LIVE UPDATES
Andhra Pradesh News Live August 29, 2024: YSRCP MPs : ఇద్దరు వైసీపీ ఎంపీల రాజీనామా - వెంటనే ఆమోదించిన రాజ్యసభ ఛైర్మన్
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 29 Aug 202401:48 PM IST
Andhra Pradesh News Live: YSRCP MPs : ఇద్దరు వైసీపీ ఎంపీల రాజీనామా - వెంటనే ఆమోదించిన రాజ్యసభ ఛైర్మన్
- రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్ కు రాజీనామా పత్రాలను సమర్పించారు. వీరి రాజీనామా లేఖలను రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించినట్లు ప్రకటన వెలువడింది.
Thu, 29 Aug 202401:31 PM IST
Andhra Pradesh News Live: AP Employees : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు బ్రేక్ - త్వరలో కొత్త షెడ్యూల్
- రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు బ్రేక్ పడింది. కౌన్సెలింగ్ కు త్వరలోనే కొత్త షెడ్యూల్ విడుదల కానుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. పెన్షన్ల పంపిణీ సమయం దగ్గరపడిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Thu, 29 Aug 202412:21 PM IST
Andhra Pradesh News Live: Vijayawada Police : ముంబై నటి ఇష్యూ...! దర్యాప్తునకు స్పెషల్ పోలీస్ టీమ్
- ముంబై సినీ నటి కాదంబరీ జత్వానీకి వేధింపుల వ్యవహారంపై ఏపీ సర్కార్ స్పందించింది. ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ఏసీపీ స్రవంతి రాయ్ ని ప్రత్యేకంగా అధికారిణిగా నియమించింది. ఈ మేరకు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు ఉత్తర్వులను జారీ చేశారు.
Thu, 29 Aug 202411:59 AM IST
Andhra Pradesh News Live: ఏపీలోనూ 'హైడ్రా' తరహా సంస్థ...! ప్రభుత్వం సిద్ధమవుతోందా..?
- తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై కొరడా ఝులిపిస్తోన్న ‘హైడ్రా’ దేశంలోనే సంచలనంగా మారింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లోనూ అక్రమ నిర్మాణాలపై సర్కార్ ఫోకస్ పెట్టే ఆలోచనలో ఉంది. తెలంగాణ తరహాలోనే ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.
Thu, 29 Aug 202410:41 AM IST
Andhra Pradesh News Live: Agricultural courses: పీజీ అగ్రి కోర్సుల్లో ఎన్ఆర్ఐ కోటా సీట్లకు నోటిఫికేషన్.. దరఖాస్తుకు ఆగస్టు 31 ఆఖరు తేదీ
- Agricultural courses: వ్యవసాయ కోర్సుల్లో ఎన్ఆర్ఐ కోటా సీట్లకు సంబంధించి.. ఏఎన్‌జీఆర్‌ఏయూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అప్లికేషన్ ఫీజు రూ.1500 ఉంటుందని అధికారులు వెల్లడించారు.
Thu, 29 Aug 202410:15 AM IST
Andhra Pradesh News Live: Tirumala Laddu : తిరుమల శ్రీవారి భక్తులకు షాక్ - లడ్డూల జారీపై ఆంక్షలు, ఆధార్ ఉండాల్సిందే..!
- తిరుమల శ్రీవారి లడ్డూ జారీ విధానంలో మార్పులు వచ్చాయి. ఆధార్ కార్డు ఉంటేనే లడ్డూ ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ఓ భక్తుడికి ఒక లడ్డూ మాత్రమే ఇచ్చేలా చర్యలు చేపట్టింది. దర్శన టికెట్ పై ఒక్క లడ్డూను మాత్రమే ఇస్తోంది. అదనపు లడ్డూలు కావాలంటే ఆధార్ చూపించాల్సి ఉంటుంది.
Thu, 29 Aug 202409:20 AM IST
Andhra Pradesh News Live: Nuzvid IIIT: విద్యార్థులకు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి.. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది?
- Nuzvid IIIT: నూజివీడు ట్రిపుల్ ఐటీ.. ఏపీలో మంచి పేరున్న విద్యా సంస్థ. కానీ.. ఇప్పుడు నూజివీడు ట్రిపుల్ ఐటీ అంటే భయపడే పరిస్థితి నెలకొంది. వందలాది మంది విద్యార్థులు ఒకేసారి అస్వస్థతకు గురయ్యారు. అందుకు కారణాలు తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు షాక్ అవుతున్నారు.
Thu, 29 Aug 202408:58 AM IST
Andhra Pradesh News Live: Special Funds: మూడు జిల్లాల్లోకేంద్ర ప్రభుత్వ ప్రత్యేక నిధుల వినియోగం, బిల్లుల చెల్లింపుపై బిల్డర్స్ అసోసియేషన్ వివరణ
- Special Funds: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ జిల్లాల్లో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జరగడంపై రాజకీయంగా దుమారం రేగింది. కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో చేసిన పనులకు బిల్లులు చెల్లించడంపై బిల్డర్స్ అసోసియేషన్ వివరణ ఇచ్చింది.
Thu, 29 Aug 202408:57 AM IST
Andhra Pradesh News Live: Private FM channels: ఏపీలో 68, తెలంగాణలో 31.. కేంద్ర మంత్రివర్గం ఆమోదం
- Private FM channels: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఎఫ్ఎం ఛానల్స్ మూడో బ్యాచ్ కింద ఈ వేలం వేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో మూడో దశ పాలసీ కింద ఈ నిర్ణయం తీసుకున్నారు.
Thu, 29 Aug 202408:25 AM IST
Andhra Pradesh News Live: Nandamuri Harikrishna: ఎన్టీఆర్ భవన్‌లో నందమూరి హరికృష్ణకు టీడీపీ నేతల నివాళులు
- Nandamuri Harikrishna: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ ఆరో వర్ధంతిని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించినపుడు ఉమ్మడి ఏపీలో చైతన్యరథంపై చేసిన యాత్రకు హరికృష్ణ సారథిగా వ్యవహరించారని టీడీపీ నేతలు గుర్తు చేసుకున్నారు.
Thu, 29 Aug 202408:01 AM IST
Andhra Pradesh News Live: AP Goir Website: తెరుచుకున్న ఏపీ ప్రభుత్వ జీవోల వెబ్‌సైట్ Goir, అందుబాటులోకి జీవోలు
- AP Goir Website: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవోల వెబ్‌సైట్ ఎట్టకేలకు తెరుచుకుంది మూడేళ్లకు పైగా ప్రజలకు అధికారిక సమాచారం అందకుండా గోప్యత పాటించిన జీవో ఐఆర్ వెబ్‌సైట్‌ను ఏపీ ప్రభుత్వం గురువారం అందుబాటులోకి తీసుకువచ్చింది.
Thu, 29 Aug 202407:09 AM IST
Andhra Pradesh News Live: Online Grievance: ఏఐ వాడే రాష్ట్రంలో ఆన్‌లైన్ కంప్లైంట్స్ తీసుకోరు…! ప్రజా ఫిర్యాదుల్లో అంతులేని జాప్యం
- Online Grievance: పాలనా వ్యవహారాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పుకుంటుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదుల్ని స్వీకరించే విషయంలో మాత్రం ఆన్‌లైన్ వ్యవస్థల్ని అందుబాటులోకి తీసుకురాకపోడంతో ఎక్కడెక్కడి నుంచో విజయవాడకు వస్తున్నారు.
Thu, 29 Aug 202405:37 AM IST
Andhra Pradesh News Live: Fate Of Ysrcp: పార్టీని వీడుతున్నవైసీపీ ముఖ్య నేతలు, పట్టించుకోని జగన్.. వెళ్లే వారిని వదిలేయాలని ఆదేశం
- Fate Of Ysrcp: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీని వీడేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. అధికారం లేని చోట ఉండటం కంటే, అధికార పార్టీలో చేరిపోవడం సురక్షితం అనుకుంటున్నారు. కార్పొరేటర్లు మొదలుకుని ఎంపీల వరకు ఇదే బాటలో ఉన్నారు.వైసీపీ అధ్యక్షుడు మాత్రం వెళ్లే వారిని పట్టించుకోవట్లేదు.
Thu, 29 Aug 202404:43 AM IST
Andhra Pradesh News Live: AP Weather Updates: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన, కృష్ణా బేసిన్‌లో కొనసాగుతున్న వరద
- AP Weather Updates: బంగాళాఖాతంలో గురువారం ఏర్పడే అల్పపీడనంతో ఉత్తరకోస్తాకు భారీ వర్ష సూచన ఉందని విశాఖపట్నం వాదావరణ కేంద్రం ప్రకటించింది. అల్పపీడనంతో కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. రానున్న మూడ్రోజుల్లో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Thu, 29 Aug 202401:32 AM IST
Andhra Pradesh News Live: NTR Bharosa Pensions: ఆగస్టు 31 శనివారమే ఏపీలో సామాజిక పెన్షన్ల పంపిణీ.. ఆదివారం సెలవు కావడంతోనే..
- NTR Bharosa Pensions:ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక పెన్షన్లు ఆగస్టు 31నే లబ్దిదారులకు అందించనున్నారు. సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందే పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. శనివారం పెన్షన్ల పంపిణీ కోసం అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సీఎస్ గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని ఆదేశించారు.
Thu, 29 Aug 202412:34 AM IST
Andhra Pradesh News Live: Endowment Appintments: ఇంద్రకీలాద్రి అమ్మవారి సన్నిధిలో అక్రమాలు, అనర్హులకు అడ్డదారిలో అందలం, అడ్డగోలు నియామకాలు...
- Endowment Appintments: ఓ వైపు ముఖ్యమంత్రి దేవాదాయ శాఖను గాడిన పెట్టాలని, అన్యమత ప్రచారాన్ని కట్టడి చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే బెజవాడ దుర్గగుడిలో అందుకు భిన్నమైన తీరులో సాగుతోంది. అడ్డదారిలో ఉద్యోగాలను క్రమబద్దీకరించి ఉన్నత పదవుల్ని కట్టబెట్టే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.