Tirumala :10 రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు-ఆ వీఐపీలకే బ్రేక్ దర్శనాలు, సిఫారుసు లేఖలకు నో ఛాన్స్-tirumala news in telugu srivari vaikunta dwara darshan break darshan recommended letters cancelled ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Tirumala News In Telugu Srivari Vaikunta Dwara Darshan Break Darshan Recommended Letters Cancelled

Tirumala :10 రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు-ఆ వీఐపీలకే బ్రేక్ దర్శనాలు, సిఫారుసు లేఖలకు నో ఛాన్స్

Bandaru Satyaprasad HT Telugu
Dec 20, 2023 05:58 PM IST

Tirumala Vaikunta Dwara Darshan : తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ ప్రకటించింది. ఈ పర్వదినాల నేపథ్యంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. డిసెంబ‌ర్ 22న తిరుపతిలో స‌ర్వద‌ర్శనం టోకెన్ల ర‌ద్దు చేశారు.

తిరుమల
తిరుమల

Tirumala Vaikunta Dwara Darshan : తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబ‌రు 23 నుంచి జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు 10 రోజుల పాటు భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శనం క‌ల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. డిసెంబ‌రు 23న వైకుంఠ ఏకాదశి, 24న వైకుంఠ ద్వాదశి సంద‌ర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. డిసెంబ‌రు 22న శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుప‌తిలో మంజూరు చేసే స‌ర్వద‌ర్శనం టైంస్లాట్ టోకెన్లను టీటీడీ ర‌ద్దు చేసింది. భ‌క్తులు తిరుమ‌ల‌లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా స‌ర్వద‌ర్శనంలో ఆరోజు శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌చ్చు. డిసెంబ‌రు 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరుప‌తిలోని తొమ్మిది ప్రాంతాల్లో వైకుంఠ ద్వార ద‌ర్శన టోకెన్ల జారీ ప్రారంభమవుతుంది. టోకెన్లు పూర్తయ్యే వరకు నిరంతరాయంగా టోకెన్ల జారీ జరుగుతుంది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని టీటీడీ కోరింది.

ట్రెండింగ్ వార్తలు

కార్యక్రమాల వివరాలు

డిసెంబ‌రు 23న వైకుంఠ ఏకాద‌శి రోజున ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు ద‌ర్శన‌మిస్తారు. ఈ సంద‌ర్భంగా తిరుమ‌ల నాద‌నీరాజ‌నం వేదిక‌పై మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి భ‌గ‌వ‌ద్గీత‌లోని 18 ఆధ్యాయాల్లో గ‌ల 700 శ్లోకాలతో సంపూర్ణ భ‌గ‌వ‌ద్గీత అఖండ పారాయ‌ణం చేస్తారు. సాయంత్రం 6 గంట‌ల నుంచి విష్ణు సహస్రనామ పారాయ‌ణం నిర్వహిస్తారు. డిసెంబ‌రు 24న వైకుంఠ ద్వాదశి సందర్భంగా తెల్లవారుజామున 4.30 నుంచి 5.30 గంటల వరకు శ్రీ సుద‌ర్శన చక్రత్తాళ్వార్ల చ‌క్రస్నాన మ‌హోత్సవం వైభ‌వంగా జ‌రుగ‌నుంది. ఈరోజున స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి అని కూడా పిలుస్తారు.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

ఈ ప‌ర్వదినాల నేప‌థ్యంలో డిసెంబ‌రు 22 నుంచి 24వ తేదీ వ‌ర‌కు, డిసెంబ‌రు 31, జ‌న‌వ‌రి 1వ తేదీల్లో శ్రీ‌వారి క‌ల్యాణోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. స‌హ‌స్ర దీపాలంకార సేవ‌ను ఏకాంతంగా నిర్వహిస్తారు. ఈ ప‌ది రోజుల పాటు ఇత‌ర ఆర్జిత సేవ‌ల‌ను ఏకాంతంగా నిర్వహిస్తారు.

గ‌తంలో లాగే ఈ ఏడాది కూడా స్వయంగా వ‌చ్చే ప్రోటోకాల్ వీఐపీల‌కు, వారి కుటుంబ సభ్యులకు ప‌రిమిత సంఖ్యలో మాత్రమే బ్రేక్ ద‌ర్శనం కల్పిస్తారు. 10 రోజుల పాటు సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రించ‌మని టీటీడీ స్పష్టం చేసింది.

IPL_Entry_Point