Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు - ఏప్రిల్ నెల కోటా షెడ్యూల్ విడుదల, తేదీలవారీగా వివరాలు-tirumala darshan tickets arjitha seva 2024 april quota tickets released key dates check here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు - ఏప్రిల్ నెల కోటా షెడ్యూల్ విడుదల, తేదీలవారీగా వివరాలు

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు - ఏప్రిల్ నెల కోటా షెడ్యూల్ విడుదల, తేదీలవారీగా వివరాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 17, 2025 06:35 PM IST

Tirumala Darshan Tickets : తిరుమ‌ల శ్రీ‌వారి శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమ‌ల‌, అర్చన‌, అష్టదళ పాదపద్మారాధన సేవల 2025 ఏప్రిల్ నెల కోటా షెడ్యూల్ ను ప్రకటించింది. జ‌న‌వ‌రి 21న ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.

తిరుమలలో వీఐపీ దర్శనం రద్దు
తిరుమలలో వీఐపీ దర్శనం రద్దు

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. సుప్ర‌భాతం, తోమ‌ల‌, అర్చ‌న‌, అష్టదళ పాదపద్మారాధన సేవల ఏప్రిల్‌ నెల కోటాను జ‌న‌వ‌రి 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

yearly horoscope entry point

ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేష‌న్‌ కోసం జ‌న‌వ‌రి 18 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జ‌న‌వ‌రి 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

శ్రీవారి దర్శన టికెట్లు - ముఖ్య తేదీలు:

  • జ‌న‌వ‌రి 21న ఆర్జిత సేవా టికెట్లు : కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లతో పాటు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల ఆర్ధిత సేవా టికెట్లను జ‌న‌వ‌రి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
  • జ‌న‌వ‌రి 21న వర్చువల్ సేవల కోటా : వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఏప్రిల్‌ నెల కోటాను జ‌న‌వ‌రి 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
  • జ‌న‌వ‌రి 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు: ఏప్రిల్‌ నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జ‌న‌వ‌రి 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.
  • శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా: శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఏప్రిల్‌ నెల ఆన్ లైన్ కోటాను జ‌న‌వ‌రి 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
  • వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా: వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా మార్చి నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను జ‌న‌వ‌రి 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.
  • జ‌న‌వ‌రి 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు: ఏప్రిల్‌ నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జ‌న‌వ‌రి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది.
  • గదుల కోటా : తిరుమల, తిరుపతిలో ఏప్రిల్‌ నెల గదుల కోటాను జ‌న‌వ‌రి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఈ టికెట్లన్నీ https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ కోరింది.

Whats_app_banner

సంబంధిత కథనం