TTD Jr College Admissions : టీటీడీ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు, ఇలా దరఖాస్తు చేసుకోండి!
TTD Jr College Admissions : తిరుపతిలోని టీటీడీ జూనియర్ కాలేజీల్లో 2024-25 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు మే 31 చివరి తేదీ.
TTD Jr College Admissions : తిరుమల తిరుపతి దేవస్థానం జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు అప్లికేషన్లు ఆహ్వానించింది. టీటీడీ తిరుపతిలో బాలికల కోసం శ్రీ పద్మావతి జూనియర్ కాలేజీ, బాలుర కోసం శ్రీ వేంకటేశ్వర జూనియర్ కాలేజీలను నిర్వహిస్తోంది. ఈ కాలేజీల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరానికి అప్లికేషన్లు ఆహ్వానించింది. విద్యార్థులు http://admission.tirumala.org వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 31వ తేదీలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది.
శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ, సీఈసీ, సీఈఎల్,హెచ్ఈసీ కోర్సులు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో అందుబాటులో ఉన్నారు. ఈ కాలేజీలో మొత్తం 968 సీట్లు ఉన్నాయి. ముందుగా సీట్లు పొందిన 450 మందికి హాస్టల్ వసతి కల్పిస్తారు.
శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల, తిరుపతి - ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ, సీఈసీ, సీఈఎల్,హెచ్ఈసీ, హెచ్టీసీ, జీఈహెచ్ కోర్సులు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో అందుబాటులో ఉన్నాయి. మొత్తం 792 సీట్లకు ప్రవేశాలు కల్పిస్తారు. 400 హాస్టల్ సీట్లు ఉన్నాయి.
టీటీడీ జూనియర్ కళాశాలలలో ప్రవేశాలకు అర్హతలు
- ఎస్ఎస్సీ లేదా దానికి సమానమైన పరీక్షలో పాసై ఉండాలి.
- అర్హత సాధించిన విద్యార్థుల మార్కుల ఆధారంగా విద్యాశాఖ రిజర్వేషన్లు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
- పదో తరగతి పరీక్షల్లో ముందుగా పాసైన వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత కంపార్ట్మెంటల్ వారికి సీట్లు కేటాయిస్తారు.
- సొంత ఊరు నుంచి 20 కి.మీ కంటే తక్కువ దూరం కలిగిన వారికి జూ.కాలేజీ వసతి గృహాల్లో సీట్లు కేటాయించరు.
- శ్రీ పద్మావతి జూనియర్ కాలేజీలో విద్యార్థినులకు మాత్రమే సీట్లు కేటాయిస్తారు.
- శ్రీ వేంకటేశ్వర జూనియర్ కాలేజీలో బాలురు, థర్డ్ జెండర్ వారు అర్హులు. థర్డ్ జెండర్ వారికి హాస్టల్ సదుపాయం కల్పించరు.
ఫీజు వివరాలు
- సైన్స్ గ్రూపుల ఫీజు- రూ.4875
- ఆర్ట్స్ గ్రూపుల ఫీజు - రూ.3975
దరఖాస్తు విధానం
- విద్యార్థులు https://admission.tirumala.org/ వెబ్ సైట్ పై క్లిక్ చేయండి.
- హోం పేజీలో జూనియర్ కాలేజీ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- స్క్రీన్ పై ఇంగ్లిష్ లేదా తెలుగు బాక్స్ పై క్లిక్ చేసి అడ్మిషన్ల వివరాలను తెలుసుకోంది.
- చెక్ బాక్స్ పై క్లిక్ చేసి 'yes accept' పై క్లిక్ చేయండి.
- విద్యార్థి ఫొటో(100 KB), మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- మీరు ఏ గ్రూప్ లో చేరాలనుకుంటున్నారో ప్రాధాన్యత క్రమాన్ని రాసుకోండి. (కాలేజీ పేరు, గ్రూప్, మీడియం, వసతి) ఈ వివరాలు అప్లికేషన్ లో పొందుపర్చండి.
- ఆన్ లైన్ లో దరఖాస్తులను బట్టి ముందుగా విద్యార్థులకు తాత్కాలికంగా సీట్లు కేటాయిస్తారు. ఆ తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్లు వెరిఫై చేసి సీట్లు కన్ఫామ్ చేస్తారు. ఈ రెండు సార్లు వివరాలు సరిపోలకపోతే అడ్మిషన్ రద్దు చేస్తారు.
- విద్యార్థులు దరఖాస్తులో సెల్ ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఇవ్వాలి. అడ్మిషన్ ప్రక్రియ వివరాలను విద్యార్థులకు సెల్ ఫోన్ మెసేజ్, ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు.
సంబంధిత కథనం