Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ వ్యవహారం, రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు-త్వరలో మరిన్ని అరెస్టులు
Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నలుగురిని సిట్ అరెస్టు చేసింది. వీరి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను సిట్ ప్రస్తావించింది. ఆధారాలు చెరిపివేసేందుకు నిందితులు ప్రయత్నించారని, ఫోన్లు ధ్వంసం చేశారని సిట్ పేర్కొంది.

Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో సిట్ బృందం విచారణ వేగం చేసింది. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. నిందితుల రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక అంశాలను ప్రస్తావించింది. నిన్న అరెస్టైన నలుగురిని ఈ కేసులో ఏ-2 నుంచి ఏ-5గా చేర్చారు. అలాగే నెయ్యి సరఫరాదారుల్లో ఒకరిగా ఉన్న వైష్ణవి డెయిరీ సీఈవోను ఏ-8గా పేర్కొన్నారు.
కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి రావడంతో నిందితులు ఆధారాలను చెరిపివేసేందుకు ఫోన్లు ధ్వంసం చేసి కొత్తవి కొన్నారని సిట్ వెల్లడించింది. విచారణలో ఫోన్లు పోయాయని తప్పుడు సమాచారం ఇచ్చారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.
త్వరలో మరికొందరి అరెస్ట్
ఏఆర్ డెయిరీ, వైష్ణవి డెయిరీలు అక్రమాలకు పాల్పడినట్లు సిట్ తేల్చింది. బోలేబాబా డెయిరీ తమ ఉద్యోగులను అజ్ఞాతంలోకి పంపిందని గుర్తించింది. నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేకపోయినా ఏఆర్, వైష్ణవి డెయిరీలు టెండర్లలో పాల్గొన్నాయని రిమాండ్ రిపోర్టులో తెలిపింది. బోలేబాబా డెయిరీ నెయ్యిని తమ పేరిట టీటీడీ సరఫరా చేశారని గుర్తించింది.
కమీషన్ తీసుకొని బోలేబాబా డెయిరీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేశారని పేర్కొంది. కల్తీ నెయ్యి కేసులో నిందితులు విచారణకు సహకరించలేదని సిట్ తెలిపింది. ఈ కేసులో మిగతా వారి ప్రమేయంపై ఆరా తీస్తున్నామని సిట్ బృందం పేర్కొంది. మరిన్ని కీలక ఆధారాలతో త్వరలో మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నలుగురి అరెస్ట్
తిరుమలలో లడ్డూ తయారీల కోసం వినియోగించే నెయ్యిలో కల్తీకి పాల్పడిన ఘటనలో నలుగురిని సిట్ అరెస్ట్ చేసింది. గత ఏడాది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు సిట్‌ను ఏర్పాటు చేసింది. సీబీఐ జేడీ పర్యవేక్షణలో సిట్ కొద్దినెలలుగా దర్యాప్తు చేస్తోంది. ఆదివారం లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యి కల్తీ వ్యవహారంలో 4గురిని సీబీఐ దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది.
భోలే బాబా డైరీకి (రూర్కీ, ఉత్తరాఖండ్) డైరెక్టర్లుగా పనిచేసిన విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డైరీ(పూనంబాక) సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా, ఎఆర్ డైరీ(దుండిగల్) ఎండి రాజు రాజశేఖరన్ లను అరెస్టు చేశారు. క్రైం నెంబర్ 470/24లో అరెస్టు చేసి నిందితులను తిరుపతి కోర్టులో హాజరు పరిచారు. ఎఆర్ డైరీ పేరుతో నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్న వైష్ణవి డైరీ ప్రతినిధులు ఆ తర్వాత అక్రమాలకు పాల్పడ్డారు.
ఏఆర్ డెయిరీ పేరు ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు ఉపయోగించి వైష్ణవి డైరీ టెండర్ కథ నడిపించినట్టు గుర్తించారు. రూర్కీలోని భోలే బాబా దగ్గర నుంచి నెయ్యి తెప్పించినట్లు వైష్ణవి డెయిరీ దొంగ రికార్డులు సృష్టించింది. భోలే బాబా డైరీకి ఇంత మొత్తంలో నెయ్యి సరఫరా సామర్థం లేదని విచారణలో గుర్తించారు. మూడు డెయిరీలకు చెందిన నలుగురు అరెస్టు చేశారు.
ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఉన్న బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు విపిన్ జైన్(45), పోమిల్ జైన్(47).. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెనుమాకలో ఉన్న వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ సీఈవో అపూర్వ వినయ్‌కాంత్ చావ్దా (47), తమిళనాడులోని దిండిగల్‌లో ఉన్న ఏఆర్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజు రాజశేఖరన్(69)లను అరెస్టు చేశారు.
సంబంధిత కథనం