1.ఇవాళ విశాఖపట్నం వేదికగా.. ఢిల్లీ వర్సెస్ లక్నో ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
2.తెలంగాణలో ద్రోణి బలహీనపడింది. దీంతో తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. నేడు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గనున్నాయి.
3.ఇవాళ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. అకాల వర్షాలు, పంటనష్టంపై చర్చించనున్నారు. తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు ఇవ్వనున్నారు.
4.విశాఖ బీచ్‌కు బ్లూఫ్లాగ్ పునరుద్ధరణపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ మంత్రి కందుల దుర్గేష్ రుషికొండ వెళ్లనున్నారు. బ్లూఫ్లాగ్‌ను ఆవిష్కరించనున్నారు.
5.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పులివెందులలో పర్యటించనున్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో భేటీ కానున్నారు.
6.నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. శాసనసభలో బడ్జెట్ పద్దులపై రెండో రోజు చర్చ జరగనుంది. శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. రెండు బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు.
7.నేడు యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరుకానున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఆమెను పోలీసులు ప్రశ్నించనున్నారు.
8.నేడు ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
9.తెలంగాణలో ఇవాళ రాజీవ్ యువ వికాసం పథకపై నిబంధనలను ప్రభుత్వం జారీ చేయనుంది. ఇవాళ ఈ పథకంపై పూర్తిస్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
10.ఇవాళ అమరావతి ప్రజలతో సీఆర్డీఏ అధికారులు సమావేశం కానున్నారు.
1.ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 31వ రోజుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గల్లంతైన వారి మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.