SVU Btech Admissions : తిరుపతి ఎస్వీయూ బీటెక్ సెల్ఫ్ స‌పోర్టింగ్ సీట్లకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌, ఆగస్టు 9 ఆఖరు తేదీ-tirupati svu btech cse self admission notification released august 9th last date ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Svu Btech Admissions : తిరుపతి ఎస్వీయూ బీటెక్ సెల్ఫ్ స‌పోర్టింగ్ సీట్లకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌, ఆగస్టు 9 ఆఖరు తేదీ

SVU Btech Admissions : తిరుపతి ఎస్వీయూ బీటెక్ సెల్ఫ్ స‌పోర్టింగ్ సీట్లకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌, ఆగస్టు 9 ఆఖరు తేదీ

HT Telugu Desk HT Telugu
Aug 06, 2024 09:40 PM IST

SVU Btech Admissions : తిరుపతి ఎస్వీయూలో బీటెక్ సీఎస్ఈ సెల్ఫ్ సపోర్టింగ్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులు ఆగస్టు 9వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

తిరుపతి ఎస్వీయూ బీటెక్ సెల్ఫ్ స‌పోర్టింగ్ సీట్లకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌
తిరుపతి ఎస్వీయూ బీటెక్ సెల్ఫ్ స‌పోర్టింగ్ సీట్లకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌

SVU Btech Admissions : శ్రీ‌ వెంక‌టేశ్వర యూనివర్సిటీ (ఎస్‌వీయూ) తిరుప‌తిలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ (సీఎస్ఈ) సెల్ఫ్ స‌పోర్టింగ్ సీట్లకు నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. దర‌ఖాస్తు దాఖ‌లకు ఆగ‌స్టు 9 సాయంత్రం ఐదు గంట‌ల వ‌ర‌కు గ‌డువు విధించారు.

ఏపీ ఈఏపీసెట్‌-2024లో ర్యాంక్ పొందిన అభ్యర్థులు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిష‌న్స్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చని రిజిస్ట్రార్ ప్రొఫెస‌ర్ ఎం. భూప‌తి నాయుడు తెలిపారు. దర‌ఖాస్తు దాఖ‌లకు ఆగ‌స్టు 9 సాయంత్రం ఐదు గంట‌ల వ‌ర‌కు గ‌డువు ఉంద‌ని, ఆగ‌స్టు 12న కౌన్సిలింగ్ ఉంటుందని తెలిపారు.

అర్హత‌లు

2024-25 విద్యా సంవ‌త్సరానికి గాను బీటెక్ (సీఈసీ) సెల్ఫ్ స‌పోర్టింగ్ ప్రొగ్రామ్‌ను శ్రీ‌ వెంక‌టేశ్వర యూనివర్సిటీ (ఎస్‌వీయూ)లోని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి ఏపీ ఈఏపీసెట్‌-2024లో క్వాలిఫై అయిన ర్యాంకు ఉండాలి. ఇంట‌ర్మీడియట్ ఎంపీసీలో క‌నీసం 45 శాతం మార్కులు రావాలి. రిజ‌ర్డ్వ్ కేట‌గిరీ అభ్యర్థుల‌కు క‌నీసం 40 శాతం మార్కులు రావాలి. అభ్యర్థి 2024 డిసెంబ‌ర్ 31 నాటికి 16 ఏళ్ల వ‌య‌స్సు పూర్తి అవ్వాలి.

ఎలా అప్లై చేయాలి?

శ్రీ వెంక‌టేశ్వర యూనివర్సిటీలో డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిష‌న్స్ ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేయాలి. అప్లికేష‌న్ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని దానిని పూర్తి చేయాలి. దానికి ఏపీఈఏపీసెట్‌-2024 ర్యాంక్ కార్డు, రూ.2,500 ఫీజు బ్యాంకులో చెల్లించి దాని చలానా జ‌త‌చేయాలి. అప్లికేష‌న్ డైరెక్ట్ లింక్‌ https://svuniversity.edu.in/storage/2024/07/CSESS-APPLICATION-2024.pdf ను క్లిక్ చేస్తే, అప్లికేష‌న్ ఓపెన్ అవుతుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫీజును ది రిజిస్ట్రార్‌, ఎస్‌వీ యూనివర్సిటీ, తిరుప‌తి పేరు మీద అకౌంట్ నెంబ‌ర్ 103210100078008, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ UBIN0810321కు చ‌లానా తీయాలి.

కోర్సు...సీట్లు

కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) గ్రూప్‌లో 60 సీట్లు ఉన్నాయి. అలాగే ఈడ‌బ్ల్యూసీ కోటాలో 10 శాతం సీట్లు కేటాయించారు. అంటే ఆరు సీట్లు ఈడ‌బ్ల్యూసీ సీట్లు ఉన్నాయి. మొత్తం 66 సీట్లు ఉన్నాయి.

ఫీజులు

సెల్ఫ్ స‌పోర్టింగ్ ఫీజు ఏడాదికి రూ.1,20,000, కాలేజీ రెగ్యూల‌ర్ ఫీజు రూ.40,000 మొత్తం రూ.1,60,000 ఫీజు ఉంటుంది. సెల్ఫ్ స‌పోర్టింగ్ బ్రాంచ్‌ల్లో చేరిన అభ్యర్థికి ఫీజు రీయంబర్స్ మెంట్ వ‌ర్తించ‌దు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం