Tiruapati VRO Uniform : యూనిఫాం ఎలుకలు కొరికేశాయన్న విఆర్వోపై సస్పెన్షన్ వేటు
Tiruapati VRO Uniform : ఎలుకలు యూనిఫాం కొరికేశాయని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన ఓ వీఆర్వో చిక్కుల్లో పడ్డాడు. యూనిఫాం లేకుండా మీటింగ్ కు హాజరవ్వడంతో సీరియస్ అయిన అధికారులు అతడ్ని సస్పెండ్ చేశారు.
Tiruapati VRO Uniform : వెనకటికి ఓ కథ ఉండేది ఎలుకలు ఇనుప త్రాసు తినేశాయని... అదే పిట్టి కథ చెప్పిన ఓ వీఆర్వో ఉద్యోగానికే ఎసరు తెచ్చుకున్నాడు. తిరుపతి కమిషనర్ హరిత... సచివాలయ ఉద్యోగులతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు వీఆర్వో ప్రసాద్... యూనిఫాం లేకుండా హాజరయ్యారు. ఎందుకు యూనిఫాం వేసుకోలేదంటే.. ఆ వీఆర్వో ఇచ్చిన సమాధానం కమీషనర్ తో సహా అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. తన యూనిఫాంను ఎలుకలు కోరికేశాయని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో వీఆర్వోపై సస్పెన్షన్ వేటు వేశారు తిరుపతి కమిషనర్.
ఎలుక తెచ్చిన తంటా!
తిరుపతి నగర కమిషనర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన హరిత... సచివాలయ ఉద్యోగులతో నగర సమస్యలపై జూమ్ మీటింగ్ ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి ఉద్యోగులందరూ హాజరయ్యారు. కానీ వీఆర్వో ప్రసాద్ యూనిఫాం లేకుండా హాజరయ్యారు. అందరూ యూనిఫాంతో వచ్చారు మీరు ఎందుకు వేసుకోలేదని కమిషనర్ హరిత ప్రశ్నించారు.
తన యూనిఫాంను ఎలుకలు కోరికేశాయని వీఆర్వో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో పాటు అతడు పనిలో వెనుకంజులో ఉండటం, నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో సీరియస్ అయిన కమిషనర్ హరిత... వీఆర్వోను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు ఈ ఘటన తిరుపతిలో హాట్ టాపిక్ అయింది. యూనిఫాంను ఎలుకలు కొరికేస్తుంటే నువ్వేం చేస్తున్నావని నెటిజట్లు కామెంట్స్ చేస్తున్నారు.
మద్యం తాగేసిన ఎలుకలు
ఇంట్లో ఎలుకల ఆహార పదార్థాలు ఎత్తుకెళ్లడం చూసుంటాం. ఇటీవల ఓ ఎలుక ఏకంగా నెక్లెస్ ను ఎత్తుకెళ్లింది. గతంలో ఒకసారి ఎలుకలు 12 సీసాల మద్యం హాంఫట్ చేశాయని వార్తలొచ్చాయి. ఈ విచిత్ర ఘటన కరోనా టైంలో తమిళనాడులో నీలగిరి జిల్లాలో చోటుచేసుకుంది. గుడలూర్ సమీపంలోని కదంపూజాలో ప్రభుత్వం నడుపుతున్న వైన్ షాప్ ను కోవిడ్ టైంలో మూసివేశారు. ఆ తర్వాత మద్యం షాపును ఓపెన్ చేసి చూస్తే.. 12 ఖాళీ వైన్ బాటిళ్లు కనిపించాయి. తమిళనాడు ఎక్సైజ్ ఈ విచిత్ర ఘటనపై ప్రకటన కూడా చేశారు.
మద్యం బాటిళ్ల మూతలపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు ఉండంటంతోపాటు.. అందులోని వైన్ మొత్తం ఖాళీ అయ్యిందని అధికారులు తెలియజేశారు. దీంతో ఆ వైన్ ఎలుకలే తాగేశాయని చెప్పుకొచ్చారు. ఇలాంటి విచిత్ర ఘటనలు తరచూ చూస్తుంటాం. ఇటీవల కేరళలోని ఓ జ్యూవెలరీ షాపులో ఎలుక ఏకంగా నెక్లెస్ ఎత్తుకెళ్లింది. వాలెంటెన్స్ డే రోజు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడంతో... తన లవర్ ప్రజెంట్ చేసేందుకేమో అని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేశారు.