LIVE UPDATES
Andhra Pradesh News Live August 27, 2024: Santoor Scholarship 2024 : విద్యార్థినులకు గుడ్ న్యూస్-సంతూర్ స్కాలర్ షిప్ నకు దరఖాస్తులు ఆహ్వానం, ఇలా అప్లై చేసుకోండి
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 27 Aug 202411:26 AM IST
Andhra Pradesh News Live: Santoor Scholarship 2024 : విద్యార్థినులకు గుడ్ న్యూస్-సంతూర్ స్కాలర్ షిప్ నకు దరఖాస్తులు ఆహ్వానం, ఇలా అప్లై చేసుకోండి
- Santoor Scholarship 2024 : ఉన్నత విద్య కోర్సులు చదువుతున్న గ్రామీణ పేద విద్యార్థినులకు విప్రో సంస్థ సంతూర్ ఉమెన్ స్కాలర్ షిప్ 2024 అందిస్తుంది. నెలకు రూ.2 వేలు చొప్పున ఏడాదికి రూ.24 వేలు ఆర్థిక సాయం అందిస్తారు. స్కాలర్ షిప్ కోసం విద్యార్థినులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
Tue, 27 Aug 202410:34 AM IST
Andhra Pradesh News Live: AP Power Charges: ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచినా డిస్కంలకు ఒరిగిందేమి లేదన్న గొట్టిపాటి
- AP Power Charges: డిస్కంల పేరు చెప్పి జగన్ విద్యుత్ చార్జీలు పెంచినా.. డిస్కంలకు ఒరిగింది ఏమీ లేదని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. అంతేగాకుండా వైసీపీ హయాంలో అప్పులు 79 శాతం పెరిగినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం అప్పు తెస్తే కానీ నడపలేని స్థితిలో డిస్కంలు ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు.
Tue, 27 Aug 202410:25 AM IST
Andhra Pradesh News Live: AP Constable Recruitment: ఏడాదిన్నరగా ఎదురు చూపులు, కానిస్టేబుల్ నియామకాల్లో కదలిక! త్వరలో ఫిజికల్ పరీక్షలు
- AP Constable Recruitment: ఆంధప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కానిస్టేబుల్ నియామకాల్లో కదలిక వచ్చింది. అడ్డంకులు తొలగించుకుని వీలైనంత త్వరలో రాతపరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షల్ని నిర్వహించేందుకు ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సిద్ధమవుతోంది.
Tue, 27 Aug 202409:47 AM IST
Andhra Pradesh News Live: Kakinada Gurukulam: గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 30 మంది బాలికలకు అస్వస్థత, ప్రభుత్వాస్పత్రిలో చికిత్స
- Kakinada Gurukulam: కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 30మంది బాలికలు హాస్టల్లో అందించిన ఆహారం తిని అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు, విరోచనాలతో బాధపడ్డారు. విద్యార్థుల్ని హుటాహుటిన కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Tue, 27 Aug 202409:37 AM IST
Andhra Pradesh News Live: APUTF On UPS : ఓపీఎస్ తప్ప మరే పెన్షన్ స్కీమ్ అంగీకరించం, యూపీఎస్ పై ఈ నెల 30న ఉద్యోగుల ఆందోళన
- APUTF On UPS : ఓపీఎస్ తప్ప మరే పెన్షన్ పథకాన్ని అంగీకరించమని యూటీఎఫ్ ఉద్యోగులు తెలిపారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన యూపీఎస్ కు వ్యతిరేకంగా ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Tue, 27 Aug 202409:01 AM IST
Andhra Pradesh News Live: Sachivalaya Employees : గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రక్షాళన- ఉద్యోగుల కుదింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం!
- Sachivalaya Employees : గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ శాఖలో అదనపు ఉద్యోగులను ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంజినీరింగ్ అసిస్టెంట్లను ఇరిగేషన్ శాఖలో ఏఈలుగా సర్దుబాటు చేయనుంది.
Tue, 27 Aug 202407:44 AM IST
Andhra Pradesh News Live: Domestic Violence: అదనపు కట్నం కోసం వేధింపులు.. ఏప్రిల్‌లో పెళ్లి.. ఆగస్టులో సూసైడ్
- Domestic Violence: పెళ్లైన నెల రోజుల నుంచే అదనపు కట్నం కోసం వేధింపులు పెరిగాయి. దీంతో వివాహం జరిగిన నాలుగు నెలలకే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వివాహిత ఇంట్లో విషాదం నింపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tue, 27 Aug 202407:03 AM IST
Andhra Pradesh News Live: YSRCP: ఏలూరులో వైసీపీ ఖాళీ.. మొన్న ఆళ్ల నాని.. ఇప్పుడు మేయర్
- YSRCP: వైసీపీకి మరో బిగ్ షాక్ తగలబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ప్రభావంతో.. ఆ పార్టీకి వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా.. ఏలూరు నగర మేయర్ నూర్జహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు.
Tue, 27 Aug 202406:58 AM IST
Andhra Pradesh News Live: Kadapa Mayor vs Mla: మేయర్ ఇంటి ముందు చెత్త పోసిన టీడీపీ నేతలు, చెత్తపన్నుపై టీడీపీ, వైసీపీ మధ్య రగడ
- Kadapa Mayor: కడపలో చెత్త సేకరణ అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మునిసిపల్ సిబ్బంది చెత్త సేకరణ చేయడం లేదని ఆరోపిస్తూ టీడీపీ శ్రేణులు మేయర్ నివాసాన్ని ముట్టడించి తమ ఇళ్లలోని చెత్తను మేయర్ ఇంటి ముందు పారబోశారు. దీంతో ఎమ్మెల్యే మాధవి రెడ్డికి వ్యతిరేకంగా మేయర్ సురేష్‌బాబు వర్గం ఆందోళనకు దిగింది.
Tue, 27 Aug 202406:12 AM IST
Andhra Pradesh News Live: Kadapa: కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొన్న కంటైనర్.. ఐదుగురు మృతి
- Kadapa: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును కంటైనర్ బలంగా ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు.. కంటైనర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో పోలీసులు కేసు నమోదు చేసి.. విచారణ జరుపుతున్నారు.
Tue, 27 Aug 202406:02 AM IST
Andhra Pradesh News Live: AP Capital Issue: ఆంధ్రప్రదేశ్..అమరావతి, వివాదానికి ముగింపు ఎప్పుడు? అమరావతిపై కీలకం కానున్న బీజేపీ వైఖరి…
- AP Capital Issue: దేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటులో ఏ రాష్ట్రానికి తలెత్తని సమస్య ఆంధ్రప్రదేశ్‌కు ఎదురైంది. కొత్త రాష్ట్రాల ఏర్పాటులో రాజధాని ఎంపిక అధికారం అయా రాష్ట్రాలకే దక్కింది. రాజధాని నగరాల విషయంలో ఏ రాష్ట్రానికి తలెత్తని సంక్లిష్టమైన సమస్యను ఏపీలో ఎలా అధిగమిస్తారనేది ఆసక్తిగా మారింది.
Tue, 27 Aug 202402:57 AM IST
Andhra Pradesh News Live: Tirumala: 31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. కొండపై అందుబాటులో రూములు
- Tirumala: తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. మొత్తం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు రూ.50, రూ.100 రూములు అందుబాటులో ఉన్నాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Tue, 27 Aug 202401:58 AM IST
Andhra Pradesh News Live: Sexual Assault: మహిళపై లైంగిక దాడి.. సెటిల్మెంట్ చేస్తానన్న పోలీస్.. అంతలోనే ట్విస్ట్!
- Sexual Assault: బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు.. కాసులకు కక్కుర్తి పడుతున్నారు. ఫలితంగా నేరాలు చేసిన వారు దర్జాగా తిరుగుతుంటే.. బాధితులు మరింత కుంగిపోతున్నారు. తాజాగా.. ఓ లైంగిక దాడి కేసులో పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు విస్మయానికి గురి చేస్తోంది.
Tue, 27 Aug 202412:12 AM IST
Andhra Pradesh News Live: Vijayawada: బిర్యానీ విషయంలో గొడవ.. అన్నను చంపిన తమ్ముడు
- Vijayawada: విజయవాడలో దారుణ ఘటన జరిగింది. బిర్యానీ కోసం జరిగిన గొడవ ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. వంద రూపాయలు పెడితే వచ్చే బిర్యానీ కోసం.. రక్తం పంచుకు పుట్టిన అన్నయ్యనే చంపేశాడు ఓ తమ్ముడు. ఈ ఘటన విజయవాడలో సంచలనంగా మారింది.
Tue, 27 Aug 202411:32 PM IST
Andhra Pradesh News Live: AP Politics: వైసీపీ నేతలకు ఏమైంది.. జగన్ మౌనంగా ఎందుకు ఉంటున్నారు..?
- AP Politics: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైంది. ఓటమికి కారణాలు ఏమైనా.. లీడర్లు, కేడర్ మాత్రం తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే.. కేడర్‌ను నిరాశ నుంచి బయటకు తీసుకురావడానికి జగన్ శ్రమిస్తుంటే.. కొందరు వైసీపీ లీడర్లు మాత్రం పార్టీ పరువు తీసేలా వ్యవహరిస్తున్నారు.