తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెళ్తున్నారా? భక్తులు కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలు!-tirumala srivari brahmotsavam 2025 these are must follow rules and darshan guidelines for devotees ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెళ్తున్నారా? భక్తులు కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలు!

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెళ్తున్నారా? భక్తులు కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలు!

Anand Sai HT Telugu

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు మెుదలు అయ్యాయి. ఈ సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

తిరుమల బ్రహ్మోత్సవాలు(ఫైల్ ఫొటో)

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీంతో అధికంగా రద్దీ ఉండే అవకాశం ఉంది. ఇందుకోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు కీలక సూచలను చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో పాటించాల్సిన నియమ నిబంధనల గురించి తెలియజేశారు. ఓ వైపు దసరా సెలవులు రావడంతో భక్తుల అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది.

'శ్రీవారి దర్శనం, వాహన సేవలు సరిగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశఆం. అలిపిరి నుంచి తిరుమల వరకు భద్రతా చర్యలు పటిష్టం చేశాం. చిన్నారుల రక్షణ కోసం చైల్డ్ ట్యాగింగ్ సిస్టమ్ అమలు చేశాం.' అని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. భక్తులు పాటించాల్సిన నియమ నిబంధనల గురించి చెప్పారు. అవేంటో చూద్దాం..

భక్తులు తక్కువ లగేజీతో తిరుమలకు రావాలి.

క్యూ పద్ధతిని కచ్చితంగా పాటించాలి.

వాహన సేవ సమయంలో చిల్లర నాణేలు విసరకూడదు.

నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలను నిలపాలి.

ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ఆర్టీసీ లేదా టీటీడీ బస్సులను ఉపయోగించాలి.

మత్తు పదార్థాలు, మద్యం తీసుకొస్తే కఠిన చర్యలు ఉంటాయి.

ఘాట్ రోడ్లలో ర్యాష్ డ్రైవింగ్ నిషేధం.

గ్యాలరీల్లో కూర్చుని ఇతర భక్తులకు ఇబ్బంది కలిగించకూడదు.

ఏదైనా సమస్యలు ఉంటే 112 నంబర్‌కు కాల్ చేయాలి.

టీటీడీ గురించి తప్పుడు ఆరోపణలు, అసభ్య వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు.

ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల విడుదల వాయిదా

కొన్ని కారణాల వల్ల డిసెంబర్ 29, 30, 31 (వైకుంఠ ద్వార దర్శనం) తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి బ్రేక్ దర్శనాలకు సంబంధించిన టిక్కెట్లు విడుదల చేయలేదు. ఈ టిక్కెట్ల విడుదలకు సంబంధించిన అప్డేట్ చేసిన షెడ్యూల్‌ను త్వరలో టీటీడీ ప్రకటిస్తుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.