Tirumala Hundi Collection: తిరుమల ఆదివారం హుండీ ఆదాయం ఎంతో గెస్ చేయగలరా?-tirumala tirupati devasthanam hundi collection 6 crore above on october 23 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Tirumala Tirupati Devasthanam Hundi Collection 6 Crore Above On October 23

Tirumala Hundi Collection: తిరుమల ఆదివారం హుండీ ఆదాయం ఎంతో గెస్ చేయగలరా?

HT Telugu Desk HT Telugu
Oct 24, 2022 08:21 PM IST

Tirumala Tirupati Devasthanam : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) హుండీ కలెక్షన్ ఆదివారం నాడు రికార్డ్ బ్రేక్ చేసింది. ఒక్క రోజులోనే అత్యధిక ఆదాయం వచ్చింది.

తిరుమల
తిరుమల

తిరుమల(Tirumala) శ్రీవారికి ఆదివారం ఆదాయం భారీ స్థాయిలో వచ్చింది. ఆదివారం ఒక్క రోజులోనే 6.31 కోట్లు హుండీ ఆదాయంతో రికార్డు సృష్టించింది. 2018లో టీటీడీ అత్యధికంగా ఒకే రోజు హుండీ సేకరణ రూ.6.45 కోట్లుగా ఉంది. ఆ తర్వాత అక్టోబర్ 23 ఆదివారం నాడు వచ్చినదే అత్యధికం.

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు సూర్యగ్రహణం(Solar Eclipse) సందర్భంగా శ్రీవారి ఆలయ తలుపులు మూసి వేయనున్నారు. 25న ఉదయం 8.11 నుంచి రాత్రి 7.30 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి వేస్తారు. అన్ని ర‌కాల ప్రత్యేక దర్శనాలు(Special Darshan) ర‌ద్దు అవుతాయి. దర్శనాలకు సంబంధించి సోమవారం ఎలాంటి సిఫార్సు లేఖలు తీసుకోలేదు. సర్వ దర్శనం ఇప్పటికే చాలామంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. కానీ సూర్యగ్రహణం కారణంగా దర్శనం ఉండదు. అక్కడే వేచి ఉండాలి.

సూర్యగ్రహణం(Solar Eclipse) కారణంగా మంగళవారం మొత్తం 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌యం త‌లుపులు మూసివేస్తారు. ఈ మేరకు టీటీడీ ప్రకటించింది. 25వ తేదీ ఉదయం 8.11 నుంచి రాత్రి 7.30 గంట‌ల‌కు ఆల‌యం తలుపులు మూసే ఉంటాయి. మరోవైపు.. లడ్డూ విక్రయాలు, అన్నప్రసాద వితరణ కూడా రద్దు చేస్తున్నారు. గ్రహణం పూర్తయిన తర్వాత ఆలయ శుద్ధి చేస్తారు. ఆ తర్వాత భక్తులకు అనుమతి ఉంటుంది.

సూర్యగ్రహణం అనంతరం.. కేవలం స‌ర్వదర్శనం భ‌క్తుల‌కు మాత్రమే అనుమతి ఇస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని.. టీటీడీ కోరింది. ఇప్పటికే తిరుమలకు భారీగా భక్తులు చేరుకున్నారు. రెండు మూడు రోజుల నుంచి భక్తులు అధిక సంఖ్యలో దర్శనం చేసుకున్నారు. సూర్యగ్రహణం తర్వాత ఆలయం తలుపులు తెరుచుకున్నాక.. భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.

WhatsApp channel