Tirupati Stampede : వైకుంఠ ద్వార దర్శన టోకెట్లకు పోటెత్తిన భక్తులు-తిరుపతి కౌంటర్ల తొక్కిసలాట, ఆరుగురు మృతి
Tirupati Stampede : తిరుపతిలో విషాద ఘటన చోటుచేసుకుంది. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో అపశ్రుతి చోటుచేసుకుంది. తిరుపతిలోని కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు.
Tirupati Stampede : తిరుపతిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో అపశ్రుతి చోటుచేసుకుంది. శ్రీనివాసం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో… తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మృతి చెందిన ఓ మహిళా భక్తురాలిది తమిళనాడులోని సేలంగా గుర్తించారు.
వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీకి ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగింది. సుమారు 25 మందికి అస్వస్థత గురయ్యారు. వీరిని హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే ఆరుగురు మృతి చెందినట్లు రుయా ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు.
తిరుపతిలో తొక్కిసలాట
తిరుపతిలోని శ్రీనివాసం వద్ద వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు రావడంతో తోపులాట జరిగింది. ఈక్రమంలో తమిళనాడుకు చెందిన ఓ భక్తురాలు మృతి చెందింది. ఈ ఘటనలో మరో 25 మందికి పైగా భక్తులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...మరో ముగ్గురు మృతి చెందారు. ఘటనా స్థలిని టీటీడీ ఈవో జె.శ్యామలరావు పరిశీలించారు.
వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు జారీ చేసేందుకు...తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, సత్యనారాయణపురం, బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్ వద్ద టికెట్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో భక్తుల రావడంతో తోపులాట జరిగింది. గురువారం ఉదయం 5 గంటల నుంచి తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్లలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. దీంతో టోకెన్ల కోసం ఇవాళ సాయంత్రం నుంచే భక్తులు క్యూకట్టారు. క్యూలైన్లలోకి భక్తులను ఒక్కసారిగా వదలడంతో తోపులాట జరిగింది. తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు. గాయపడిన వారిన సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఘటనాస్థలికి విజిలెన్స్, పోలీసు బలగాలు చేరుకున్నాయి.
ఈ నెల 10, 11,12 తేదీల్లో తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి... మొదటి మూడు రోజులకు 1.20 లక్షల టోకెన్లను గురువారం ఉదయం జారీ చేయనున్నారు. మిగిలిన రోజులకు ఏ రోజుకు ఆ రోజు తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో ఇవ్వనున్నట్టు టీటీడీ ప్రకటించింది.
సంబంధిత కథనం