Tirupati News : వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ ఓటమి, గుండెపోటుతో అభిమాని మృతి-tirupati news in telugu cricket fan died heart attack after india lost world cup final ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirupati News : వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ ఓటమి, గుండెపోటుతో అభిమాని మృతి

Tirupati News : వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ ఓటమి, గుండెపోటుతో అభిమాని మృతి

Bandaru Satyaprasad HT Telugu
Nov 20, 2023 09:12 PM IST

Tirupati News : క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ఆస్ట్రేలియా చేతిలో భారత్ జట్టు ఓటమిపాలైంది. భారత్ ఓటమిని తట్టుకోలేక తిరుపతిలో ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందాడు.

గుండెపోటుతో క్రికెట్ అభిమాని మృతి
గుండెపోటుతో క్రికెట్ అభిమాని మృతి

Tirupati News : క్రికెట్ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ భారత్ జట్టు ఓటమిని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆదివారం రాత్రి జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ లో భారత జట్టు ఓటమిని జీర్ణించుకోలేక తిరుపతిలో ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందాడు. వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓడిపోయింది. ఈ ఓటమిని తట్టుకోలేక తిరుపతి మండలం దుర్గసముద్రానికి చెందిన జ్యోతి కుమార్ యాదవ్ గుండెపోటుతో కుప్పకూలారు. స్నేహితులు వెంటనే అతడిని తిరుపతిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే జ్యోతి కుమార్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

ఒక్కసారిగా కుప్పకూలిన అభిమాని

జ్యోతి కుమార్ యాదవ్ (35) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. దీపావళి సెలవులకు తన స్వస్థలమైన తిరుపతికి వచ్చారు. ఆదివారం భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ చూసిన జ్యోతి కుమార్ యాదవ్...ఇండియా ఓటమి చెందడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అతడిని వెంటనే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర రాంనారాయణ్‌ రుయా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జ్యోతి కుమార్ యాదవ్ మృతి పట్ల తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) చైర్మన్ మోహిత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రం గ్రామంలోని ఆయన నివాసానికి సోమవారం వెళ్లి మోహిత్ రెడ్డి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Whats_app_banner