తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జూన్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.
పైన పేర్కొన్న శ్రీవారి ఆర్జితసేవలతో పాటు శ్రీవారి దర్శన టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలని టీటీడీ కోరింది. ఇతర వెబ్ సైట్లను నమ్మి... మోసపోవద్దని సూచించింది. ఫేక్ వెబ్ సైట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
సంబంధిత కథనం