Tirumala Brahmotsavam 2022 : శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల బుక్‌లెట్లు ఆవిష్కరణ-tirumala brahmotsavam 2022 srivari brahmostvalu vahana seva details ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Tirumala Brahmotsavam 2022 Srivari Brahmostvalu Vahana Seva Details

Tirumala Brahmotsavam 2022 : శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల బుక్‌లెట్లు ఆవిష్కరణ

HT Telugu Desk HT Telugu
Sep 14, 2022 04:21 PM IST

Tirumala Tirupati Devasthanam : తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు.. వాహ‌న‌సేవ‌ల‌ బుక్‌లెట్లను టీటీడీ కార్యనిర్వహణాధికారి ధ‌ర్మారెడ్డి ఆవిష్కరించారు. సెప్టెంబ‌రు 27 నుంచి అక్టోబ‌ర్ 5వ తేదీ వ‌రకు సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు జ‌రగ‌నున్నాయి.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహన సేవల బుక్ లెట్లను టీటీడీ ఈవో విడుదల చేశారు. సెప్టెంబ‌రు 20న ఉద‌యం 6 నుండి 11 గంట‌ల వ‌ర‌కు కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జ‌రుగ‌నుంది. సెప్టెంబ‌రు 26వ తేదీన రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అంకురార్పణ నిర్వహిస్తారు. సెప్టెంబరు 27న సాయంత్రం 5.45 నుండి 6.15 గంట‌ల మ‌ధ్య మీన ల‌గ్నంలో ధ్వజారోహణం జ‌రగ‌నుంది. బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా అక్టోబరు 1న గరుడ వాహనం, అక్టోబరు 2న స్వర్ణరథం, అక్టోబరు 4న ర‌థోత్సవం, అక్టోబరు 5న చక్రస్నానం జరగనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

వాహనసేవల వివరాలు

సెప్టెంబరు 27న మొద‌టి రోజు సాయంత్రం 5.45 నుండి 6.15 గంట‌ల వ‌ర‌కు ధ్వజారోహణం, రాత్రి 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు పెద్ద శేష వాహనం.

సెప్టెంబరు 28న రెండో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు చిన్నశేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు హంస వాహనం.

సెప్టెంబర్ 29న మూడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు సింహ వాహనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ముత్యపు పందిరి వాహనం.

సెప్టెంబర్ 30న నాలుగో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు సర్వభూపాల వాహనం.

అక్టోబర్ 1న ఐదో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు మోహినీ అవతారం, రాత్రి 7 నుండి గరుడ వాహనం.

అక్టోబర్ 2న ఆరో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు హనుమంత వాహనం, సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు ర‌థ‌రంగ డోలోత్సవం(స్వర్ణ రథం), రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు గజ వాహనం.

అక్టోబర్ 3న ఏడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు చంద్రప్రభ వాహనం.

అక్టోబర్ 4న ఎనిమిదో రోజు ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అశ్వ వాహనం.

అక్టోబర్ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 నుండి 9 గంట‌ల వ‌ర‌కు చక్రస్నానం, రాత్రి 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ధ్వజావరోహణం.

WhatsApp channel