Tirumala : తిరుమల శ్రీవారి నడక దారిలో గుండెపోటుతో డీఎస్పీ మృతి
Tirumala : తిరుమల నడక దారిలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ గుండెపోటుతో కుప్పకూలారు. ఆయనను తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
తిరుమలలో విషాదం
Tirumala : తిరుమల శ్రీవారి నడక మార్గంలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ గుండెపోటుతో మృతి చెందారు. తిరుమల నడక దారిలో 1805వ మెట్టు వద్ద డీఎస్పీ గుండెపోటుతో కుప్పకూలారు. ఆయన వెంటనే తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించగా... మార్గమధ్యలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. డీఎస్పీ కృపాకర్ స్వస్థలం విజయవాడ సమీపంలోని పోరం. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి భద్రతా విధుల కోసం డీఎస్పీ కృపాకర్ తిరుమలకు వచ్చారు. ఈ ఘటనపై ఆయన కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)