Tirumala : తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్, అన్న ప్రసాదాల నాణ్యత పెంచేందుకు టీటీడీ కీలక నిర్ణయం-tirumala ttd decided to establish fssai lab to improve food water quality ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్, అన్న ప్రసాదాల నాణ్యత పెంచేందుకు టీటీడీ కీలక నిర్ణయం

Tirumala : తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్, అన్న ప్రసాదాల నాణ్యత పెంచేందుకు టీటీడీ కీలక నిర్ణయం

Bandaru Satyaprasad HT Telugu
Jul 15, 2024 10:01 PM IST

Tirumala : తిరుమల శ్రీవారిని నిత్యం లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. భక్తులకు టీటీడీ అన్న, జల ప్రసాదాలు అందిస్తుంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ సహకారంతో అన్న, జల ప్రసాదాల నాణ్యత మరింత పెంచేందుకు చర్యలు చేపట్టింది.

 అన్న ప్రసాదాల నాణ్యత పెంచేందుకు టీటీడీ కీలక నిర్ణయం
అన్న ప్రసాదాల నాణ్యత పెంచేందుకు టీటీడీ కీలక నిర్ణయం

Tirumala : తిరుమల అన్న ప్రసాద నాణ్యతపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు టీటీడీ అందిస్తున్న అన్న ప్రసాదాల ముడి సరుకులు ఎఫ్ఎస్ఎస్ఏఐ వారి సహకారంతో మరింత నాణ్యతతో కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఈవో జె.శ్యామల రావు అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఎఫ్ఏస్ఏస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా) సహకారంతో తిరుమలలో అత్యాధునిక పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ ఈవో చెప్పారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలో సోమవారం ఎఫ్ఏస్ఏస్ఏఐ, టీటీడీ అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.

తిరుమలలో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ల్యాబ్

ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మాట్లాడుతూ... తిరుమలకు విచ్చేసే భక్తులకు అందించే ఆహార పదార్థాలలో వినియోగించే ముడి సరుకులను వివిధ టెండర్ల ద్వారా టీటీడీ కొనుగోలు చేస్తోందన్నారు. వీటి నాణ్యతను పెంచేందుకు అత్యాధునికమైన పరిశోధన కేంద్రంను ఎఫ్ఏస్ఏస్ఏఐ సహకారంతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టీటీడీ కొనుగోలు చేస్తున్న వివిధ ముడి సరుకులు అత్యంత నాణ్యతతో ఉండడానికి, వాటిని పరీక్షించేందుకు తిరుమలలో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ లేబరటరీ నాణ్యతను పరిశీలించేందుకు వీలవుతుందన్నారు. తిరుమలలో భక్తులకు అందిస్తున్న జల ప్రసాదం నాణ్యత, వంటశాలలలను ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నామన్నారు. ముడి సరుకుల కొనుగోలుకు సంబంధించి ఎస్ఓపీని తయారు చేయాలని జేఈవోను ఆయన కోరారు.

అన్న, జల ప్రసాదాల నాణ్యత పెంచడానికి సూచనలు

భక్తులకు అందించే అన్న ప్రసాద భవనంలో పనిచేసే సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని ఈవో తెలిపారు. తిరుమలలో ప్రత్యేకంగా ఎఫ్ఏస్ఏస్ఏఐ ల్యాబ్ ను ఏర్పాటు ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని ఇవ్వాలని జేఈవోను ఆదేశించారు. ఈ సందర్భంగా న్యూ దిల్లీకి చెందిన ఎఫ్ఏస్ఏస్ఏఐ సీఈవో కమలవర్ధన్ రావు ఆదేశాల మేరకు, ఫుడ్ సేఫ్టీ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ డాక్టర్ పూర్ణచంద్రరావు.. తిరుమలలో భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాలు, జల ప్రసాదం తదితర అంశాలపై జాగ్రత్తలను, అదేవిధంగా నాణ్యత పెంచడానికి అవసరమైన సూచనలను ఈవోకు వివరించారు. ఈ సమావేశంలో జేఈవో గౌతమి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ ఫాస్ట్ ట్రాక్ నోడల్ అధికారి రవీంద్రారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ ఎఫ్ఏస్ఏస్ఏఐ అధికారి బాలు నాయక్, టీటీడీ సీఈ నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

దళారీ వ్యవస్థకు చెక్ పెట్టేలా చర్యలు

శ్రీవారి దర్శనంతో పాటు వసతి సేవల్లో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు టీటీడీ సిద్ధమైంది. దళారుల ప్రమేయం లేకుండా, మరింత పారదర్శకంగా నేరుగా అందించేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఆఫ్‌లైన్ (కౌంటర్ సేవలు) మరియు ఆన్‌లైన్ (వెబ్ పోర్టల్) రెండింటిలోనూ అందించే సేవలను అనేక మంది మధ్యవర్తులు భక్తులను మోసం చేసి, భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు టీటీడీ గుర్తించింది. గత ఏడాది కాలంగా ఆన్‌లైన్ లో (రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, డిప్, వసతి, ఆర్జిత సేవాలు, వర్చువల్ సేవలు మొదలైనవి) మరియు ఆఫ్‌లైన్ లో (ఎస్ ఎస్ డి టోకెన్లు, వసతి) తదితర సేవల బుకింగ్‌లపై ఇటీవల టీటీడీ విచారణ జరిపింది. ఇందులో ఓకే మొబైల్ నంబర్, మెయిల్ ఐడీలు ఉపయోగించి మధ్యవర్తులు బల్క్ బుకింగ్ పొందినట్లు విచారణలో తేలింది. భక్తులకు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అందిస్తున్న సేవలలో పారదర్శకతను మరింతగా పెంచేందుకు సిద్ధమైంది. ఈ సేవలను మరింత మెరుగుపరిచి ఆఫ్‌లైన్‌లో మరియు ఆన్‌లైన్‌లో టికెట్లు పొందే దళారులు మరియు మధ్యవర్తులపై చర్యలు చేపట్టింది.

Whats_app_banner

సంబంధిత కథనం