LIVE UPDATES
Andhra Pradesh News Live August 22, 2024: AP AGRICET 2024 Hall Ticket : ‘ఏపీ అగ్రిసెట్ ’ హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 22 Aug 202402:08 PM IST
Andhra Pradesh News Live: AP AGRICET 2024 Hall Ticket : ‘ఏపీ అగ్రిసెట్ ’ హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- AP AGRICET 2024 Hall Ticket : బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులకు నిర్వహించే ఏపీ అగ్రిసెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://angrauagricet.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 27వ తేదీన ప్రవేశ పరీక్ష జరగనుంది.
Thu, 22 Aug 202401:27 PM IST
Andhra Pradesh News Live: Tirumala : అక్టోబరు 3 నుంచి తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు - టీటీడీ ప్రకటన
- తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ ఇచ్చింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు రకాల ప్రత్యేక ద్రర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబరు 3 నుంచి 12వ తేదీ వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఓ ప్రకటనలో కోరింది.
Thu, 22 Aug 202411:59 AM IST
Andhra Pradesh News Live: YSRCP: ప్రస్తుతం మీ అవసరం పార్టీకి ఎంతో ఉంది: వైఎస్ జగన్
- YSRCP: అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ చీఫ్ జగన్ వివిధ వర్గాలతో వరుసు సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా.. పార్టీకి సపోర్ట్ చేసే లాయర్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో న్యాయం, ధర్మం లేకుండా పోయిందని ఆరోపించారు. ఈ సమయంలో లాయర్లు పార్టీకి సపోర్ట్‌గా ఉండాలని సూచించారు.
Thu, 22 Aug 202411:40 AM IST
Andhra Pradesh News Live: Vijayawada Politics : విజయవాడలో మారుతున్న లెక్కలు..! టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు
- విజయవాడలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. వైసీపీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరంతా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లుగా ఉన్నారు.
Thu, 22 Aug 202411:14 AM IST
Andhra Pradesh News Live: MLC Botcha LOP : అదృష్టమంటే బొత్సదే..! మండలిలో ప్రతిపక్ష నేతగా అవకాశం, వైఎస్ జగన్ నిర్ణయం
- ఇటీవలే ఎమ్మెల్సీగా విజయం సాధించిన బొత్సకు ఆ పార్టీ అధినేత జగన్ మరో అవకాశం కల్పించారు. శాసనమండలిలో ప్రతిపక్షనేతగా ఆయన్ను నియమించారు. ఈ మేరకు శాసనమండలి సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
Thu, 22 Aug 202408:30 AM IST
Andhra Pradesh News Live: Deputy CM Pawan : సెఫ్టీ అడిట్ అంటే పరిశ్రమలు మూసివేస్తారనే భయం ఉంది - పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రమాదం చాలా బాధాకరమన్నారు. అచ్యుతాపురం ప్రమాదం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖ కిందకు రాదన్నారు. అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేయాలని మొదట్లోనే చెప్పాననని.. అలా చేస్తే పరిశ్రమలు మూసేస్తారనే భయం యజమానులలో ఉందని వ్యాఖ్యానించారు.
Thu, 22 Aug 202408:04 AM IST
Andhra Pradesh News Live: Attack on TDP Office: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం.. 85 మంది వైసీపీ నేతలకు నోటీసులు
- Attack on TDP Office: ఆంధ్రా రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. 85 మంది వైఎస్సార్సీపీ నేతలకు మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ ఇష్యూ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వీరికి నోటీసులు ఇచ్చారు. కొంత మంది కీలక నేతలపై ఫోకస్ పెట్టారు.
Thu, 22 Aug 202408:03 AM IST
Andhra Pradesh News Live: Trains Info: 13రైళ్ల దారి మళ్లింపు, రెండు రైళ్లు షార్ట్ టెర్మినేషన్, రెండు రైళ్ల రీ షెడ్యూల్
- Trains Info: విజయవాడ డివిజన్, వాల్తేర్ డివిజన్‌లో వివిధ భద్రతా పనుల కారణంగా మొత్తం 13 రైళ్లు దారి మళ్లిస్తున్నారు. అలాగే అదనపు రద్దీని తగ్గించేందుకు నాలుగు ప్రత్యేక రైళ్లు నడుపుతారు. రెండు రైళ్లు షార్ట్ టెర్మినెట్, రెండు రైళ్లు రీషెడ్యూల్ చేస్తున్నారు.