదేవి, బీద మస్తానరావు పార్టీని వీడగా తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీకి, పదవులకు కూడా రాజీనామా చేయనున్నారు.
Fri, 30 Aug 202408:16 AM IST
Andhra Pradesh News Live: AP Employees Transfers : ఏపీలో ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపు - మరో 15 రోజులు ఛాన్స్
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కోసం మరో 15 రోజుల గడువు పొడిగించింది. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది.
Fri, 30 Aug 202407:19 AM IST
Andhra Pradesh News Live: Nagarjuna Sagar Water: నాగార్జున సాగర్ నిండా నీరున్నా, సాగు నీటి కోసం రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు?
- Nagarjuna Sagar Water: నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నెల రోజులుగా ఇప్పటికే వందలాది టీఎంసీల నీరు దిగువ కృష్ణాలోకి వెళుతోంది.ఈ నెల 2వ తేదీన ఎడమ కాల్వకు సాగునీటిని విడుదల చేశారు.మేజర్లు, డిస్టిబ్యూటరీలకు నీటి విడుదల షెడ్యూలును ప్రకటించలేదు.ప్రధాన కాల్వల్లో మినహా ఆయకట్టు చివరి భూములకు నీరందడం లేదు.
Fri, 30 Aug 202407:17 AM IST
Andhra Pradesh News Live: Tirupati: తిరుపతి జిల్లాలో మట్టి మాఫియా.. యథేచ్ఛగా తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు
- Tirupati: తిరుపతి జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అడ్డూఅదుపు లేకపోవడంతో అక్రమార్కులు కొండలను మింగేస్తున్నారు. రాత్రి, పగలూ లారీలు, ట్రాక్టర్లలో మట్టిని తరలించి కాసులు దండుకుంటున్నారు. వీరివైపు అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి.
Fri, 30 Aug 202406:38 AM IST
Andhra Pradesh News Live: Amaravati Works: విజయవాడ మెట్రో ప్రాజెక్టు పనుల్లో కదలిక.. జనవరి నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం
- Amaravati Works: జనవరి ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణ పనులు. అమరావతి పనులకు సంబంధించి ప్రస్తుతం అధ్యయనం జరుగుతుందన్నారు మంత్రి పొంగూరు నారాయణ.అన్ని పనులకు టెండర్లు పిలిచి జనవరి ఒకటో తేదీ నుంచి నిర్మాణ పనులు ప్రారంభించేలా ముందుకెళ్లున్నట్లు స్పష్టం చేసారు.
Fri, 30 Aug 202405:52 AM IST
Andhra Pradesh News Live: Gudlavalleru Engg College: గుడ్లవల్లేరులో ఘోరం..! ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో రహస్య కెమెరాలు, అసలు ఏం జరిగిందంటే..
- Gudlavalleru Engg College: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వ్యవహారంలో విస్తుబోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి.గురువారం రాత్రి విద్యార్ధినుల ఆందోళనతో వెలుగు చూసిన రహస్య కెమెరాల వ్యవహారంలో కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టమైంది.వారం క్రితమే వెలుగు చూసినా తొక్కిపెట్టారు.
Fri, 30 Aug 202404:11 AM IST
Andhra Pradesh News Live: Pocso Judgement: బాలుడిపై హత్యాచారం చేసిన ఆర్మీ ఉద్యోగికి యావజ్జీవ ఖైదు విధించిన ప్రకాశం జిల్లా కోర్టు
- Pocso Judgement: బాలుడిపై అత్యాచారానికి పాల్పడి నేరం బయటపడకుండా చిన్నారిని గొంతు నులిమి హత్య చేసిన ఆర్మీ జవానుకు న్యాయస్థానం కఠిన శిక్షను ఖారు చేసింది. నిందితుడి హేయమైన నేరానికి యావజ్జీవ కారాగారవాసంతో పాటు రూ.50వేలు జరిమానా విధిస్తూ ప్రకాశం జిల్లా పోక్సో కోర్టు తీర్పునిచ్చింది.
Fri, 30 Aug 202403:44 AM IST
Andhra Pradesh News Live: AP Rains Update: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
- AP Rains Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింతగా బలపడుతోంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపు,ఎల్లుండి అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయి.
Fri, 30 Aug 202402:10 AM IST
Andhra Pradesh News Live: Hidden Cameras In Hostel: ఇంజనీరింగ్ కాలేజీ వాష్‌రూమ్‌ల్లో సీక్రెట్ కెమెరాలు? గుడ్లవల్లేరులో అర్థరాత్రి ఉద్రిక్తత
- Hidden Cameras In Hostel: కృష్ణా జిల్లాలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటైన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అర్థరాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్ వాష్‌రూమ్‌ల్లో సీక్రెట్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Fri, 30 Aug 202401:55 AM IST
Andhra Pradesh News Live: YSRCP: రాజ్యసభలో వైసీపీ బలం నిలుస్తుందా.. మోపిదేవి, బీద మస్తాన్‌రావు బాటలో మరో ఆరుగురు!
- YSRCP: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు రాజ్యసభలో టీడీపీని ఖాళీ చేశామని చెప్పిన వైసీపీ.. ఇప్పుడు తనకున్న సభ్యులను కాపాడుకోవడానికి కష్టాలు ఎదుర్కొవాల్సి వస్తోంది. అయినా.. ఎంత మంది మిగులుతారనేది ప్రశ్నగానే మిగిలి ఉంది.
Fri, 30 Aug 202412:33 AM IST
Andhra Pradesh News Live: Ysrcp MPs: వైసీపీని వీడనున్నమరికొందరు రాజ్యసభ సభ్యులు? నాడు నేడు జగన్ చేసిన ఆ ప్రకటనలే కొంపముంచాయా?
- Ysrcp MPs: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కూడా వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలే ఎన్డీఏ కూటమి నేతలు అప్రమత్తం అయ్యేలా చేశాయి. లోక్‌సభలో సంఖ్యాబలం తగ్గినా రాజ్యసభలో తమ మీదే బీజేపీ ఆధారపడాలంటూ జగన్ అండ్ కో చేసిన వ్యాఖ్యలే వైసీపీ సభ్యులు రాజీనామాలు చేయడానికి కారణమయ్యాయయనే వాదన వినిపిస్తోంది.