కడప జిల్లాలో దారుణం.. మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఆ తర్వాత హత్య-three year old girl raped and murdered in kadapa district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  కడప జిల్లాలో దారుణం.. మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఆ తర్వాత హత్య

కడప జిల్లాలో దారుణం.. మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఆ తర్వాత హత్య

వైఎస్ఆర్ కడప జిల్లాలో ఘోరం జరిగింది. మూడేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అత్యాచారానికి పాల్పడి, హత్యచేసిన వ్యక్తిని స్థానికులు పట్టుకొని చితకబాదారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రతీకాత్మక చిత్రం (unsplash)

కడప జిల్లా ప్రొద్దుటూరులోని అమృతనగర్‌కు చెందిన దంపతులు.. తమ మూడేళ్ల కుమార్తెను వెంటబెట్టుకొని.. మైలవరం మండలం కంబాలదిన్నేకు బంధువుల పెళ్లికి వెళ్లారు. తమ మూడేళ్ల కుమార్తె పెళ్లి మండపం బయట ఆడుకుంటుంది. ఈ సమయంలో ఓ వ్యక్తి అరటి పండు ఇస్తానని ఆశ చూపించి.. బాలికను ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

ముళ్ల పొదల్లో బాలిక మృతదేహం..

అత్యాచారం విషయం బయటపడుతుందని.. బాలికను దారుణంగా హత్య చేశాడు. అయితే.. కుమార్తె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. సమీపంలో గాలించారు. ఈ క్రమంలో ముళ్ల పొదల్లో బాలిక మృతదేహం కనిపించింది. కూతురు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత కథనం