Tirumala Tickets : శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు ఫిబ్రవరి కోటా ఆర్జిత సేవా టికెట్లు విడుదల, ఇదిగో లింక్
శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి- 2025 కోటా టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇవాళ శ్రీవారి కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఆన్ లైన్ లో భక్తులు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల జారీపై టీటీడీ అలర్ట్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి కోటా దర్శన టికెట్లు విడుదల అవుతున్నాయి. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు టీటీడీ అధికారి వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in , యాప్ లలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
నేడు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు
శ్రీవారి కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఇవాళ (నవంబర్ 21) ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఫిబ్రవరి కోటా వర్చువల్ సేవల టికెట్లు, దర్శన స్లాట్లను నవంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
- నవంబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఫిబ్రవరి నెల అంగప్రదక్షిణం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
- నవంబర్ 23న ఉదయం 11 గంటలకు ఫిబ్రవరి కోటా శ్రీవాణి ట్రస్టు టికెట్లు విడుదల చేస్తారు.
- ఇక నవంబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
- నవంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
- ఫిబ్రవరి కోటా గదుల టికెట్లు నవంబర్ 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ.
- నవంబర్ 27వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ టికెట్లు, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ టికెట్లు, మధ్యాహ్నం 1 గంటకు పరకామణి సేవ టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.
ఈవో ఆకస్మిక తనిఖీలు:
టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి బుధవారం సాయంత్రం తిరుమలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంబీ రోడ్డులోని అన్నపూర్ణ హోటల్ భవనాన్ని పరాశీలించారు. అనంతరం దుకాణాల లైసెన్సులను స్వయంగా తనిఖీ చేశారు. ఒక టీ దుకాణంలో టీ సేవించి ధరలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఈవో మీడియాతో…. మాట్లాడుతూ అన్నపూర్ణ హోటల్ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో పరిశీలించడం జరిగిందన్నారు. ఇంజినీరింగ్ అధికారుల నివేదిక ఆధారంగా భవనంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఒకే లైసెన్సుతో రెండు మూడు ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, లైసెన్సులను డిజిటలైజేషన్ చేసి దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమలలో అనధికారికంగా వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు.
సంబంధిత కథనం